రాజాం నగరపంచాయతీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజాం నగరపంచాయతీ
రాజాం
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ పురపాలక సంఘం

రాజాం నగరపంచాయతీ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం లోని నగర పంచాయతీ. ఈ నగరపంచాయతీ విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం లోని, రాజాం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం రాజాం పట్టణంలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

ఈ నగరపంచాయతీ 2005 లో ఏర్పాటు చేశారు.20 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.[2]

భౌగోళికం[మార్చు]

రాజాం నగర పంచాయతీ అక్షాంశ రేఖాంశాలు 18.28N 83.40E.[3]. సముద్రమట్టం నుండి ఎత్తు 41 మీటర్లు. (137 అడుగులు)లో ఉంది.రాష్ట్ర రాజధాని అమరావతి 481 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం రాజం నగర పంచాయతీ జనాభా 42,197, అందులో 20,969 మంది పురుషులు కాగా 21,228 మంది స్త్రీలు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4523 మంది ఉన్నారు.రాజాం అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 73.63% ఎక్కువ. రాజాంలో పురుషుల అక్షరాస్యత 81.33% కాగా స్త్రీల అక్షరాస్యత 66.07% అక్షరాస్యులు ఉన్నారు.ఈ నగర పంచాయతీ పరిధిలో మొత్తం 10,868 ఇళ్లకు పైగా ఉన్నాయి.నీరు,మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది.[4]

పౌర పరిపాలన[మార్చు]

ఈ నగర పంచాయతీకి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు, వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. Retrieved 2021-10-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Falling Rain Genomics.Razam
  4. "Rajam Nagar Panchayat City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-11-01.
  5. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలు[మార్చు]