Jump to content

రసాభరణము

వికీపీడియా నుండి

ఇది 4 ఆశ్వాసముల అలంకారశాస్త్ర గ్రంథము.ఆశ్వాసాంత గద్యలో 'రాసాలంకారం 'అని ఉన్నది.దీనిని రాసార్ణవము అని కూడా పిలుతురు.ఇందు 344 గద్య పద్యములున్నవి. ఒక్కొక్క ఆశ్వాసమునకొక్కొక్క పేరు ఉన్నది. మొదటిది సంజ్ఞా ప్రకరణము.

అరయ సంజ్ఞాప్రకరణ మీరీతి దనిర్చి వెలయు నిట రాత్యాది

స్ఫార ప్రకరణమును శృంగార ప్రకరణము నాయక ప్రకరణమున్.

_ రసాభరణము. పుట. 7

ఇందు రసవివరణము స్పష్టముగా నున్నది.లక్షణముల కుదాహరణము లిచ్చుటలో కొన్ని తావుల విన్నుకోట పెద్దన కంటే అనంతునిదే పైచేయి అని రాసాభరణమునకు పీఠిక వ్రాసిన కోపల్లె శివకామేశ్వర రావు తెలిపినాడు.ఇది విద్యానాథుని ప్రతాపారుద్రీయము ననుసరించుచున్నదని బులుసు వెంకట రమణయ్యగారు అభిప్రాయపడినారు.[1]

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగు వికీసోర్స్ లో ఈ వ్యాస విషయానికి సంబంధించిన పుస్తకాలు/మాధ్యమాలు ఉన్నాయి:
  1. ↑ తెలుగు సాహిత్య సమీక్ష జి. నాగయ్య.
"https://te.wikipedia.org/w/index.php?title=రసాభరణము&oldid=4935507" నుండి వెలికితీశారు