రసాయన పరిశ్రమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లూసియాన లోని చమురు కర్మాగారము - రసాయన పరిశ్రమకు ఒక ఉదాహరణ

రసాయన పరిశ్రమ పారిశ్రామిక రసాయనాలను తయారు చేసే సంస్థలను కలిగి ఉంటుంది. ఆధునిక ప్రపంచ ఆర్థికవ్యవస్థకు మూలమైనటువంటి ఈ పరిశ్రమ, ముడి సరుకులను (నూనె, సహజ వాయువు, గాలి, నీరు, లోహాలు మరియు ఖనిజాలు) 70,000కు పైగా వివిధ ఉత్పత్తులుగా మారుస్తుంది.

ఉత్పత్తులు[మార్చు]

ప్రపంచ వ్యాప్తంగా పాలిమర్స్ మరియు ప్లాస్టిక్స్, ముఖ్యంగా పాలిథిలీన్, పాలిప్రోపిలీన్, పాలివినైల్ క్లోరైడ్, పాలిథిలీన్ టెరాఫ్తలెట్, పాలిస్టిరీన్ మరియు పాలికార్బోనేట్ పరిశ్రమ యొక్క ఉత్పత్తులలో 80% ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం] వినియోగదారుల సరుకులు మరియు వేలకొలది వ్యవసాయక, కర్మాగారపు, నిర్మాణము మరియు సేవా పరిశ్రమలకు ఉత్పత్తులు తయారు చేయుటకు రసాయనాలు వాడబడతాయి. రసాయన పరిశ్రమ తన ఉత్పత్తులను 26% వరకు తనే ఉపయోగిస్తుంది.[ఉల్లేఖన అవసరం] రబ్బరు మరియు ప్లాస్టిక్ ఉత్పత్తులు, నేతపని, అపారెల్, పెట్రోలియం రిఫినింగ్, గుజ్జు మరియు కాగితం మరియు ప్రాథమిక లోహాలు వంటివి ముఖ్యమైన పారిశ్రామిక వినియోగ రంగాలు. రసాయనాలు సుమారుగా $3 ట్రిలియన్‌ల విలువ గల గ్లోబల్ సంస్థ. EU మరియు U.S. రసాయన కంపెనీలు ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారులు.[ఉల్లేఖన అవసరం]

ఉత్పత్తి విభాగాల విభజన[మార్చు]

1928 《ఫ్యూచర్ వార్ అండ్ ది జర్మన్ కెమికల్ ఇండస్ట్రి》

రసాయన వ్యాపారంలో అమ్మకాలను కొన్ని ముఖ్యమైన వర్గాలుగా విభజించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి ప్రాథమిక రాసాయనాలు (డాలర్ ఫలితాంశంలో 35 నుండి 37 శాతం వరకు), జీవ శాస్త్రాలు (30 శాతం), ప్రధాన రసాయనాలు (20 నుండి 25 శాతం) మరియు వినియోగదారుల ఉత్పత్తులు (10 శతం).[ఉల్లేఖన అవసరం]

ప్రాథమిక రసాయనాలు లేదా "వస్తు రసాయనాలు" అనునవి రాసాయనాలలో ముఖ్యమైన వర్గము. ఇవి పాలిమర్స్, పెద్ద పరిమాణంలో పెట్రో రసాయనాలు మరియు అంతర్గాతాలు, ఇతర ఉత్పత్తులు మరియు ప్రాథమిక పరిశ్రమలు, ఇన్ఆర్గానిక్ రసాయనాలు మరియు ఎరువులు కలిగి ఉంటాయి. ప్రాథమిక రసాయనాలకు విశిష్ట అభివృద్ధి రేటు GDPపై 0.5 నుండి 0.7 రెట్లు ఉంటుంది.[ఉల్లేఖన అవసరం] ఉత్పత్తుల ధరలు సాధారణంగా ఒక పౌండుకు యాభై సెంట్ల కంటే తక్కువ ఉంటాయి.[ఉల్లేఖన అవసరం] అతి పెద్ద ఆదాయ భాగమైన పాలిమర్స్, ప్రాథమిక రసాయనాల డాలర్ విలువలో సుమారుగా 33 శాతము ఉంటుంది. దీనిలో అన్ని వర్గాల ప్లాస్టిక్‌లు మరియు నార సంబంధమైన మానవ తయారీలు ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం] పాకేజింగ్, ఇంటి నిర్మాణము, కంటెయినర్స్, ఉపకరణాలు, పైపులు, రవాణా, బొమ్మలు మరియు ఆటలు ప్లాస్టిక్‌ల యొక్క ముఖ్యమైన వాణిజ్య రంగాలు. పాలిమర్ ఉత్పత్తులలో విస్తారమైనది పాలిథిలీన్ (PE). ఇది ఎక్కువగా ఫిలిం పాకేజింగ్ మరియు ఇతర విపణులైన పాల సీసాలు, కంటెయినర్స్ మరియు పైపులు వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. ఇంకొక విస్తారమైన ఉత్పత్తి పాలివినైల్ క్లోరైడ్ (PVC). దీనిని ప్రధానంగా నిర్మాణ రంగంలో ఉపయోగపడే పైపుల తయారీకి మరియు సైడింగ్ కొరకు కూడా వాడతారు. అంతే కాక దీనిని తక్కువ పరిధిలో రవాణా మరియు పాకేజింగ్ సామాగ్రికి కూడా వాడతారు. PVCతో సమానమైన పరిమాణం గల పాలిప్రోపిలీన్ (PP) పాకేజింగ్, ఉపకరణాలు మరియు కంటెయినర్స్ విపణుల నుండి వస్త్ర మరియు తివాసీల విపణులలో ఉపయోగించబడుతుంది. పాలిస్టిరీన్ (PS) అనునది ఇంకొక విస్తారమైన పరమాణం గల ప్లాస్టిక్. దీని ముఖ్యంగా ఉపకరణాలు, పాకేజింగ్, బొమ్మలు మరియు వినోద రంగాలలో ఉపయోగిస్తారు. మానవ తయారీ ఫైబర్లలో ముఖ్యమైనవి పాలిస్టర్, నైలాన్, పాలిప్రోపిలీన్, అక్రిలిక్స్. దీని యొక్క అనువర్తనాలలో అపారెల్, గృహ అమరికలు మరియు ఇతర పారిశ్రామిక మరియు వినియోగ అవసరాలు కూడా ఉన్నాయి. పాలిమర్లకు ప్రధాన ముడి సరుకు ఎక్కువ పరిమాణము గల పెట్రోకెమికల్స్.[ఉల్లేఖన అవసరం]

ఎక్కువ పరిమాణము గల పెట్రోకెమికల్స్ మరియు అంతర్గతాలకు వాడే రసాయనాలను ప్రాథమికంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG), సహజ వాయువు మరియు ముడి తైలాల నుండి తయారు చేస్తారు. వీటి అమ్మకాల పరిమాణము మొత్తం ప్రాథమిక రసాయానాల అమ్మకాలలో దరిదాపుగా 30 శాతం ఉంటుంది.[ఉల్లేఖన అవసరం] ఎక్కువ పరిమాణపు విశిష్ట ఉత్పత్తులలో ఎథిలిన్, ప్రోపైలిన్, బెంజయిన్, టౌలిన్, జైలీన్స్, మిథనాల్, వినైల్ క్లోరైడ్ మోనోమర్ (VCM), స్టైరీన్, బ్యుటాడీన్ మరియు ఇథిలీన్ ఆక్సైడ్ వంటివి ఉన్నాయి. ఈ రసాయనాలు ఎన్నో పాలిమర్లకు మరియు ఇతర ఆర్గానిక్ రసాయనాలు మరియు ప్రత్యేక రసాయన వర్గాలకు మూలము.

సింథటిక్ రబ్బర్, సర్ఫక్టంట్స్, రంగులు మరియు వర్ణాలు, టర్పెంటైన్, గుగ్గిలాలు, కార్బన్ బ్లాక్, విస్ఫోటకాలు మరియు రబ్బరు ఉత్పత్తులు ఇతర ఉత్పన్నకాలు మరియు ప్రాథమిక పారిశ్రామికాలలో కలిగియుండి ప్రాథమిక రసాయనాల బాహ్య అమ్మకాలలో 20 శాతము వంతు భాగం పంచుకుంటాయి. ఇన్ఆర్గానిక్ రసాయనాలు (మొత్తం ఆదాయంలో దాదాపు 12 శాతం) రసాయన వర్గీకరణలలో పురాతనమైనవి. ఈ ఉత్పత్తులు ఉప్పు, క్లోరిన్, కాస్టిక్ సోడా, సోడా ఆష్, ఆమ్లాలు (నైట్రిక్, ఫాస్ఫారిక్ మరియు సల్ఫ్యూరిక్), టైటానియం డయాక్సైడ్ మరియు హైడ్రోజెన్ పెరాక్సైడ్ లను కలిగి ఉంటాయి. అతి చిన్న వర్గము ఎరువులు (దాదాపుగా 6 శాతం). ఇవి ఫాస్ఫేట్స్, అమోనియా మరియు పోటాష్ రసాయనాలను కలిగి ఉంటాయి.

విభజించబడిన రసాయనిక మరియు బయలాజికల్ పదార్థాలు, ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్, పశు ఆరోగ్య ఉత్పత్తులు, విటమిన్లు మరియు క్రిమిసంహారకాలు వంటివన్ని జీవ శాస్త్రాలు (రసాయనిక వ్యాపారంలో డాలర్ ఫలితాంశములో దాదాపు 30 శాతము) లో ఉంటాయి. ఘనపరిమాణంలో ఇతర రసాయన వర్గాల కంటే చిన్నవైనప్పటికి, వాటి ఉత్పత్తులు అధిక వెల కలిగినవిగా ఉంటాయి. పౌండుకు పది డాలర్లకు పైగా ఉంటుంది. అభివృద్ధి రేటు GDP పై 1.5 నుండి 6 రెట్లు ఉంటుంది మరియు వీటి పరిశోధనా మరియు అభివృద్ధికి అమ్మకాలలో 15 నుండి 25 శాతం ఖర్చు చేయబడుతుంది. జీవ శాస్త్ర ఉత్పత్తులు సాధారణంగా ఎంతో ఉన్నతమైన నిర్దేశాలతో ఉత్పత్తి చేయబడతాయి. అంతేకాక అవి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రభుత్వ సంస్థలచే తనిఖీ చేయబడతాయి. "పంట సంరక్షణా రసాయనాలు"గా కూడా పిలువబడే క్రిమిసంహారకాలు ఈ వర్గంలో 10 శాతం ఉంటాయి. వీటిలో హర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ మరియు ఫన్గిసైడ్స్ ఉంటాయి.[ఉల్లేఖన అవసరం]

ప్రత్యేక రసాయనాలు ఆనేవి అధిక విలువలు కలిగి మరియు తొందరగా పెరిగే రకానికి చెందిన రసాయనాలు. ఇవి వివిధ రకముల ఉత్పత్తుల విపణులు కలిగియుంటాయి. ధరలు పౌండుకు ఒక డాలరు ఉండగా విశిష్ట అభివృద్ధి రేటు GDPపై ఒకటి నుండి మూడు రెట్లు ఉంటుంది. అవి సరికొత్త అభినవ ఆలోచనల లక్షణాలు ఉంటాయి. ఉత్పత్తులు వాటి పనిని బట్టి అమ్ముడవుతాయి కాని వాటిలో ఇమిడి ఉన్న రసాయనాల బట్టి కాదు. ఈ ఉత్పత్తులు ఎలెక్ట్రానిక్ రసాయనాలు, పారిశ్రామిక వాయువులు, అడేసివ్ మరియు సీలాంట్స్ మరియు పూతలు, పారిశ్రామిక మరియు సంస్థాగత క్లీనింగ్ రసాయనాలు మరియు కటలిస్ట్‌లను కలిగి ఉంటాయి. ప్రత్యేక రసాయనాల అమ్మకాలలో 15 శాతం వరకు కోటింగ్స్ ఉంటాయి. ఇతర ఉత్పత్తుల అమ్మకాలు 10 నుండి 13 శాతం వరకు ఉంటాయి.[ఉల్లేఖన అవసరం]

ప్రత్యేక రసాయనాలను కొన్నిసార్లు "ఫైన్ కెమికల్స్" అని కూడా అంటారు.

వినియోగదారుల ఉత్పత్తులు సబ్బులు, డిటర్జెంట్లు మరియు కాస్మెటిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు కలిగియుంటుంది. విశిష్ట అభివృద్ధి రేటు GDP పై 0.8 నుండి 1.0 రెట్లు ఉంటుంది.

ప్రతి సంవత్సరము, అమెరికన్ కెమిస్ట్రీ కౌన్సిల్ U.S.లో ప్రాథమిక రసాయనాల యొక్క ఉత్పత్తిలో మొదటి వంద మంది యొక్క పట్టిక తయారు చేస్తుంది. 2000లో మొదటి వంద రసాయనాల సరాసరి ఉత్పత్తి మొత్తము 502 మిలియన్ తన్నులు. ఇది 1990లో 397 మిలియన్లు. ఇన్ఆర్గానిక్ రసాయనాలు పరిమాణంలో అధికంగా ఉన్నప్పటికీ, వాటి తక్కువ ధరల వలన డాలర్ ఆదాయ పరంగా చాలా చిన్నవి. 2000లో మొదటి 100 రాసాయనాలలో ముందున్న 11 రసాయనాలు: సల్ఫ్యూరిక్ ఆసిడ్ (44 మిలియన్ టన్నులు), నైట్రోజెన్ (34), ఇథిలీన్ (28), ఆక్సిజన్ (15), లైం (22), అమోనియ (17), ప్రోపిలీన్ (16), పాలితిలీన్ (15), క్లోరిన్ (13), ఫాస్ఫారిక్ ఆసిడ్ (13) మరియు డైఅమోనియమం ఫాస్ఫేట్స్ (12).

కంపెనీలు[మార్చు]

వివిధ దేశాలలో తమ పరిశ్రమలు స్థాపించిన ప్రపంచ వ్యాప్త వ్యవస్థాపక ఉత్పత్తిదారులు: BASF, డౌ, డెగుస్సా, ఈస్ట్‌మాన్ కెమికల్ కంపెనీ, షెల్, బాయర్, INEOS, ఎక్సాన్‌మొబైల్, డ్యుపాంట్, SABIC, బ్రాస్కేం మరియు మిట్‌సుబిషి. వీటితో పాటుగా వేల సంఖ్యలో చిన్న సంస్థలు ఉన్నాయి.

U.S.లో 170 భారి రసాయన పరిశ్రమలు ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం] ఇవి అంతర్జాతీయంగా పనిచేస్తాయి. ఇందులో 2,800 సదుపాయాలు U.S. బయట ఉన్నాయి మరియు 1,700 విదేశీ అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. U.S. రసాయన ఫలితాంశం ప్రతి యేడు $400 బిలియన్లు. U.S. పరిశ్రమ పెద్దమొత్తంలో వ్యాపార మిగులులు నమోదు చేసింది మరియు యునైటెడ్ స్టేట్స్ లో మాత్రమే ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులను నియమించింది. ఉత్పత్తి క్రమంలో ఎక్కువ ఇంధనము వినియోగించే పరిశ్రమలలో రసాయన పరిశ్రమ రెండవది. ఈ పరిశ్రమ ప్రతి యేటా కాలుష్య నివారణకు గాను $5 బిలియన్లు ఖర్చు చేస్తుంది.

యూరోప్ లో ముఖ్యంగా జర్మనీలో రసాయన, ప్లాస్టిక్ మరియు రబ్బర్ విభాగాలు అతిపెద్ద పారిశ్రామిక విభాగాలు.[ఉల్లేఖన అవసరం] ఇవి అన్ని కలిసి 60,000 కంపెనీలలో 3.2 మిలియన్ల ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. 2000 సంవత్సరము నుండి, EU లోని మొత్తము వ్యాపార మిగులులలో 2/3 రసాయన పరిశ్రమ నుండే ఉండేది. EU ఉత్పత్తి పరిశ్రమ యొక్క యాడెడ్ విలువలో 12% రసాయన పరిశ్రమకు సంబంధించినదే.

రసాయన పరిశ్రమ యాభై సంవత్సరాలకు పైగా ఎంతో త్వరితగతిని అభివృద్ధిని గాంచింది.[ఉల్లేఖన అవసరం] అన్నిటికంటే త్వరగా ఎదిగిన క్షేత్రాలు ప్లాస్టిక్స్, ఫైబర్స్ మరియు ఎలాస్టోమర్స్ గా ఉపయోగపడే సింథటిక్ ఆర్గానిక్ పాలిమర్స్ తయారీ. చరిత్రలోనూ మరియు వర్తమానంలోనూ రసాయన పరిశ్రమ ప్రపంచంలోని మూడు స్థానాలలో కేంద్రీకరించబడింది. అవి పశ్చిమ యూరోప్, ఉత్తర అమెరికా మరియు జపాన్ (ది ట్రయడ్). యురోపియన్ కమ్యూనిటి అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది. USA మరియు జపాన్ దీనిని అనుసరించాయి.

ముడిసరుకు అందుబాటు మరియు ధర, కూలి ఖర్చు, ఇంధన ఖర్చు, ఆర్థికవ్యవస్థ యొక్క మారుతున్న స్థాయిలు మరియు వాతావరణ ఒత్తిడులు రసాయన ఉత్పత్తిలో ది ట్రయడ్ యొక్క పరంపరాగతమైన ఆధిపత్యమునకు సవాలుగా నిలిచాయి. చైనా, ఇండియా, కొరియా, మిడిల్ ఈస్ట్, ఆగ్నేయ ఆసియా, నైజీరియా మరియు బ్రజిల్ దేశాలయోక్క రసాయన పరిశ్రమల అభివృద్ధి మారుతున్న ప్రపంచ రసాయన పరిశ్రమ యొక్క స్థితిగతులలో కీలక పాత్ర పోషిస్తుంది.

సాంకేతిక విజ్ఞానం[మార్చు]

ఇది ఒక టర్బైన్ జెనరేటర్ యొక్క క్రమ చిత్రము.రసాయన పరిశ్రమలో ఉపయోగించే భరించదగ్గ క్రమమును ఉత్పత్తి చేయు ఇంజనీర్లు కొన్ని విషయాలను తెలిసి ఉండాలి. వారు భరించదగ్గ క్రమమును తయారు చేయుటకు ఆలోచన తెలిసియుండాలి మరియు ఆ క్రమము పరిస్థితులను మరియు ఆ క్రమమును ఆపగలిగే విషయాలను, తట్టుకోగాలిగేలా రూపొందించాలి. ఇలా ఆ క్రమమును ఆపగలిగే విషయాలు: వేడి, రాపిడి, పీడనము, ఏమిశంస్, కంటామినంట్స్..

రసాయన ఇంజనీరులు అంగీకరించినట్లుగా, రసాయన పరిశ్రమ రసాయనిక క్రమములలో రసాయన చర్యలు మరియు వివిధ రకముల ఘన, ద్రవ్య మరియు వాయువుల వస్తువుల ఉత్పత్తికికై ఉపయోగించు రిఫైనింగ్ పద్ధతులు కలిగియుంటుంది. ఈ ఉత్పత్తులను ఎక్కువగా ఇతర వస్తువుల తయారీలో వాడుతారు. కొన్ని మాత్రమే వినియోగదారుడు నేరుగా ఉపయోగిస్తాడు. వినియోగదారులచే నేరుగా వాడబడే ఉత్పత్తులలో కొన్ని సాల్వెంట్లు, క్రిమిసంహారకములు, లై, వాషింగ్ సోడా మరియు పోర్ట్లాండ్ సిమెంట్ మొదలైనవి. ఈ పరిశ్రమ తయారీలు: ఇన్ఆర్గానిక్ మరియు ఆర్గానిక్ పారిశ్రామిక రసాయనాలు, సిరామిక్ ఉత్పత్తులు, పెట్రోకెమికల్స్, ఆగ్రోకెమికల్స్, పాలిమర్లు మరియు రబ్బర్ (ఎలాస్టోమర్ లు), ఒలియోకేమికల్స్ (నూనె, కొవ్వు మరియు మైనము), విస్ఫోటకాలు, పరిమళాలు మరియు రుచులు. ఈ ఉత్పత్తుల యొక్క ఉదాహరాలు కింది పట్టికలో చూపించబడ్డాయి.

ది నావెల్ రసాయన రియాక్టర్ వాడబడవలసిన ద్రావకములను 1000 లీటర్ల నుండి 4 లీటర్లకు తగ్గిస్తుంది.
పాలిమర్లు ఎలాస్టోమెర్స్
ఉత్పత్తి రకము ఉదాహరణలు
ఇన్ఆర్గానిక్ పారిశ్రామిక అమోనియా, నైట్రోజెన్, సోడియం హైడ్రాక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆసిడ్, నైట్రిక్ ఆసిడ్
ఆర్గానిక్ పారిశ్రామిక అక్రిలోనైట్రిల్, ఫినాల్, ఎథిలీన్ ఆక్సైడ్, యూరియా
సిరామిక్ ఉత్పత్తులు సిలికా బ్రిక్, ఫ్రిట్
పెట్రోకెమికల్స్ ఎథిలీన్, ప్రోపిలీన్, బెంజాయిన్, స్టిరీన్
ఆగ్రోకెమికల్ స్ ఎరువులు, క్రిమిసంహారకాలు, హేర్బిసైడ్స్
పాలిథిలీన్, బేక్లైట్, పాలిస్టర్
పాలియిస్రోప్రేన్, నియోప్రేన్, పాలియురేతెన్
ఒలియోకెమికల్స్ లార్డ్, సోయాబీన్ తైలము, స్టియరిక్ ఆసిడ్
ఎక్స్ప్లోసివ్స్ నైట్రోగ్లిసరిన్, అమోనియం నైట్రేట్, నైట్రో సెల్ల్యులోస్
వాసనలు మరియు రుచులు బెంజయిల్ బెంజోయెట్, కామరిన్, వెనిలిన్

ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రసాయన పరిశ్రమ గా అనుకున్నప్పటికీ[ఎవరు?], అది ఎన్నో భిన్నమైన లక్షణాలు కలిగియుండడంవల్ల అది వేరుగా వర్గీకరించబడుతుంది. ఇతర పరిశ్రమలలో దగ్గర సంబంధమున్న పరిశ్రమలు: పెట్రోలియం, గ్లాస్, పెయింట్, సిరా, సీలంట్, జిగురు మరియు ఆహార విశ్లేషణ.

రసాయనిక ప్రతిచర్యలలాంటి రసాయనిక ప్రక్రియలను రసాయనిక ఉత్పత్తి కర్మాగారాలలో కొత్త పదార్దాలాను తయారు చేస్తారు. ఈ కొత్త పదార్థాలు ఉత్పత్తి కర్మాగారాలలోని ప్రతిచర్య పాత్రలలో ఏర్పడతాయి. చాలా సందర్భాలలో, ఈ ప్రతిచర్యలను ప్రత్యేకమైన తుప్పు పట్టని పరికరాలలో పెంచబడిన ఉష్ణోగ్రతలు మరియు పీడనాల మధ్య కాటలిస్ట్ ను ఉపయోగిస్తూ నిర్వహిస్తారు. ఈ ప్రతిచర్యల యొక్క ఉత్పత్తులను వివిధ రకములైన ప్రక్రియల ద్వారా వేరు చేస్తారు. అవి డిష్టిలేషన్, ముఖ్యంగా ఫ్రాక్షనల్ డిష్టిలేషన్, ప్రెసిపిటేషన్, క్రిస్టలైసేషన్ ఎడ్జార్ప్షన్, ఫిల్టరేషన్, సబ్లిమేషన్ మరియు డ్రయింగ్. ప్రత్యేకమైన పరికరాలు మరియు ఆన్-సైట్ నాణ్యతా సంరక్షణ ప్రయోగశాలల ద్వారా ప్రక్రియలను మరియు ఉత్పత్తులను ఉత్పత్తి సమయంలో మరియు ఉత్పత్తి తరువాత పరీక్షించడం జరుగుంది. దీని ద్వారా పని సురక్షితముగా జరిగి ఉత్పత్తి అనుకున్న ప్రాతిపదికలతో సరితూగునట్టు చూస్తారు. ఈ ఉత్పత్తులను వివిధ రకముల పద్ధతుల ద్వారా ప్యాక్ చేయడము మరియు అందించడము జరుగుతుంది. అవి పైప్ లైన్స్, టాంక్-కార్స్ మరియు టాంక్-ట్రాక్స్ (ఘనములకు మరియు ద్రవ్యములకు), సిలిండర్లు, పీపాలు, సీసాలు మరియు పెట్టెలు. రసాయన పరిశ్రమలు సాధారణంగా పరిశోధన మరియు అభివృద్ధి కై ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేసుకుని ఉత్పత్తులు మరియు ప్రక్రియలను అభివృద్ధి చేస్తారు. పైలట్ ప్లాంట్ల వంటి ఈ వసతులను మరియు పరిశోధనా సదుపాయాలను ఉత్పత్తి కర్మాగారానికి దూరంగా విడిగా ఏర్పాటు చేసుకోవచ్చు.

చరిత్ర[మార్చు]

చండ్లర్ (2005) ప్రకారము అమెరికన్ మరియు యురోపియన్ రసాయన పరిశ్రమల జయాపజయాలను మూడు ముఖ్య విషయముల ద్వారా చెప్పవచ్చు: "బారియర్స్ టు ఎంట్రి," "స్త్రాటేజిక్ సరిహద్దులు" మరియు అభివృద్ధికి ఉన్న హద్దులు". ఆయన చెప్పిన విధంగా, రసాయన సంస్థలు ఒక నిర్దిష్టమైన నేర్చుకునే పద్దతిని పాటించాయి. దీనివల్ల మొదలు పెట్టినవారు మరియు వారి వెంట నడిచినవారు భవిష్యత్తులో రాబోయే పోటీదారులకు ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ బేసేస్ నిర్మించడం ద్వారా ప్రవేశానికి అడ్డంకులను కల్పించారు. దీనివల్ల వారికి నిర్మాణం, ఉత్పత్తి, పంపిణి మరియు స్థానిక మరియు ప్రపంచవ్యాప్త విపణిలో అమ్మకాలు సాధ్యపడ్డాయి. దీనితో పాటుగా వారు మిగులు ఆదాయాన్ని పునః పెట్టుబడుల "వర్చువస్ స్ట్రాటజీ" ఉపయోగించారు. దీని ద్వారా "కొత్తతరం ఉత్పత్తులను" తెలుసుకోవడానికి మరియు విడుదల చేయడానికి సంబంధించిన "మారుతున్న" ఆర్థిక కొలమానాలను మరియు అవకాశాలను ఉపయోగించుకున్నారు.

21వ శతాబ్దంలో సంస్థలు[మార్చు]

రసాయన పరిశ్రమలో ఎన్నో పెద్ద, మధ్యస్థ మరియు చిన్న సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. 2007లో $10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రసాయన ఉత్పత్తుల అమ్మకాలు ఉన్న సంస్థల వివరాలు దిగువన ఇవ్వబడ్డాయి. కొన్ని సంస్థలకు ఈ రసాయాన అమ్మకాలు వాటి మొత్తం అమ్మకాలలో కొంత శాతం మాత్రమే. (ఉదాహరణకు 2005లో ఎక్సాన్‌మొబైల్స్ యొక్క రసాయన అమ్మకాలు దాని మొత్తం అమ్మకాలలో 8.7 శాతం మాత్రమే).

కంపెనీ, ప్రధానకార్యాలయము 2007 కెమికల్ అమ్మకాలు, బిలియన్స్[1] స్థానం దేశం
BASF SE, లుడ్విగ్షఫెన్, జర్మనీ $65.3 1 Germany
డౌ కెమికల్, మిడ్ల్యాండ్, మిచిగాన్, USA $53.5 2 సంయుక్త రాష్ట్రాలు
INEOS, లిండర్స్ట్, UK $43.6 3 United Kingdom
లిండెల్‌బాసెల్, హూస్టన్, టెక్సాస్, USA $42.8 4 సంయుక్త రాష్ట్రాలు
ఫార్మోసా ప్లాస్టిక్స్, తైవాన్ $31.9 5 Taiwan
డ్యుపాయింట్, విల్మింగ్టన్, డెలావేర్, USA $28.5 6 సంయుక్త రాష్ట్రాలు
సౌదీ బేసిక్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్, రియాద్, సౌది అరేబియా $26.4 7 మూస:Country data SAU
బేయర్, AG, లివర్‌కుసెన్, జర్మనీ 0-2 8 Germany
మిట్‌సుబిషి కెమికల్, టోక్యో,జపాన్ 0-2 9 జపాన్
అక్జో నోబెల్ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ICI), ఆమ్స్టర్డాం/లండన్ $19.9 10 నెదర్లాండ్స్United Kingdom
ఎయిర్ లిక్విడ్, పారిస్, ఫ్రాన్స్ $16.3 11 France
సుమిటోమో కెమికల్, టోక్యో,జపాన్ 0-2 12 జపాన్
ఎవోనిక్ ఇండస్ట్రీస్, AG, ఎస్సెన్, జర్మనీ $15.0 13 Germany
మిట్సుయీ కెమికల్స్, టోక్యో, జపాన్ $14.3 14 జపాన్
అసహి కసేయి, టోక్యో, జపాన్ 13,600 15 జపాన్
టొరె ఇండస్ట్రీస్, టోక్యో, జపాన్ 13,600 16 జపాన్
షెవ్రాన్ ఫిలిప్స్, ది వుడ్‌ల్యాండ్స్, టెక్సాస్, USA $12.5 17 సంయుక్త రాష్ట్రాలు
DSM NV, హీర్లేన్, నెదర్‌ల్యాండ్స్ $12.1 18 నెదర్లాండ్స్
PPG ఇండస్ట్రీస్, పిట్స్‌బర్గ్, పెన్సిల్వేనియా, USA 11,400 19 సంయుక్త రాష్ట్రాలు
షిన్-ఎట్సు కెమికల్ కం.లిమిటెడ్, టోక్యో, జపాన్ 11,400 20 జపాన్
కంపెనీలు ఏ విధంగా రసాయన పరిశ్రమలో ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉద్భావిస్తున్నాయో అదే విధంగా పారిశ్రామిక దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఉన్నాయో మనము చూడవచ్చు. దీనిని ఆ దేశము కాని ప్రాంతము కాని చేయగలిగే బిలియన్ డాలర్ల ఉత్పత్తి యొక్క ఎగుమతిని బట్టి నిర్ణయించగలము. రసాయన విపణి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ, $3.7 ట్రిలియన్ల ప్రపంచ రసాయన ఉత్పత్తి కొన్ని పారిశ్రామిక దేశాలకు మాత్రమే పరిమితమయ్యింది. సంయుక్త దేశాలు మాత్రమే $689 బిలియన్ల ఉత్పత్తి, అనగా, మొత్తం ప్రపంచ రసాయనిక ఉత్పత్తిలో 18.6 శాతం ఉత్పత్తి చేయగలిగింది.[2]
దేశము/ప్రాంతము చే గ్లోబల్ కెమికల్ షిప్‌మెంట్స్ (బిలియన్ల డాలర్లు) [2] 1998 1999 2000 2001 2002 2003 2004 2005 2006 2008 2009
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 416.7 420.3 449.2 438.4 462.5 487.7 540.9 610.9 657.7 664.1 689.3
కెనడా 21.1 21.8 25.0 24.8 25.8 30.5 36.2 40.2 43.7 45.4 47.4
మెక్సికో 19.1 21.0 23.8 24.4 24.3 23.5 25.6 29.2 32.0 33.4 37.8
ఉత్తర అమెరికా 456.9 463.1 498.0 487.6 512.6 541.7 602.7 680.3 733.4 742.8 774.6
బ్రజిల్ 46.5 40.0 45.7 41.5 39.6 47.4 60.2 71.1 82.8 96.4 126.7
ఇతర 59.2 58.1 60.8 63.4 58.6 62.9 69.9 77.2 84.6 89.5 102.1
లాటిన్ అమెరికా 105.7 98.1 106.5 104.9 98.2 110.3 130.0 148.3 167.4 185.9 228.8
ఫ్రాన్స్ 79.1 78.5 76.5 76.8 80.5 99.6 111.1 117.5 121.3 138.4 158.9
జర్మనీ 124.9 123.2 118.9 116.1 120.1 148.1 168.6 178.6 192.5 229.5 263.2
ఇటలీ 63.9 64.6 59.5 58.6 64.5 75.8 86.6 89.8 95.3 105.9 122.9
యునైటెడ్ కింగ్‌డం 70.3 70.1 66.8 66.4 69.9 77.3 91.3 95.2 107.8 118.2 123.4
బెల్జియం 27.1 27.0 27.5 27.1 28.7 36.1 41.8 43.5 46.9 51.6 62.6
ఐర్లాండ్ 16.9 20.1 22.6 22.9 29.1 32.3 33.9 34.9 37.5 46.0 54.8
నెదర్లాండ్స్ 29.7 29.4 31.3 30.6 32.2 40.1 49.0 52.7 59.2 67.9 81.7
స్పెయిన్ 31.0 30.8 30.8 31.9 33.4 42.0 48.9 52.7 56.7 63.7 74.8
స్వీడెన్ 11.1 11.4 11.2 11.0 12.5 15.9 18.2 19.3 21.2 21.2 22.6
స్విట్జర్లాండ్ 22.1 22.2 19.4 21.1 25.5 30.3 33.8 35.4 37.8 42.7 53.1
ఇతర 27.1 26.8 25.9 26.4 27.9 33.5 38.6 42.9 46.2 50.3 58.9
పశ్చిమ ఐరోపా 503.1 504.0 490.4 488.8 524.4 630.9 721.9 762.7 822.4 935.4 1,076.8
రష్యా 23.8 24.6 27.4 29.1 30.3 33.4 37.5 40.9 53.1 63.0 77.6
ఇతర 22.3 20.3 21.9 23.4 25.3 31.4 39.6 46.2 55.0 68.4 87.5
మధ్య/తూర్పు ఐరోపా 46.1 44.9 49.3 52.5 55.6 64.8 77.1 87.1 108.0 131.3 165.1
ఆఫ్రికా & మిడిల్ ఈస్ట్ 52.7 53.2 59.2 57.4 60.4 73.0 86.4 99.3 109.6 124.2 160.4
జపాన్ 193.8 220.4 239.7 208.3 197.2 218.8 243.6 251.3 248.5 245.4 298.0
జపాన్ మినహా ఆసియా-పసిఫిక్ 215.2 241.9 276.1 271.5 300.5 369.1 463.9 567.5 668.8 795.5 993.2
చైనా 80.9 87.8 103.6 111.0 126.5 159.9 205.0 269.0 331.4 406.4 549.4
ఇండియా 30.7 35.3 35.3 32.5 33.5 40.8 53.3 63.6 72.5 91.1 98.2
ఆస్ట్రేలియా 11.3 12.1 11.2 10.8 11.3 14.9 17.0 18.7 19.1 22.8 27.1
కొరియా 39.3 45.5 56.3 50.4 54.9 64.4 78.7 91.9 103.4 116.7 133.2
సింగపూర్ 6.3 8.5 9.5 9.4 12.5 16.1 20.0 22.0 25.8 28.9 31.6
తైవాన్ 21.9 23.7 29.2 26.8 28.4 34.3 44.5 49.5 53.8 57.4 62.9
ఇతర ఆసియా/పసిఫిక్ 24.8 29.1 30.9 30.8 33.3 38.8 45.5 52.9 62.9 72.2 90.8
ఆసియా/పసిఫిక్ 409.0 462.3 515.7 479.7 497.7 587.8 707.5 818.8 917.3 1041.0 1291.2
ప్రపంచ మొత్తం షిప్‌మెంట్స్ 1573.5 1625.5 1719.0 1670.9 1748.8 2008.5 2325.6 2596.4 2858.1 3160.7 3696.8

వీటిని కూడా చూడండి[మార్చు]

  • రసాయనిక యంత్రవిద్య/ఇంజనీరింగ్
  • ఫార్మాస్యూటికల్ పరిశ్రమ
  • మూలముల మరియు వాటి మిశ్రమముల ధరలు

సూచనలు[మార్చు]

  1. "INEOS_Gassmaks09_Trondheim_Final". Retrieved 2009-06-06. Cite web requires |website= (help)[permanent dead link]
  2. 2.0 2.1 "గ్లోబల్". మూలం నుండి 2010-10-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-08. Cite web requires |website= (help)
  • ఫ్రెడ్ అఫ్టలియాన్ ఎ హిస్టరీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కెమికల్ ఇండస్ట్రి. యునివర్సిటి ఆఫ్ పెన్సిల్వేనియా ప్రెస్. 1991. ఆన్లైన్ వెర్షన్
  • ఈ.యన్.బ్రన్ద్ట్. అభివృద్ధి కంపెనీ: డౌ కెమికల్'స్ మొదటి శతాబ్దము. మిచిగాన్ స్టేట్ యునివర్సిటి ప్రెస్. xxii+ 650 pp. అపెండిసీస్, బిబ్లియోగ్రఫి మరియు పట్టిక ఎంచుకోండి. ISBN 0-87013-426-4. ఆన్లైన్ రివ్యు
  • ఆల్ఫ్రెడ్ డి. చండ్లర్. పారిశ్రామిక శతాబ్దమునకు ఆకారము ఏర్పరుచుట: ది రిమార్కబుల్ స్టోరి ఆ ది ఎవల్యుషన్ ఆఫ్ ది మాడర్న్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ . హార్వర్డ్ యునివర్సిటి ప్రెస్, 2005. 366 pp. ISBN 0-674-01720-X. 3-6 అధ్యాయాలు USA లోని డ్యుపాంట్, డౌ కెమికల్స్, మన్సాంటో, అమెరికన్ సైనామిడ్, యునియన్ కార్బైడ్ మరియు అలీడ్ గురించి మరియు యురోపియన్ రసాయన ఉత్పత్తిదారులైన బేయర్, ఫార్బెన్ మరియు ICI గురించి ప్రస్తావిస్తాయి.
  • మైఖేల్ మెక్‌కాయ్, et al., "ఫాక్ట్స్ & ఫిగర్స్ ఆఫ్ ది కెమికల్ ఇండస్ట్రీ", కెమికల్ మరియు ఇంజనీరింగ్ వార్తలు, 84 (29), జూలై 10, 2006, pp. 35–72.
  • ష్రీవ్, ఆర్.నారిస్, మరియు జోసెఫ్ ఏ. బ్రింక్ జు. ది కెమికల్ ప్రాసెస్ ఇండస్ట్రీస్. 4th ed. న్యూ యార్క్: మెక్‌గ్రా-హిల్:1.