రశ్మీ ఠాక్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రశ్మీ ఠాక్రే
రశ్మీ ఠాక్రే


మహారాష్ట్ర ముఖ్యమంత్రి, భార్య
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
28 నవంబర్ 2019
గవర్నరు భగత్ సింగ్ కొశ్యరి
ముందు అమృత ఫడ్నవిస్

సామ్నా‌ పత్రిక సంపాదకురాలు[1] & మార్మిక్ పత్రిక సంపాదకురాలు[2]
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2020
ముందు ఉద్ధవ్ ఠాక్రే

వ్యక్తిగత వివరాలు

తల్లిదండ్రులు మాధవ్ పటాంకర్‌ ( తండ్రి), మీనాతాయ్‌(తల్లి)
జీవిత భాగస్వామి
బంధువులు బాల్ ఠాక్రే (మామయ్య)
సంతానం ఆదిత్య ఠాక్రే, తేజస్ ఠాక్రే

రశ్మీ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి. ఆమె శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా‌కు, మార్మిక్ కు సంపాదకురాలుగా పనిచేస్తుంది.[3] ఆమె సమ్వేద్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, సహాయోగ్ డీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది.[4]

కుటుంబ నేపథ్యం

[మార్చు]

రశ్మి ముంబాయిలోని దంబ్విల్‌ ప్రాంతంలో, ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి మాధప్‌ పటాంకర్‌ (వ్యాపారి), తల్లి మీనాతాయ్‌ (గృహిణి) . రశ్మి ముంబాయి జెజె స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చదివి పట్టభద్రురాలైంది. 1987లో ఎల్‌ఐసి ‘180 రోజుల పథకం’ పేరిట కాంట్రాక్ట్‌ ఉద్యోగుల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. రశ్మి అందులో చేరింది. అక్కడే బాల్ థాకరే తమ్ముడి కొడుకు, ప్రస్తుత మహారాష్ట్ర నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే సోదరి జయవంతితో ఆమెకు స్నేహం ఏర్పడింది. రశ్మికి ఉద్ధవ్‌ను జయవంతి పరిచయం చేసింది. ఆయనకూ, రశ్మికీ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి 1989లో వారు వివాహం చేసుకున్నారు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Rashmi Thackeray takes over as Saamana editor". Chaitanya Marpakwar. Mumbai Mirror. 2 March 2020. Retrieved 7 May 2021.
  2. "After Saamana, Maharashtra CM's Wife Rashmi Thackeray Named Editor of Marmik Too". News18. 4 March 2020. Retrieved 7 May 2021.
  3. Eenadu (1 March 2020). "సామ్నా ఎడిటర్‌గా రష్మీ ఠాక్రే". m.eenadu.net. Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
  4. TV9 Telugu (23 November 2019). "శివసేన కొంపముంచింది ఆ ఇద్దరే..! two person bring damage shiv sena reputation- sivasena loses credibility now- It was rashmi thakre and sanjay raut TV9 Telugu". Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. HMTV (27 November 2019). "గవర్నర్‌తో ఉద్ధవ్ ఠాక్రే దంపతులు భేటీ". Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
  6. India Today (5 March 2020). "The rise and rise of Rashmi Thackeray". Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.