రాంగఢ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంగఢ్ జిల్లా
జార్ఖండ్ లో రాంగఢ్ జిల్లా స్థానము
జార్ఖండ్ లో రాంగఢ్ జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
పరిపాలన విభాగముNorth Chotanagpur division
ముఖ్య పట్టణంరాంగఢ్ కంటోన్మెంటు
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుహజారీబాగ్
 • శాసనసభ నియోజకవర్గాలురాంగఢ్, మండూ
విస్తీర్ణం
 • మొత్తం1,211 కి.మీ2 (468 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం9,49,159
 • సాంద్రత780/కి.మీ2 (2,000/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత73.92 %
 • లింగ నిష్పత్తి921
ప్రధాన రహదార్లుNH 33 and NH 23
జాలస్థలిఅధికారిక జాలస్థలి

రాంగఢ్ జిల్లా జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాల్లో ఒకటి. రాంగఢ్, ఈ జిల్లాకు కేంద్రం. ఉత్తరాన, పశ్చిమాన హజారీబాగ్ జిల్లా, ఉత్తరాన తూర్పున బొకారో జిల్లా, తూర్పున పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లా, దక్షిణాన రాంచీ జిల్లాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి [1]

బ్రిటిషు వారి కాలంలో రాంగఢ్ ఒక మిలిటరీ జిల్లాగా ఉండేది.

చరిత్ర, భౌగోళికం[మార్చు]

2007 సెప్టెంబరు 12 న రాంగఢ్ జిల్లా ఏర్పడింది. హజారీబాగ్ జిల్లా నుండి కొంత ప్రాంతాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పరచారు. ఈ జిల్లా గనులకు, పరిశ్రమలకూ కేంద్రం. మాతా ఛిన్నమస్త దేవాలయం ఇక్కడ ప్రసిద్ధిమైనది.[2] జిల్లా విస్తీర్ణం 1,36,008 చ.కి.మీ. ఈ జిల్లా హజారీబాగ్ లోక్‌సభ నియీజకవర్గంలోకి వస్తుంది. జిల్లాలో రాంగఢ్, మండూ శాసనసభ నియోజకవర్గాలున్నాయి.

ఈ జిల్లా ఛోటానాగపూర్ పీఠభూమిపై ఉంది. జిల్లా లోని అధిక భాగం దామోదర్ లోయలో భాగంగా ఉంటుంది. 1,049 మీ. ఎత్తున్న బర్కా పహాడ్[3] జిల్లా లోని ఎత్తైన పర్వతం. ఇది రాంగఢ్, రాంచీ జిల్లాల సరిహద్దుపై ఉంది

నదులు[మార్చు]

దామోదర్, జిల్లాలోని ప్రధానమైన నది. ఇతర చిన్ననదుల్లో హుర్‌హురి, గోమతి, బర్కి, కోచీ, షేర్‌బుకి, ధోబ్‌ధాబ్ లు ఉన్నాయి.

పత్రాటు వద్ద నజ్‌కరీ ఆనకట్ట

జిల్లా ఆగ్నేయ భాగంలో సువర్ణరేఖ నది ప్రవహిస్తోంది.[4] జిల్లా లోని పత్రాటు వద్ద నజ్‌కరీ నదిపై ఆనకట్ట నిర్మించారు. దీని నుండి రాంగఢ్ కంటోన్మెంటుకు, పత్రాటు తాప విద్యుత్కేంద్రానికీ నీరు సరఫరా అవుతుంది.

జలపాతాలు[మార్చు]

భైరవి, దామోదర్ నదుల సంగమ స్థలంలో రాజరప్ప జలపాతం ఉంది.


మూలాలు[మార్చు]

  1. "Ramgarh District Map, Map of Ramgarh District".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-30. Retrieved 2020-06-11.
  3. Survey of India, toposheet No.F45B6, 2009.
  4. Survey of India, toposheet No.F45B11 and 73/E.