Jump to content

రాకేష్ పాండే

వికీపీడియా నుండి
రాకేష్ పాండే

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022
ముందు సుభాష్ రాయ్
పదవీ కాలం
2002 – 2007
ముందు షేర్ బహదూర్ సింగ్
తరువాత షేర్ బహదూర్ సింగ్
నియోజకవర్గం జలాల్‌పూర్

పదవీ కాలం
2009 – 2014
ముందు నియోజకవర్గం స్థాపించబడింది
తరువాత హరి ఓం పాండే
నియోజకవర్గం అంబేద్కర్ నగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-08-14) 1952 August 14 (age 73)
కొత్వా మొహమద్‌పూర్ , ఉత్తరప్రదేశ్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ
(జనవరి 2022 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ
(జనవరి 2022 వరకు)
జీవిత భాగస్వామి
మంజు పాండే
(m. 1971)
సంతానం 2 (రితేష్ పాండేతో సహా)
నివాసం మొహసిన్పూర్, అంబేద్కర్ నగర్ , ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు

రాకేష్ పాండే (జననం 14 ఆగస్టు 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాకేష్ పాండే ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2002 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జలాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత బహుజన్ సమాజ్ పార్టీలో చేరి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి శంఖ్లాల్ మాఝిపై 22,736 ఓట్ల మెజారిటీతో గెలిచి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాకేష్ పాండే 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హరి ఓం పాండే చేతిలో 1,39,429 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరి 2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జలాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Rakesh Pandey" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 26 June 2025. Retrieved 26 June 2025.
  2. "Ambedkar Nagar Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.