రహస్యం (సినిమా)
స్వరూపం
| రహస్యం (1967 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
|---|---|
| నిర్మాణం | ఎ. శంకర రెడ్డి |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, కృష్ణకుమారి, సి.హెచ్.నారాయణరావు, ఎస్.వి. రంగారావు, బి. సరోజాదేవి, గుమ్మడి, రమణారెడ్డి, జి. వరలక్ష్మి, రాజశ్రీ |
| సంగీతం | ఘంటసాల |
| నిర్మాణ సంస్థ | లలితా శివజ్యోతి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
రహస్యం 1967, నవంబర్10 విడుదలైన తెలుగు సినిమా. [1] వేదాంతం రాఘవయ్య దర్శకత్వం లో , లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై ఎ శంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం, అపజయం పాలైనది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, కాంతారావు, ఎస్. వి.రంగారావు, బి సరోజాదేవి, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు. వెంకట్రామయ్య, సూర్య కాంతం, రాజనాల, గిరిజ, నాగయ్యలు నటించారు.
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు_మందకుడు
- బి.సరోజాదేవి_ కుమారి
- అంజలీదేవి_ ఆదిపరాశక్తి
- తాడేపల్లి లక్ష్మి కాంతారావు_రవిచంద్ర
- కృష్ణకుమారి_ రాజ్యలక్ష్మి
- సామర్ల వెంకట రంగారావు_రక్తాభిష
- గుమ్మడి వెంకటేశ్వరరావు_శ్రీకాంత ప్రభు
- ఉప్పలదడియం నాగయ్య_కరుణాకర మహారాజు
- రాజనాల కాళేశ్వరరావు_విరూపాక్షుడు
- రేలంగి వెంకట్రామయ్య_త్రిశంకు
- తిక్కవరపు వెంకట రమణారెడ్డి_ కృష్ణ
- హరనాథ్_నారద మహర్షి
- గరికపాటి వరలక్ష్మి_చంద్రమ్మ
- సూర్యకాంతం_ మల్లమ్మ
- గిరిజ_శర్వాణి దేవి
- గీతాంజలి_ మీనాక్షి
- చదలవాడ నారాయణరావు_నాగయ్య
- వంగర వెంకటసుబ్బయ్య_ కరుణాకర పూజారి
- ఝాన్సీ_ కామాక్షి
- జయంతి
- ముదిగొండ లింగమూర్తి .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
- చిత్రానువాదం: వెంపటి సదాశివ బ్రహ్మం
- కధ: ఆర్.సుబ్రమణ్యం పిళ్ళై
- సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు
- గీత రచయితలు: మల్లాది రామకృష్ణశాస్త్రి, వెంపటి సదాశివ బ్రహ్మం,సింగిరెడ్డి నారాయణరెడ్డి,సముద్రాల రాఘవాచార్య
- నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పులపాక సుశీల, పి.లీల, కోమల, వైదేహి, పద్మ, మల్లిక్, సరోజిని
- ఛాయ గ్రహణం: పి.ఎల్.రాయ్
- ఎడిటింగ్: వేణు
- పంపిణీదారులు: వాణి ఫిలింస్
- నిర్మాత: అల్లారెడ్డి శంకర్ రెడ్డి
- నిర్మాణ సంస్థ: లలితా శివజ్యోతి పిక్చర్స్
- విడుదల:10:11:1967.
పాటలు
[మార్చు]- అల్పుడవని నిన్ను ఆగ్రహించను (సంవాద పద్యాలు) - ఘంటసాల, మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం
- ఇదియే దేవ రహస్యం హృదయాంతరంగశిరలాస్యం - పి.లీల, సుశీల
- ఉన్నదిలే దాగున్నదిలే నీకన్నుల ఏదో ఉన్నది అదినన్నే - ఘంటసాల, సుశీల - రచన: డా॥ సినారె
- ఈ జన్మ సరిపోదు గురుడా ఇంకొక జన్మమెత్తక తప్పదుర - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- ఏవో కనులు కరుణించినవి ఈమేను పులకించినది - పి.లీల, ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- ఏనొక రాజచంద్రుడ అహీనతపీస్వని (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- కంటిన్ గంటి అజాండ భాండములనేకంబు ఏలు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- గిరిజా కల్యాణం - ఘంటసాల, పి.సుశీల, లీల, కోమల, వైదేహి, పద్మ, మల్లిక్, మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం
- చారడేసి కనులతొ చేరుకొంటి నిన్ను గగనమంత మనసుతో - సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
- జలజాతాసన వాసవాదులున్ నీ సంకల్పమావంతయున్ (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- జననీ నీ శుభదర్శనంబునను నా జన్మంబు ధన్యత్వ (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- తిరుమల గిరివాసా దివ్యమందహాసా వరదాభయ లీలా నవ్య చిద్విలాసా - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- దీని భావము నీకే తెలుయునురా ఆనందకృష్ణా - ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- దేవి సాక్షాత్కరించి స్వాధీనయైన స్వార్దమేవీడనట్టి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- దేవినే రక్తభీషుణుండు ధిక్కరించి మోక్షమందక (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- నారద శిష్యుడైన తపమునన్ మహనీయుల (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- నీపదసేవ జేసి మహనీయ తప:ఫలమంది (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- నాదు సమస్త శక్తులన్ నాశము చెందిన చెందుగాక (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- నిటలాక్షుండు రమేశు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- మగరాయా వలరాయ ఈ వయ్యారి నీసొమ్ము రారా - సుశీల, ఘంటసాల - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- మమ్ము పరీక్షసేయుటకు మానవనాధుడు వచ్చినాడు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
- లలితభావ నిలయ నవరసానంద హృదయా - ఘంటసాల, వైదేహి, కోమల, పద్మ, సరోజిని - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సత్యస్తితిలయేశ్వరీం నమామీ లలితాం (శ్లోకం) - ఘంటసాల
- శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరిరామాయా సర్వమంగళా - పి.లీల -రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- షడాననం చందనలిప్తగాత్రం మహౌజసం దివ్యమయూర వాహనం (శ్లోకం) - ఘంటసాల
- సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే (శ్లోకం) - ఘంటసాల
- సత్యామయా గురుడ సత్యామాయ దేవి చెప్పిన మాట (బిట్) - ఘంటసాల
- సాధించనౌనా జగానా పలు పంతాలతో - ఘంటసాల, సుశీల - రచన: సముద్రాల రాఘవాచార్య
- మందాక ఆగు తొందర మాని (పద్యం) ఘంటసాల. రచన: సదాశివ బ్రహ్మం
- ఆకాశంబున నుండి శంభుని (పద్యం)
- ఎన్నడు పాప కార్యముల,(పద్యం), పి.లీల, రచన: సదాశివబ్రహ్మం
- కనులనిండు భక్తి కరుణయే జనకుడు,(పద్యం), పి.లీల
- త్రయీ కదంబ మంజరి తమో, మాధవపెద్ది సత్యం, రచన: మల్లాది
- పరమదయా స్రవంతి నిజ భక్తుల,(పద్యం), మాధవపెద్ది సత్యం ,రచన: సదాశివ బ్రహ్మం
- ముక్తా విద్రుమ హేమనీల,(దేవీస్తోత్రమ్), మాధవపెద్ది
- యా దేవీ మధు కైటభ ప్రశమని ,(దేవీ స్తోత్రం), మాధవపెద్ది
మూలాలు
[మార్చు]- ↑ "Rahasyam (1967)". Indiancine.ma. Retrieved 2025-08-17.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.