గోధుమ లడ్డు

వికీపీడియా నుండి
(రవ్వ లడ్డు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గోధుమ లడ్డు
లడ్డూలు
మూలము
మూలస్థానందక్షిణ ఆసియా
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు ఎర్రని గోధుమలు, ఏలకులు,చక్కెర
వైవిధ్యాలుశనగపిండి ,
ఇతర సమాచారంపండగలు లేదా మతపరమైన కార్యక్రమాలు

గోధుమ లడ్డు లేదా రవ్వ లడ్డు చాలా రుచిగా ఉంటుంది. శనగపిండితో చేసిన లడ్డు కంటే అతి సులువుగా చేసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు[మార్చు]

తయారుచేయు విధానం[మార్చు]

  • ఎర్రగోధుమలు శుభ్రంచేసి బూరెల మూకుడులో వేసి దోరగా వేయించాలి. ఈ గోధుమలను తిరగలిలో విసరాలి. పిండి మరీ మెత్తగా కాకుండా, మరీ రవ్వగా కాకుండా మధ్యస్తంగా ఉండాలి.
  • చక్కెర తిరగలిలో పోసి మెత్తగా విసురుకోవాలి.
  • ఏలకులు పొడి చేసుకొని, ఎండుద్రాక్షలు ఈ గోధుమపిండి, చక్క్రెరపొడితో బాగా కలిపాలి.
  • ఈ మిశ్రమంలో రెండు చెంచాల పాలు గాని, నెయ్యి గాని వేసి కలిపితే చక్కగా ముద్దలాగా అవుతుంది.
  • దీనితో కావలసినంత పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి.

చిట్కాలు[మార్చు]

  • గోధుమలు వేపి, దంచడం ఈ కాలంలో కష్టం. అందువల్ల కొంతమంది బొంబాయిరవ్వతో తయారుచేస్తారు.
  • రవ్వలడ్డు విడిపోకుండా కొంచెం గట్టిగా ఉండదానికి చక్కెరను లేతపాకం చేసి అందులో అన్ని పదార్ధాలు వేసి ఉండలు చుట్టుకుంటారు.

మూలాలు[మార్చు]