Jump to content

రహస్యం (ధారావాహిక)

వికీపీడియా నుండి


రహస్యం
అరవంలో రహస్యం 2, మర్మదేశం డీవీడీ కవరు
సృష్టికర్తమిన్బిమ్బంగళ్
రచయితఇంద్రా సౌందర్ రాజన్
దర్శకత్వంనాగ
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్ఈనాడు సంస్థలు (రామోజీరావు)
నిడివి30 నిమిషాలు
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఈనాడు
చిత్రం ఫార్మాట్576i (SDTV)
వాస్తవ విడుదల1997 –
2001

రహస్యం నాగద్వారా దర్శకత్వంలో వచ్చిన తెలుగు ధారావాహిక నాటిక. ఇది మొట్టమొదటగా అరవంలో మర్మదేశం అనే పేరుతో వెలువడింది.

ప్రముఖ తారాగణం

[మార్చు]
  • డా॥కే.ఆర్ / డా॥కళ్యాణరాంగా ఢిల్లీ గణేశ్
  • మూగస్వామిగా చారుహాసన్
  • లలితగా వాసుకి
  • మణి సుందరంగా రాంజీ
  • దేవిగా నిమ్మీ
  • రుద్రపతి ఐపీఎస్ గా పూవిళంగు మోహన్
  • డా॥విశ్వరాంగా మోహన్ వి. రామ్
  • ప్రసాద్ గా ప్రిథ్వి రాజ్
  • గుడిలో పూజారిగా సదాశివం
  • రచయిత శ్రీకాంత్ గా ఇంద్రా సౌందర్ రాజన్
  • అణ్ణామలైగా నళినీకాంత్
  • వైద్యుడుగా కృష్ణన్
  • అంశవల్లిగా మోహనప్రియ
  • అగ్నిరాజుగా శుభలేఖ సుధాకర్
  • సీసీఐడీ ఆఫీసర్ గా అజయ్ రత్నం
  • దేవదర్శిని

కథలు

[మార్చు]

ఈ రహస్యం వరుసలో 5 ధారావాహికలు వచ్చాయి. ఇవన్నీ కూడా అతీంద్రియ శక్తుల మీద రచింపబడినవి. ఇవన్నీ కాల్పనికాలయినప్పటికీ, నిజ జీవితంలో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, మూఢ నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. ముఖ్యమయిన కథలు:

  • రహస్యం -నవపాషాణ లింగాల ఔషధ గుణాల గురించి తెలిపే కథ. ఈ వరుసలో మొదటిది, ఈటీవీలో ప్రసారమయింది.
  • మర్మదేశం - రహస్యం 2 గా జెమినీ టీవీలో ప్రసారమయింది. వీరభద్రుడనే గ్రామదైవం గుఱ్ఱం మీద వచ్చి తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తాడనే నేపథ్యంతో నడిచే కథ.
  • స్వర్ణ రేఖ - రహస్యం 3 గా జెమినీ టీవీలో ప్రసారమయింది. హస్తసాముద్రిక శాస్త్రం గురించిన కథ.
  • మర్మకళ - రహస్యం 4 గా జెమినీ టీవీలో ప్రసారమయింది. మర్మ కళను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
  • ధర్మచక్రం - రహస్యం 5 గా జెమినీ టీవీలో ప్రసారమయింది. కల్పవృక్షం, ప్రకృతి మొదలగు విషయాలను పరిశీలించే కథ.

రహస్యం

[మార్చు]

రహస్యం వరుసలో మొదటిది ఈ రహస్యం. శివుడి నవపాషాణ లింగాల అతీత శక్తులను చెప్పే కథ. సిద్ధాపురం అనే పల్లెటూరులోని సిద్ధేశ్వరాలయంలో కథ మొదలవుతుంది. అక్కడ తండోపతండాలుగా భక్తులు రావడం, అంతుపట్టని రోగాలెన్నో ఆ గుడికి వస్తే నయం అవడం, గుడిలో జరిగే వింతలు. గుడిని ఆనుకొని ఉన్న మూగస్వామి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో శారీరిక, మానసిక రోగాలను నయం చేయడం. ఈ నేపథ్యంలో కథ మొదలవుతుంది. గుడి సాయంత్రం 6 నుండి ఉదయం 6 వరకూ మూసి వేసి ఉండడం, ఆ సమయంలో గుడిలో యెతీంద్రులు వచ్చి పూజలు చేస్తారని నమ్మడం. ఆ సమయంలో గుడిలోకి చొరబడి యెతీంద్రుల పూజలను భగ్నం చేసేవారిని గుడి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కుక్క రూపంలో వచ్చి శిక్షిస్తాడని నమ్ముతారు. ఈ నమ్మకాలను మూఢనమ్మకాలని నిరూపించాలని కొందరు హేతువాదులు కూడా ఆ గ్రామానికి వస్తారు. అలా వచ్చ్చిన వారిలోఒకడు శ్రీకాంత్ అనే విలేఖరి. అతడు ఒక రాత్రి గుడి తలుపులు మూస్తుండగా గుడిలోనే ఉండిపోయి ఏం జరుగుతుందో తెలుసుకుందామనుకుంటాడు. కానీ ఆ రాత్రి కుక్క ద్వారా అతడు చంపివేయబడతాడు. అక్కడితో గ్రామప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది. శ్రీకాంత్ స్నేహితుడు, గుడి ప్రధాన పూజారి చిన్న కొడుకు మణి సుందరం కూడా హేతువాదే. తరచూ తండ్రితో పలు విషయాలపై గొడవ పడుతూ ఉంటాడు. నమ్మకాలను మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తాడు. వరుసగా నలుగురు చనిపోతారు. అదే సమయంలో డా॥కె.ఆర్ అనే పేరున్న మానసిక చికిత్సకుడు మతీస్థిమితం లేని పరిస్థితిలో ఆ గ్రామానికి వస్తాడు. మూగస్వామి ఆశ్రమంలోకి మణి ద్వారా చేర్చబడతాడు, ప్రసాద్, డా॥ కె.ఆర్ కొడుకు, తన తండ్రిని వెతుక్కుంటూ ఆ గ్రామానికి వస్తాడు. అలావచ్చి మణి ఇంట అతిథి అవుతాడు. అక్కడ మణి చెల్లెలు ల్లలితను కూడా కలుస్తాడు. మరో పక్క ప్రసాద్ తో మణి కలిసి గుడికి సంబంధించిన రహస్యాలను ఛేదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు, అప్పుడే డా॥కె.ఆర్ కూడా అదే పని మీద నాటకమాడుతూ ఆ ఊరు వచ్చాడని తెలుసుకుంటారు. పూర్వరంగంలో ఒక మంత్రి కొడుకు మానసిక చికిత్స కోసం డా॥కె.ఆర్ ని ఆ మంత్రి సంప్రదిస్తాడు. కానీ డాక్టర్ వద్ద అసిస్టెంట్ ఆ చికిత్సను సక్రమంగా జరగనివ్వడు. దాంతో చికిత్స విఫలమయిందని మంత్రి తన కొడుకుని మూగస్వామి ఆశ్రమానికి తీసుకువెళ్ళి నయం చేయించుకుంటాడు, డాక్టర్ కు ఇది నచ్చక, మూగస్వామి ఆశ్రమంలో జరిగే విషయాలను కనుక్కోవాలని ఇలా నటిస్తూ ఆశ్రమంలో చేరతాడు. ఆశ్రమం విషయాలను కనుక్కునే ప్రయత్నంలో మరొక పెద్ద మర్మాన్ని కనుక్కుంటాడు. మణి, డాక్టర్ కలిసి ఈ రహస్యాన్ని మరింత ఛేదిద్దామనుకుంటారు. రాత్రి పూటల కొందరు ఆగుంతకులు గుడిలోకి రహస్య ద్వారం ద్వారా ప్రవేశిస్తున్నారని, వీళ్ళే కుక్కల ద్వారా మనుషులను చంపుతున్నారని కనుక్కుంటారు. ఆ వ్యక్తులు నవపాషాణ లింగాలను వెతుకుతున్నట్టు కనుక్కొంటాడు మణి. వారి వద్ద అప్పటికే ఆరు లింగాలు దొరికినట్టూ, మరో మూడిటి కోసం వెతుకుతున్నట్టు తెలుస్తుంది. మణిని ఆ ఆగుంతకులు గుర్తించి కుక్కలను వదులుతారు. మణి కుక్కలను చంపి దొంగలను తరిమేస్తాడు. పోలీసుల దర్యాప్తు మొదలవుతుంది. అసలు నిందితుడు మణి స్నేహితుడైన వైద్యుడు అని తెలుస్తుంది. ఆ వైద్యుడు లింగాలను తీసుకొని చెన్నైకి పారిపోతూ ఉండగా లారీ గుద్ది కోమాలోకి వెళిపోతాడు. లింగాలున్న పెట్టె చెన్నైకి తరలి వెళ్ళిపోతుంది. ఇక ఆపై కథలో ఏ విధంగా ఈ లింగాలు ఒక చోట నుండి మరో చోటుకి మారతాయో అనదానిపై నడుస్తుంది. లింగాల శక్తి, ప్రాచీన హైందవ గ్రంథాల విలువలను ఇంద్రా మిగితా కథలో తెలుపుతూ కథను ముందుకు నడిపిస్తాడు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]