రాగల 24 గంటల్లో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాగల 24 గంటల్లో
రాగల 24 గంటల్లో సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీనివాసరెడ్డి
రచనకృష్ణ భగవాన్ (మాటలు)
బయ్యవరపు రవి
నిర్మాతకానూరు శ్రీనివాస్
తారాగణంఈషా రెబ్బా, సత్యదేవ్ కంచరాన, శ్రీరామ్, గణేష్ వెంకట్రామ్, ముస్కాన్ సేథి
ఛాయాగ్రహణంఅంజి[1]
కూర్పుతమ్మిరాజు[1]
సంగీతంరఘు కుంచె
నిర్మాణ
సంస్థలు
శ్రీ నవహాస్ క్రియేషన్స్[2]
శ్రీ కార్తీకేయ సెల్యులాయిడ్[2]
విడుదల తేదీ
2019 నవంబరు 22 (2019-11-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

రాగల 24 గంటల్లో 2019, నవంబరు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తీకేయ సెల్యులాయిడ్ పతాకాలపై కానూరు శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఈషా రెబ్బా, సత్యదేవ్ కంచరాన, శ్రీరామ్, గణేష్ వెంకట్రామ్, ముస్కాన్ సేథి నటించగా, రఘు కుంచె సంగీతం అందించాడు.[3] అగాథ క్రిస్టీ రాసిన ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెస్ట్ అనే నాటకం నుండి ఈ చిత్ర కథాంశం తీసుకోబడింది.[4]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి
  • నిర్మాత: కానూరు శ్రీనివాస్
  • మాటలు: కృష్ణ భగవాన్
  • రచన: బయ్యవరపు రవి
  • సంగీతం: రఘు కుంచె
  • ఛాయాగ్రహణం: అంజి
  • కూర్పు: తమ్మిరాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తీకేయ సెల్యులాయిడ్

నిర్మాణం[మార్చు]

ఇప్పటివరకు హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రంతో థ్రిల్లర్ నేపథ్యంలోకి అడుగుపెట్టాడు.[7] ఈ చిత్రకథ విన్న తరువాత శ్రీరామ్ ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించాడు.[8] ఈ చిత్రానికి సంగీతం అందించడానకి రఘు కుంచె తీసుకున్నారు. సెప్టెంబరు తొలివారంలో ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదలవ్వగా, సెప్టెంబరు చివరివారంలో టీజర్ విడుదలైంది. నవంబరులో ట్రైలర్ విడుదలైంది.[3]

పాటలు[మార్చు]

రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. [9][10] వై.వి.సుబ్బారెడ్డి "నారాయణతే నమో నమో" పాటను విడుదలచేశాడు. రఘు బాబు, అలీ పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.[11] దేవి శ్రీ ప్రసాద్ "రెబ్బా" అనే ప్రచార పాటను విడుదల చేశాడు.[12] అక్టోబరులో రెండవ పాట "నమో నమో" విడుదలైంది.[13]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."రెబ్బా"శ్రీమణిరఘు కుంచె4:40
2."నీ చిరునవ్వుకి నమో (నమో నమో)"శ్రీమణిహరిచరణ్, రమ్యశ్రీ కామరాజు4:21
3."ఆకాశాన్నే"భాస్కరభట్ల రవికుమార్నరేష్ అయ్యర్, ముస్కాన్ సేథీ4:23
4."నీ చిరునవ్వుకి"భాస్కరభట్ల రవికుమార్రమ్యశ్రీ కామరాజు4:28
Total length:17:52

విడుదల[మార్చు]

ఈ చిత్రానికి టైమ్స్ ఆఫ్ ఇండియా 2.5/5 రేటింగ్ ఇచ్చింది. "రాగల 24 గంటల్లో సినిమా స్క్రిప్ట్ విషయంలో కాస్త విఫలమయింది. ఈ చిత్రంలోని థ్రిల్లర్ సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలనే మనముందు ఉంచుతుంది" అని పేర్కొంది.[4] "రాగల 24 గంటల్లో అనేది సినిమా పేరుకు తగ్గట్టుగా, ఆ సినిమా చూడటానికి వస్తున్న ప్రేక్షకులకు ఒక హెచ్చరిక" అని ది హిందూ పత్రిక రాసింది.[6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Ragala 24 Gantallo: Motion poster of Eesha Rebba's upcoming film is out - Times of India". The Times of India.
  2. 2.0 2.1 "Ragala 24 Gantallo is successful in entertaining masses: Sathyadev". Telangana Today.
  3. 3.0 3.1 "Raagala 24 Gantallo trailer: Eesha Rebba leads the proceedings in this riveting murder-mystery - Times of India". The Times of India.
  4. 4.0 4.1 4.2 "Raagala 24 Gantallo Movie Review: An exciting story let down by a poor screenplay". The Times of India.
  5. "Raagala 24 Gantalu Telugu Movie Review". November 24, 2019.
  6. 6.0 6.1 Chowdhary, Y. Sunita (November 22, 2019). "'Ragala 24 Gantallo' movie review: A confusing whodunit". The Hindu.
  7. Pecheti, AuthorPrakash. "Ragala 24 Gantallo is an engrossing thriller tale: Srinivas Reddy". Telangana Today.
  8. Kumar, AuthorP Nagendra. "'Story is the hero in Ragala 24 Gantallo'". Telangana Today.
  9. "Ragala 24 Gantallo - All Songs - Download or Listen Free - JioSaavn". JioSaavn.
  10. "Raagala 24 Gantallo Full Songs Jukebox - Satya Dev, Eesha Rebba - Sreenivaas Redde". Aditya Music. 20 November 2019.
  11. "Lyrical video of Ragala 24 Gantalo released". Telangana Today.
  12. "Raagala 24 Gantallo promotional song to be released soon - Times of India". The Times of India.
  13. "Namo Namo from Eesha Rebba and Satyadev's Raagala 24 Gantallo released - Times of India". The Times of India.

ఇతర లంకెలు[మార్చు]