రాందాస్ సోరెన్
| రాందాస్ సోరెన్ | |||
| పదవీ కాలం 2024 డిసెంబర్ 5 – 2025 ఆగస్టు 15 | |||
| పదవీ కాలం 2019 డిసెంబర్ 23 – 2025 ఆగస్టు 15 | |||
| ముందు | లక్ష్మణ్ టుడు | ||
|---|---|---|---|
| తరువాత | సోమేశ్ చంద్ర సోరెన్ | ||
| నియోజకవర్గం | ఘట్‌సిలా | ||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| ముందు | ప్రదీప్ కుమార్ బాల్ముచ్చు | ||
| తరువాత | లక్ష్మణ్ టుడు | ||
| నియోజకవర్గం | ఘట్‌సిలా | ||
| పదవీ కాలం 2024 ఆగస్టు 30 – 2024 నవంబరు 28 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1963 జనవరి 1 జంషెడ్‌పూర్, బీహార్, భారతదేశం | ||
| మరణం | 2025 ఆగస్ట్ 15 (వయసు: 62) న్యూఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
| పూర్వ విద్యార్థి | రాంచీ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రాందాస్ సోరెన్ (1 జనవరి 1963 - 15 ఆగస్టు 2025) జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు జార్ఖండ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 డిసెంబర్ 5 నుండి 2025 ఆగస్టు 15 వరకు హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో విద్యా, అక్షరాస్యత శాఖ మంత్రిగా పని చేశాడు.
జననం
[మార్చు]రాందాస్ సోరెన్ 1963 జనవరి 1న తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని ఘోరబంధ గ్రామంలో జన్మించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రాందాస్ సోరెన్ ఘోరబంద పంచాయతీ గ్రామ ప్రధాన్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ఆ తరువాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009, 2019, 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హేమంత్ సోరెన్ మూడో మంత్రివర్గంలో 2024 ఆగస్టు 30 నుండి 2024 నవంబరు 28 వరకు జలవనరుల, ఉన్నత విద్యా & సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా, ఆ తరువాత 2024 డిసెంబర్ 5 నుండి 2025 ఆగస్టు 15 వరకు హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో విద్యా, అక్షరాస్యత శాఖ మంత్రిగా పని చేశాడు.
మరణం
[మార్చు]రాందాస్ సోరెన్ 2025 ఆగస్టు 2న తన నివాసంలోని బాత్రూంలో పడిపోవడంతో ప్రాధమిక చికిత్స అనంతరం జంషెడ్‌పూర్ నుండి ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 62 ఏళ్ల వయసులో ఆగస్టు 15న మరణించాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Jharkhand Education Minister and JMM leader Ramdas Soren passes away" (in Indian English). The Hindu. 16 August 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "Jharkhand Education Minister Ramdas Soren Dies At 62" (in ఇంగ్లీష్). NDTV. 15 August 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "Jharkhand Education Minister Ramdas Soren dies at 62" (in ఇంగ్లీష్). India Today. 16 August 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.