రాజా శాండో

వికీపీడియా నుండి
(రాజా సందౌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాజా శాండో

జననం 1894
పుదుక్కొట్టై, తమిళనాడు
మరణం 1943 (aged 48–49)
క్రియాశీలక సంవత్సరాలు 1923 - 1943

రాజా శాండో పరిచయమైన పి.కె.నాగలింగం (1894-1944) భారతీయ సినిమా తొలిరోజుల్లో ప్రసిద్ధి చెందిన మూకీ చిత్ర దర్శకుడు, నిర్మాత. తమిళనాడులోని పుదుక్కొట్టైకి చెందిన సందౌ 1920లలో బొంబాయి మూకీ చిత్రపరిశ్రమలో బాగా సుపరిచితమైన సినిమారంగ ప్రముఖుడు. వస్తాదు, మల్లయోధుడు. ఈయన అద్భుత శరీరదారుఢ్యానికి, తన శారీరక శక్తితో చేసిన అద్భుత విన్యాసాలు, ఈయనకు రాజా శాండో అన్న బిరుదును, దేశమంతటా పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఈ విధంగా సినీరంగంలో ప్రవేశించే అవకాశం వచ్చింది. ఈయన బొంబాయి, మద్రాసులలో అనేక మూకీ చిత్రాలు, తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

1934 చిత్రం ఇందిరా ఎం.ఏ లో రూబీ మేయర్ (సులోచన) తో రాజా శాండో

ఈయన సినిమాలలో కొన్ని ప్రముఖమైనవి, అనాదై పెన్ (1929) - ఈయన దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్ర పోషించాడు, పారిజాతపుష్పాహరణం (1932, బొంబాయిలో నిర్మించిన తమిళచిత్ర్రం), మేనక (1935, తమిళంలో ఒక మైలురాయిగా భావించబడే చిత్రం), చంద్రకాంత (1936, aఅప్పట్లో ఒక సంచలనాత్మక చిత్రం), మైనర్ రాజమణి (1937), తిరునీలకంఠర్ (1939, ఒక ఎం.కె.త్యాగరాజ భాగవతార్ సంగీత సంరభం), చూడామణి (1941, తెలుగు, ఈయనే నిర్మించాడు దీన్ని), శివకవి (1943, ఈ ఎం.కె.త్యాగరాజ భాగవతార్ చిత్రాన్ని చాలామటుకు రాజా శాండో దర్శకత్వం వహించాడు, కానీ నిర్మాత ఎస్.ఎం.శ్రీరాములు నాయుడుతో పొరపొచ్చాలు వచ్చి మధ్యలో వైదొలగాడు). చాలాకాలం విస్మరించబడిన తర్వాత ఎం.జి.రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన తమిళ సినిమాకు చేసిన సేవలకు గానూ, ఈయన స్మృత్యర్ధం ప్రతిష్ఠాత్మక రాజా శాండో పురష్కారాన్ని స్థాపించాడు. [1]

మూలాలు

[మార్చు]
  1. The stamp of honour Archived 2016-08-06 at the Wayback Machine - The Hindu July 10, 2000