Jump to content

రాజమకుటం

వికీపీడియా నుండి

రాజమకుటం చిత్రం ,1960 ఫిబ్రవరి 24 విడుదలైన హాస్య, శృంగార, వీరరస ప్రధానమైన విశిష్ట జానపద చిత్రం. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డిదర్శకత్వంలో

నందమూరి తారకరామారావు,రాజసులోచన , జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.

రాజమకుటం
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
నిర్మాణం బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
రచన డి.వి. నరసరాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
రాజసులోచన
రాజనాల,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కన్నాంబ,
పద్మనాభం
సంగీతం మాస్టర్ వేణు
సంభాషణలు డి.వి. నరసరాజు
నిర్మాణ సంస్థ వాహినీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సంక్షిప్త కథ

[మార్చు]

కథలో ప్రతాప సింహుడు ( రామారావు) యువరాజు. మంత్రియైన గుమ్మడి రాజును కుట్ర పన్ని చంపి వేస్తాడు. దానిని యువరాజుకు తెలియనీయకుండా కొంత మంది అమాయకులను రాజహత్యా నేరం క్రింద మరణ శిక్ష విధించేటట్లు చేస్తాడు. ఆ చనిపోయిన వారిలో కథానాయిక ప్రమీల (రాజ సులోచన) అన్న కూడా ఉంటాడు. యువరాజు తన తల్లితో కలిసి దుర్మార్గుడైన మంత్రి ఆట కట్టించడం ఈ చిత్ర కథాంశం.

తారాగణం

[మార్చు]

నందమూరి తారక రామారావు

రాజసులోచన

గుమ్మడి వెంకటేశ్వరరావు

పసుపులేటి కన్నాంబ

రాజనాల

పద్మనాభం .

పాటలు

[మార్చు]
  1. అంజలిదే జననీ దేవీ ... కంజదళాక్షి కామతదాయిని - పి.లీల, రచన:నాగరాజు పేరుతో (బాలాంత్రపు రజనీకాంతరావు)
  2. ఊరేది పేరేది ఓ చందమామా నినుచూచి నిలికలువ - పి.లీల, ఘంటసాల -రచన: నాగరాజు పేరుతో (బాలాంత్రపు రజనీకాంతరావు)
  3. ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు చూడచక్కని చుక్కలరేడు - పి. లీల, రచన:కొసరాజు
  4. చూడచక్కని చుక్కలరేడు .. ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు (బిట్) - ఘంటసాల , రచన:కొసరాజు
  5. ఏటివడ్డున మా ఊరు ఎవ్వరు లేరు మావారు ఏరు దాటి - జిక్కి బృందం , రచన:కొసరాజు
  6. కాంతపైన ఆశ కనకమ్ముపై ఆశలేని వాడు ధరణిలేడురా - మల్లికార్జునరావు బృందం , రచన:కొసరాజు
  7. జయజయ మనోఙ్ఞమంగళ మూర్తి శారదనీరద నిర్మల కీర్తి - సుశీల
  8. జింగన టింగన ఢిల్లా కొంగన ముక్కున జెల్లా రంగు ఫిరాయించి - జిక్కి బృందం, రచన:నాగరాజు పేరుతో (బాలాంత్రపు రజనీకాంతరావు)
  9. రారండోయి రారండోయి ద్రోహుల్లారా విద్రోహుల్లారా - మాధవపెద్ది బృందం , రచన:కొసరాజు
  10. సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే - (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి: పి.లీల
  11. హేయ్... తకిట తకిట ధిమి తబల - ఘంటసాల ( ఎన్.టి. రామారావు మాటలతో ) - రచన: కొసరాజు

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాజమకుటం&oldid=4348550" నుండి వెలికితీశారు