రాజ్‌నంద్‌గావ్ జిల్లా

వికీపీడియా నుండి
(రాజనందగావ్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాజ్‌నందగావ్ జిల్లా
राजनांदगांव जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో రాజ్‌నందగావ్ జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో రాజ్‌నందగావ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
ముఖ్య పట్టణంరాజ్‌నందగావ్
మండలాలు9
Government
 • లోకసభ నియోజకవర్గాలు1
 • శాసనసభ నియోజకవర్గాలు6
విస్తీర్ణం
 • మొత్తం8,070 కి.మీ2 (3,120 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం15,37,133
 • జనసాంద్రత190/కి.మీ2 (490/చ. మై.)
 • Urban
2,31,647
జనాభా వివరాలు
 • అక్షరాస్యత77.2 %
 • లింగ నిష్పత్తి1023
సగటు వార్షిక వర్షపాతం1274 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
రాజనందగావ్ జిల్లాలో ప్రముఖ యాత్రాస్థలం ప్రబల బంబ్లేశ్వరీ ఆలయం నుండి డోంగర్గర్ ప్రాంతం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో రాజ్‌నందగావ్ జిల్లా ఒకటి. రాజ్‌నందగావ్ జిల్లాకు కేంద్రంగా ఉంది.

చరిత్ర

[మార్చు]

1973 జనవరి 26న రాజ్‌నందగావ్ జిల్లా దుర్గ్ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేయగా ఏర్పడింది. 1998లో ఈ జిల్లా నుండి కబీర్‌ధామ్ జిల్లాను రూపొందించారు.[1] ఇది ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగం.[2]

భౌగోళికం

[మార్చు]

జిల్లా వైశాల్యం 8222 చ.కి.మీ.జిల్లా ఉత్తర సరిహద్దులో కబీర్‌ధామ్ జిల్లా, తూర్పు సరిహద్దులో దుర్గ్, దక్షిణ సరిహద్దులో బస్తర్, పశ్చిమ సరిహద్దులో మహారాష్ట్ర లోని గడ్‌ఛిరోలి, భండరా, మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,537,520, [3]
ఇది దాదాపు. గాబన్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 325వ స్థానంలో ఉంది..[3]
1చ.కి.మీ జనసాంద్రత. 191 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.82%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1017:1000 [3]
అక్షరాస్యత శాతం. 76.97%.[3]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

జిల్లాలోని తాలుకా కేంద్రమైన డోంగర్గర్ ప్రత్యేక పర్యాటక కేంద్రం, ప్రముఖ యాత్రాస్థలంగా కూడా ఉంది. ఈ పట్టణంలోని 1600 అడుగిల ఎత్తైన కొండమీద ప్రబల బంబ్లేశ్వరీ ఆలయం ఉంది.[6] ఈ ఆలయానికి 0.5 కి.మీ దూరంలో నేలమట్టం మీద మరొక ఆలయం ఉంది. దీనిని చోటీ బంబ్లేశ్వరీ ఆలయం అంటారు. నవరాత్రి, చైత్ర మాసాల సమయంలో ఈ ఆలయానికి ఛత్తీస్‌గఢ్, వెలుపలి ప్రాంతాల నుండి వేలాది భక్తులు వస్తుంటారు. నవరాత్రి ఉత్సవాలు 24 గంటలూ పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. Official site
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  6. "Official Website of District Rajnandgaon tourism". Archived from the original on 2015-03-03. Retrieved 2014-07-20.

వెలుపలి లింకులు

[మార్చు]