రవీంద్ర సింగ్ కుష్వాహా
| రవీంద్ర సింగ్ కుష్వాహా | |||
| పదవీ కాలం 2015 – 2020 | |||
| ముందు | చిత్తరంజన్ శర్మ | ||
|---|---|---|---|
| తరువాత | మహా నంద్ సింగ్ | ||
| పదవీ కాలం 1995 – 2000 | |||
| ముందు | కృష్ణ నందన్ ప్రసాద్ సింగ్ | ||
| నియోజకవర్గం | అర్వాల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1953 జనవరి 7 హిచ్చన్ బిఘా, బీహార్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | హర్దయాల్ సింగ్ | ||
| నివాసం | హిచాన్ బిఘా, దౌద్‌నగర్, ఔరంగాబాద్, బీహార్, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రవీంద్ర సింగ్ కుష్వాహా బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు అర్వాల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రవీంద్ర సింగ్ కుష్వాహా చిన్న కుమారుడు గౌరవ్ అలియాస్ దివాకర్ బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలోని హిచ్చన్ బిఘా గ్రామం సమీపంలో 2023లో కాల్చి చంపబడ్డాడు.[1] గౌరవ్ 2020లో అర్వాల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]రవీంద్ర సింగ్ కుష్వాహా జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 బీహార్ శాసనసభ ఎన్నికలలో అర్వాల్ శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ(ఎంఎల్)ఎల్ అభ్యర్థి రామధర్ సింగ్‌పై 29534 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2015 శాసనసభ ఎన్నికలలో ఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చిత్రాంజన్ కుమార్‌పై 17810 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Ex MLA Ravindra Singh' son Diwakar shot dead". Prabhat Khabar. Archived from the original on 16 May 2023. Retrieved 9 October 2023.
- ↑ "Bihar: औरंगाबाद में RJD के पूर्व विधायक के बेटे की हत्या, अपराधियों ने गोलियों से भूना; पिता पर ही आरोप". Dainik Jagran. Archived from the original on 24 May 2023. Retrieved 9 October 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Arwal Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Retrieved 1 December 2025.