రాజన్ పి. దేవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజన్ పి. దేవ్
Rajan P. Dev 2008.jpg
2008లో కోచ్చి లో జరిగిన కేరళ సినిమా నటుల సంఘం సమావేశంలో రాజన్ పి.దేవ్
జననం(1954-05-20) 1954 మే 20
చేర్తల, ట్రావెంకూర్
మరణం2009 జూలై 29 (2009-07-29)(వయసు 55)
కొచ్చి, కేరళ
వృత్తినటుడు, దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1980–2009
జీవిత భాగస్వామిశాంతమ్మ
పిల్లలుజుబిల్
తల్లిదండ్రులు
  • ఎస్. జె. దేవ్ (తండ్రి)
  • కుట్టియమ్మ (తల్లి)

రాజన్ పి. దేవ్ (1951 మే 20 - జూలై 29, 2009) ఒక భారతీయ సినిమా నటుడు. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి 180 చిత్రాలకు పైగా నటించాడు. ఆయన నటించిన పాత్రల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలున్నాయి. రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.[1] ఆయన కాలేయ వ్యాధి కారణంగా జూలై 29, 2009 న కొచ్చిలో మరణించాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

రాజన్ 1954 లో కేరళలోని చేర్తల[1] అనే ఊర్లో మలయాళ నాటకరంగ నటుడైన ఎస్. జె. దేవ్, కుట్టియమ్మ దంపతులకు జన్మించాడు. మొదట్లో నాటక రంగంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేరళలో 1000కి పైగా ప్రదర్శనలు ఇవ్వబడిన కట్టుకుదిరా అనే నాటకంలో ఆయన పోషించిన కోచువావా అనే పాత్ర చాలా ప్రాచుర్యం పొందింది.

ఆయన భార్య శాంతమ్మ. వారికి ఇద్దరు సంతానం. కుమారుడు జుబిల్ కూడా సినిమా నటుడే.[2]

కెరీర్[మార్చు]

తండ్రి నాటకాల్లో నటిస్తుండటంతో రాజన్ కూడా వివిధ నాటక రంగ సంస్థల్లో చేరి నటుడిగా కెరీర్ ప్రారంభించాడు.[3] సీనియర్ నాటకరంగ నిపుణుడైన ఎన్. ఎన్. పిళ్ళై సంస్థలో అతను వేసిన పాత్రలు బాగా ప్రాచుర్యం పొందాయి. తర్వాత ఎస్. ఎల్. సదానందన్ రూపొందించిన కట్టుకుదిరా అనే నాటకంలో రాజన్ కోచువావా అనే పాత్ర పోషించి కేరళ అంతటా మంచి పేరు సంపాదించాడు. 1984, 86 సంవత్సరాలో కేరళ రాష్ట్రం ఉత్తమ నాటకరంగ నటుడిగా పురస్కారం అందుకున్నాడు.[4] నాటకాల్లో చురుగ్గా కొనసాగుతుండగానే సినిమాల్లో కూడా నటించడం ప్రారంభించాడు. అందులో చాలా సినిమాలు విజయం సాధించినా నాటకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. జుబిలీ థియేటర్స్ అనే నాటక సంస్థను నెలకొల్పి దాని ద్వారా నాటకాలు వేసేవాడు.

రాజన్ 1983 లో ఫాజిల్ దర్శకత్వంలో వచ్చిన ఎంటే మమట్టికుట్టియమ్మక్కు అనే మలయాళ సినిమాతో వెండితెరపైకి ప్రవేశించాడు. తాను నాటకరంగంలో ఎన్నో సార్లు ధరించిన కోచువావా అనే పాత్ర ఆ నాటకాన్ని సినిమాగా తీసునపుడూ తిలకన్ అనే వేరే నటుడికి వెళ్ళినపుడు రాజన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. దాంతో 1990 లో వచ్చిన ఇంద్రజాలం అనే సినిమాలో దర్శకుడు తంపి కన్నంతనం అలాంటి పాత్రనే కార్లోస్ అనే పేరుతో సృష్టించి ఇచ్చాడు. ఈ పాత్ర కూడా చాలా ప్రాచుర్యం పొంది కొన్ని రోజుల దాకా ఆయనకు మారు పేరుగా నిలిచింది.[5] అంతే కాకుండా అనేక సినిమాల్లో ఆయనకు ప్రతినాయక పాత్రల్లో అవకాశం వచ్చింది.

ఆయన పోషించిన చాలా ప్రతినాయక పాత్రలు హాస్యంతో కూడుకుని ఉంటాయి. తరువాత ఆ మూస నుండి బయటపడి కొన్న్ని హాస్య పాత్రల్లో కూడా నటించాడు. తరువాత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించడం ప్రారంభించాడు. 1993 లో ఎస్. శంకర్ తీసిన జెంటిల్మాన్ చిత్రంలో నటించాడు. తెలుగు సినిమాలు ఆది, దిల్, ఖుషి లాంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు మంచి గుర్తింపు సాధించి పెట్టాయి.

సినిమాలు[మార్చు]

తెలుగులో ఆయన నటించిన సినిమాలు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Malayalam actor Rajan P Dev passes away". dnaindia.com. dnaindia.com. Retrieved 21 November 2016.
  2. 2.0 2.1 విలేఖరి. "Late actor Rajan P Dev's son Jubil gets married". english.manoramaonline.com. మనోరమ. Retrieved 21 November 2016.
  3. "Actor who never gave up theatre despite the lure of filmdom". The Hindu. Chennai, India. 30 July 2009. Retrieved 2009-07-30.
  4. http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?contentId=12096335&programId=7940855&channelId=-1073750705&BV_ID=@@@&tabId=3
  5. "Kattukuthira in play acts (in Malayalam)". Malayalam Webduniya. Retrieved 2009-07-30.

బయటి లింకులు[మార్చు]