రాఖీ గుల్జార్
రాఖీ గుల్జార్ | |
---|---|
జననం | రాఖీ మజుందార్ 1947 ఆగస్టు 15 రానాఘాట్, నదియా జిల్లా, పశ్చిమ బెంగాల్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1967–2019 |
జీవిత భాగస్వామి | అజయ్ బిస్వాస్
(m. 1963; div. 1965) |
పిల్లలు | మేఘనా గుల్జార్ |
పురస్కారాలు |
|
సన్మానాలు | పద్మశ్రీ పురస్కారం |
రాఖీ గుల్జార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి.[1] అనేక హిందీ సినిమాలు, బెంగాలీ సినిమాలలో కూడా కనిపించింది. 2003లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది.
జననం, విద్య
[మార్చు]భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది గంటలకే 1947 ఆగస్టు 15 తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, నాడియా జిల్లా, రానాఘాట్‌లోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించింది.[2][3] ప్రాథమిక విద్యను స్థానిక బాలికల పాఠశాలలో చదువుకుంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రాఖీకి 1963లో అజయ్ బిస్వాస్ తో వివాహం జరిగింది. వారు 1965లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 1973లో గీత రచయిత, సినిమా దర్శకుడు గుల్జార్ ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె మేఘన గుల్జార్ సినిమా డైరెక్టర్.
సినిమారంగం
[మార్చు]నాలుగు దశాబ్దాల నటనాజీవితంలో, అనేక ఇతర అవార్డులతోపాటు ఒక జాతీయ చలనచిత్ర అవార్డును, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఫిల్మ్‌ఫేర్‌లో మొత్తం 16 సార్లు (ఉత్తమ నటిగా 8సార్లు, ఉత్తమ సహాయ నటిగా 8సార్లు) నామినేట్ చేయబడింది. 1967లో బోధు బోరాన్ అనే బెంగాలీ సినిమాలో గీతాదత్తా ప్రధాన పాత్రలో తొలిసారిగా నటించింది. 1970లో జీవన్ మృత్యువు అనే హిందీ సినిమాలో తొలిసారిగా నటించింది.
అవార్డులు
[మార్చు]- 1973 – దాగ్: ఎ పోయెమ్ ఆఫ్ లవ్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
- 1973 – దాగ్: ఎ పోయెమ్ ఆఫ్ లవ్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా బి.ఎఫ్.జె.ఏ. అవార్డు
- 1974 – 27 డౌన్ సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డు
- 1976 – తపస్య సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
- 1984 – పరోమా సినిమాకి ఉత్తమ నటిగా బి.ఎఫ్.జె.ఏ. అవార్డు
- 1989 – రామ్ లఖన్ సినిమాకి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
- 2003 – శుభో మహురత్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- 2003 – పద్మశ్రీ అవార్డు
నామినేషన్లు
[మార్చు]- 1972 – ఆంఖోన్ ఆంఖోన్ మే సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1976 – కభీ కభీ సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1977 – దూస్రా ఆద్మీకి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1977 – దూస్రా ఆద్మీకి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1978 – తృష్ణకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1979 – జుర్మానా సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1981 – బసేరా సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1983 – శక్తి సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1985 – సాహెబ్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1993 – అనారీకి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1995 – కరణ్ అర్జున్‌కి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1997 – బోర్డర్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
- 1998 – సోల్జర్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
మూలాలు
[మార్చు]- ↑ "Rakhee Gulzar is Unrecognizable as She Makes a Rare Public Appearance". News18. Archived from the original on 4 July 2018. Retrieved 2023-05-17.
- ↑ Saran, Renu (25 February 2014). Encyclopedia of Bollywood–Film Actresses (in ఇంగ్లీష్). Diamond Pocket Books Pvt Ltd. ISBN 978-93-5083-691-0.
- ↑ "Raakhee". Film World (in ఇంగ్లీష్). T.M. Ramachandran. February 1972. p. 11. Retrieved 2023-05-17.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాఖీ గుల్జార్ పేజీ