Jump to content

రాజీవ్ కుమార్

వికీపీడియా నుండి
రాజీవ్ కుమార్
రాజీవ్ కుమార్


25వ భారత ఎన్నికల కమిషనర్‌‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 మే 15
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు సుశీల్ చంద్ర

భారత ఎన్నికల కమిషనర్‌‌
ముందు సుశీల్ చంద్ర
తరువాత అరుణ్ గోయల్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-02-19) 1960 ఫిబ్రవరి 19 (వయసు 64)
వృత్తి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2020 ఫిబ్రవరిలో ఐఏఎస్‌గా పదవి వీరమణ పొంది 2020 సెప్టెంబరులో భారత ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రాజీవ్ కుమార్ 2022 మే 12న భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

రాజీవ్‌ కుమార్ 1984 బ్యాచ్‌ ఝార్ఖండ్​ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. అతను గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. రాజీవ్ ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ప్రధానమంత్రి ముఖ్య నినాదమైన ఆర్థిక సమ్మిళిత విధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించాడు. ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన, ముద్రా యోజనల ద్వారా పేదలకు ద్రవ్య లభ్యత, ఉపాధి కల్పనలో చొరవ చూపాడు. ఎంఎస్‌ఎంఈ రంగానికి 59 నిమిషాల్లో రుణం అన్న కొత్త పథకాన్ని అమలు చేశాడు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్యదర్శిగా బ్యాంకుల విలీనంలో ముఖ్యపాత్ర పోషించి, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, పెన్షన్‌ వ్యవస్థల పనితీరును పర్యవేక్షించాడు. రాజీవ్‌ కుమార్‌ 2020 ఫిబ్రవరిలో ఐఎఎస్‌గా ఉద్యోగ విరమణ చేసి ఏప్రిల్‌ 2020లో పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు (పీఈఎస్‌బీ) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించి 2020 సెప్టెంబరు 1న ఎన్నికల కమిషనర్‌గా కేంద్ర ఎన్నికల సంఘంలో చేరాడు.

సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం 2022 మే 14తో ముగియండంతో కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తారు. దీనిని అనుసరించి ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 నిబంధన (2) ప్రకారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా రాజీవ్‌ కుమార్‌ను రాష్ట్రపతి సీఈసీగా నియమిస్తున్నట్లు 2022 మే 12న కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.[2] రాజీవ్‌ కుమార్ 2022 మే 15న పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[3] 2025 ఫిబ్రవరి వరకు అతను పదవిలో కొనసాగుతాడు. రాజీవ్‌ పర్యవేక్షణలో 2022 జూన్లో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటుగా, 2024లో సార్వత్రిక ఎన్నికలు, మరి కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (12 May 2022). "Rajiv Kumar appointed as next Chief Election Commissioner, to take charge on May 15" (in ఇంగ్లీష్). Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  2. Sakshi (12 May 2022). "నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా రాజీవ్‌కుమార్‌". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  3. The Hindu (15 May 2022). "Rajiv Kumar takes charge as 25th Chief Election Commissioner, says EC won't shy away from tough calls" (in Indian English). Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.