రషీదా హక్ మజుందార్
రషీదా హక్ మజుందార్ | |
|---|---|
রাশিদা হক চৌধুরী | |
| కేంద్ర సమాజ సంక్షేమ శాఖ సహాయ మంత్రి | |
| In office 1979–1980 | |
| 6వ లోక్‌సభ సభ్యురాలు | |
| In office 1977–1979 | |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | రషీదా హక్ మజుందార్ 1926 ఏప్రిల్ 24 తేజ్‌పూర్, బ్రిటిష్ ఇండియా |
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కళాశాల | లేడీ బ్రబౌర్న్ కాలేజ్ (బి.ఎ) |
రషీదా హక్ చౌధురి (24 ఏప్రిల్ 1926 - మరణించిన తేదీ తెలియదు) అస్సాం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయనాయకురాలు. ఈమె 1979 నుండి 1980 వరకు చరణ్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సమాజ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.
ప్రారంభ జీవితం
[మార్చు]రషీదా హక్ 1926 ఏప్రిల్ 24న అస్సాంలోని తేజ్‌పూర్ నగరంలో జన్మించారు. ఈమె కాచర్ జిల్లా హాతిర్‌హార్ గ్రామానికి చెందిన బంగ్లా ముస్లిం మజుందార్ కుటుంబానికి చెందినవారు. ఈమె తండ్రి అల్హాజ్ నసీబ్ అలీ మజుందార్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు.[1] ఈమె శిల్చార్ లోని మిషన్ పాఠశాలలో ప్రాథమిక విద్యను, కోల్‌కతాలోని లేడీ బ్రబౌర్న్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బి.ఎ) డిగ్రీని పూర్తిచేశారు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]రషీదా 1950లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.[3] 1977 సార్వత్రిక ఎన్నికలలో శిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఈమె 1,38,638 ఓట్లు సాధించి, సిపిఐ(ఎం) అభ్యర్థి నూరుల్ హుదాపై 28,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.[4][5] ఈమె బంగ్లాదేశ్ శరణార్థుల సామాజిక సేవా కమిటీలో కూడా పనిచేసారు.[3]
తదనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి చీలిపోయిన కాంగ్రెస్ (యు) పార్టీలో చేరారు. 1979లో చరణ్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర విద్యా, సమాజ సంక్షేమ, సాంస్కృతిక శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.[6][7]
1980 లోక్‌సభ ఎన్నికలలో శిల్చార్ నుండి పోటీ చేసి 46.98% ఓట్లు పొంది, కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి సంతోష్ మోహన్ దేవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.[8]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రషీదా హక్ 1948 డిసెంబరు 28న కాంగ్రెస్ నాయకుడు మోయినుల్ హక్ చౌధురిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[3] ఈమె ప్రస్తుతం మరణించారు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Mazumdar, Eusuf Ahmed (2020), হাতীরহাড় গ্রামের কবরস্থান (in Bengali)
- ↑ Parliament of India, Sixth Lok Sabha, Who's who 1977 (1 ed.). Lok Sabha Secretariat. 1977. p. 125.
- 1 2 3 "Members Bioprofile: Choudhury, Shrimati Rashida Haque". Lok Sabha. Retrieved 1 November 2017.
- ↑ "Statistical Report on the General Elections, 1977 to the Sixth Lok Sabha" (PDF). Election Commission of India. p. 50. Retrieved 1 November 2017.
- ↑ The Indian Journal of Political Science. Vol. 39. Indian Political Science Association. 1978. p. 75.
- ↑ Jain, C. K. (1993). Women Parliamentarians in India. Surjeet Publications. p. 39.
- ↑ "India Ministers". Guide 2 Women Leaders. Retrieved 1 November 2017.
- ↑ "Statistical Report on the General Elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 134. Retrieved 1 November 2017.
- ↑ "Late Rashida Haque Choudhury (wife of late Moinul Haque Choudhury) was the first female Central Minister of independent India from Barak Valley of Assam. She was daughter of former Magistrate of British India Empire, late Nasib Ali Mazumdar of Itkhola, Silchar, Assam". Eusuf Ahmed Mazumdar on Twitter. 9 September 2018. Retrieved 7 December 2022.