రసం
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
రసంలేదా చారు అనేది ఒక దక్షిణ భారత సూపు (ద్రవపదార్థ వంటకం).[1] సంప్రదాయ తయారీ విధానంతో తయారయ్యే ఈ వంటకంలో ప్రధానంగా చింతపండు రసం ఉపయోగించడంతో పాటు అదనంగా టమోటో, మిరప మరియు ఇతర రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు. ఏదేని కూరగాయలు జోడించడంతో పాటు ఉడకబెట్టిన పప్పులును కూడా కొంచెం ఈ రసానికి కలుపుతారు.[2] ప్రస్తుత రోజుల్లో రసం తయారీకి అవసరమైన మసాలా దినుసులన్నింటినీ ఒక్కటిగా జోడించి ముందుస్తుగానే పొడిచేసి అప్పటికప్పుడు ఉపయోగించడానికి వీలుగా రసం పొడి పేరుతో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ రకమైన పొడులు లేదా పేస్టు లాంటివి వాణిజ్యపరంగానూ అందుబాటులో ఉంటున్నాయి.
వీటిని అన్నంతో కలిపి లేదా సూపు రూపంలో తీసుకునేందుకు వీలుగా ఉంటాయి. సంప్రదాయ భోజనంలో ఇది సాంబారు అన్నం తర్వాతి స్థానాన్ని వహించడంతో పాటు దీనితర్వాత పెరుగు అన్నం తీసుకోవడం జరుగుతుంది. రసం అనేది తనకంటూ ప్రత్యేకమైన మసాల దినుసులను కలిగి ఉండడంతో పాటు పూర్తిగా పల్చటి ద్రవ రూపంలో ఉండడం వల్ల సాంబారుతో పోలిస్తే రసం అనేది ఒక విశిష్టమైన రుచిని కలిగి ఉంటుంది.
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
తమిళ భాషలో 'రసం' అంటే ద్రవరూప ఆహారపదార్థం (జ్యూస్) అని అర్థం. రసం అనే మాట అన్నిరకాల జ్యూస్‌లకు వర్తించినప్పటికీ, రసం అని మాత్రమే చెప్పే మాట సాధారణంగా చింతపండు/టమోటో జ్యూస్‌లకు మసాలా దినుసులు జోడించి చేసిన వంటకం అనే అర్థాన్ని సూచిస్తుంది. కన్నడ భాషలో సారు లేదా తెలుగు భాషలో చారు (chaaru) అంటే "సారం" అనే అర్థంతో పాటు "జ్యూస్" లేదా "సూపు" అర్థాలు కూడా వాడుకలో ఉన్నాయి.[3] చారిత్రకంగా, దీన్ని ప్రధానంగా నల్ల మిరియాలు మరియు చింతపండుతో తయారుచేస్తారు. ఈ ఈ రెండూ కూడా సాధారణంగా దక్షిణ భారతదేశంలో స్థానికమైనవిగానే కాకుండా విస్తారంగానూ లభిస్తాయి. అయ్యంగార్లు ద్వారా ఇది సట్రుఅముదు (తమిళం: சாற்றமுது) గా పిలవబడుతోంది.
వలసదారులుగా వచ్చి 16వ శతాబ్దం నుంచి మధురైలో నివసిస్తున్న సౌరాష్ట్రీయులు ఇప్పటికీ దీన్ని పులిచార్ (పులి లేదా పులిపు అంటే పుల్లని (చింతపండు) అని అర్థం.
అదేవిధంగా, రసం అనేది ముల్లిగేటవనీ సూప్‌కి ఆధారంగా ఉంటోంది. ఆంగ్లో ఇండియన్ తయారుచేసే ఈ వంటకం కూడా రసం లాగానే ఉంటుంది.
రకాలు[మార్చు]
రకరకాల దినుసులను ఉపయోగించడం ద్వారా విభిన్న రకాల రసం అందుబాటులో ఉంటోంది:
- టమోటో రసం, [4] నిమ్మ రసం, మిరియాల/మిలగు (మిరియాలు) రసం, వేప రుచి రసం, అల్లం రసం, వెల్లుల్లి రసం, పైనాఫిల్ రసం, [5] పరుపు (పప్పు) రసం మొదలైనవి ఈ కోవలోకే వస్తాయి.
ప్రాంతీయ రకాలు[మార్చు]
- బస్సారు - దీనిపేరు "బసిడ సారు" (కన్నడ) నుంచి వచ్చింది. ఉడకబెట్టిన కూరగాయలు/ఆకుకూరలు/పప్పుల నుంచి తీసిన నీటితో దీన్ని తయారుచేస్తారు.
- మిలగు సారు - ముల్లిగేటవనీ సూప్ (మిలగు = మిరియాలు, తన్నీర్ = నీళ్లు) గా పశ్చిమాన కూడా ఇది సుపరిచితం.
- టమోటో సారు - టమోటో రసాన్ని ప్రధానంగా ఉపయోగించి తయారు చేస్తారు.
- చింత సారు - పప్పులేవీ లేకుండా చింతపండు పులుసు మాత్రమే ప్రధానంగా ఉపయోగించి చేస్తారు.
- హేసారు కల్లు సారు - ఇదొక పెసలుతో చేసే సూప్.
- పప్పుచారు - పప్పులు మరియు టమోటో వేసి చేసే సాధారణ రసం.
- భయిల్లా సారు - కందిపప్పు, కొబ్బరి & చింతపండు పులుసు ఉపయోగించి చేసే అత్యంత సాధారణ రకం రసం.
- మజ్జిగ చారు - మజ్జిగతో చేసే రసం.
- ఉలవ చారు - ఉలవలతో చేసే సూప్.
- కట్టు సారు - ఉడకబెట్టిన పప్పు నుంచి వేరుచేసిన నీటిని కట్టు అని పిలుస్తుంటారు.
- కండతిప్పిలి రసం
- కట్టిన సారు - బెల్లం ఉపయోగించి చేసే మధ్యస్త రకం తీపి రసం.
- జీరిగే సారు - జీలకర్రతో రసం.
- నిమ్మ రసం - నిమ్మ రసంతో చేసే పుల్లని రసం.
- హురలి సారు - ఉలవలుతో చేసే ఒక ఆరోగ్యదాయక రసం.
- మైసూర్ రసం - తినే సెనగలు/పప్పులతో చేసే పరిమళభరిత రసం.
- కుండపుర కొలి సారు - కోడిమాంసంతో తయారుచేస్తారు.
- కొట్టంబరి జీరిగే సారు - ధనియాలు మరియు జీలకర్ర గింజలతో చేసే రసం.
- కడలే సారు - నానబెట్టిన ముడిశెనగలు, కొబ్బరి మరియు అల్లంతో తయారు చేస్తారు.
- అలసంద సారు - అలసందలు మరియు బంగాళాదుంప, కొబ్బరి మరియు అల్లంతో చేస్తారు.
- వంకాయ సారు - వంకాయ & చింతపండు పులుసుతో చేస్తారు.
కర్ణాటకలో సారు[మార్చు]
కర్ణాటకలో తయారుచేసే సారు అనేది తమిళనాడులో తయారుచేసే రసం, ఆంధ్రప్రదేశ్‌లో చేసే చారుకు భిన్నంగా ఉంటుంది. సారులో అత్యధిక మొత్తంలో ప్రొటీన్లు ఉండడంతో పాటు రూపంలో ఇది బాగా చిక్కగా ఉండడంతో పాటు అనేక రకాల దినుసులను కలిగి ఉంటుంది. విశిష్టమైన రీతిలో, పప్పులను ఉడకబెట్టే సమయంలో ఒక చెంచా నూనె కూడా కలుపుతారు. పప్పులను ఉడకబెట్టే సమయంలో దానికి కర్ణాటకలో సారిన పుడి (సారు పొడి) గా సుపరిచితమైన కూర పొడితో పాటుగా ఉప్పు, చక్కెర, నిమ్మ రసం, కరివేపాకు, వేయించిన ఆవాలు మరియు చిటికెడు ఇంగువ పొడిని కలుపుతారు. రసం తయారీ ముగింపుకు చేరే సమయంలోనూ కరివేపాకు కలుపుతారు. ఎంపికచేసిన సందర్భాల్లో, తరిగిన ధనియాల ఆకులు (కొత్తిమీర) మరియు ఎక్కువ మొత్తంలో కొబ్బరిని కూడా చేరుస్తారు.
ఉడిపి భోజనంలో భాగంగా ఉండే కట్టు సారులో సారు పొడిని లేదా టొమోటోని కలపరు. ఇందుకు బదులుగా తొగరి బెలే (పప్పు), అల్లం, నిమ్మ రసం, హింగు (ఇంగువ), కరివేపాకు మరియు కొత్తిమీరలను ఉపయోగిస్తారు. కట్టు సారులో ఆవాలు మరియు మిరప (బియాడ్జీ రకం) ను కలుపుతారు. తెలి సారు అనేది కూడా ఉడిపి భోజనంలో భాగంగా ఉంటుంది, కుండలో వండిన అన్నం గంజితో ఈ రసం తయారు చేస్తారు. అన్నం ఉడికించగా వచ్చిన ఈ చిక్కటి గంజి అక్కడ తెలిగా సుపరిచితం. దీన్ని రసంగా తయారుచేసే సమయంలో ఆవాలు, ఉప్పు, ఇంగువ, బియాడ్జీ మిరపలను నేయి (కాచిన వెన్న) తో వేయించి రసానికి జోడిస్తారు. తెలి సారుని సాధారణంగా పచ్చిబియ్యం లేదా ఉప్పిడి బియ్యం ఉడికించి చేసిన అన్నంతో కలిపి తింటారు.
వీటిని కూడా చూడండి[మార్చు]
- పచ్చిపులుసు
- వేడి మరియు పుల్లటి పులుసు
- తెలుగు వారి వంటల జాబితా
- ఆంధ్ర శాకాహార వంటల జాబితా
సూచనలు[మార్చు]
- ↑ http://web.archive.org/web/20091102032513/http://www.independent.co.uk/life-style/food-and-drink/recipes/rasam-525477.html
- ↑ [69] ^ http://www.హిందూ.com?mp/2006/12/02/కథలు/2006120202090100.htm
- ↑ http://www.expressindia.com/latest-news/Sharing-joys-and-worries-in-city/250634/
- ↑ "టొమాటో రసం తయారీకి కావలసిన పదార్థములు
- ↑ "పైన్ఆపిల్ రసం తయారీకి కావలసిన పదార్థములు"
బాహ్య లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Rasam. |