రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
RAJIV GANDHI INTERNATIONAL AIRPORT
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంPublic
యజమానిఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా
కార్యనిర్వాహకత్వంGMR Hyderabad International Airport Ltd. (GHIAL)[1]
సేవలుహైదరాబాదు
ప్రదేశంశంషాబాద్, ర०గారెడ్డి జిల్లా, హైదరాబాదు, భారతదేశము
ఎయిర్ హబ్
ఎత్తు AMSL2,024 ft / 617 m
వెబ్‌సైటుwww.hyderabad.aero
పటం
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం is located in Telangana
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం is located in India
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
Location within India
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
09R/27L 13,976 4,260 తారు
09L/27R 12,467 3,800 Asphalt
గణాంకాలు (Apr 2013 – Mar 2014)
Passenger movements86,53,784
Aircraft movements87,741
Cargo tonnage86,670
Source: AAI[3][4][5]

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IATA: HYD, ICAO: VOHS), "హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం" లేదా సూక్ష్మంగా RGIA గా పిలువబడుతుంది. ఈ విమానాశ్రయం హైదరాబాదు నగరానికి సుమారు 22 కి.మీ దూరంలో శంషాబాద్ వద్ద నెలకొల్పబడింది.

దీని పేరును భారత దేశ పూర్వపు ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన పేరుతో నామకరణం చేశారు. ఈ విమానాశ్రయం అంతకు పూర్వం గల బేగంపేట విమానాశ్రయం స్థానంలో మార్చబడింది. ఈ విమానాశ్రయం ద్వారా వాణిజ్య సేవలను మార్చి 23 2008 నుండి ప్రారంభించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత పబ్లిక్-ప్రైవేట్ ఉమ్మడి నిర్వహణలో నడుపబడుతున్న రెండవ విమానాశ్రయం. 2010-11 లో భారత దేశ విమానాశ్రయాలలో అతి రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఆరవదిగా నిలిచింది.[6]

ఈ విమానాశ్రయం 2013 లో స్కైట్రాక్స్ ద్వారా ప్రపంచ విమానాశ్రయాలలో అధిక విశేష లక్షణాలున్న విమానాశ్రయంగా అగ్రభాగాన నిలిచింది.[7] ఇది స్పెషల్ జెట్, సుఫ్తాంసా కాంగో, బ్లూడార్ట్ ఏవియేషన్ లకు కూడా తన సేవలందిస్తుంది.

అభివృద్ధి

[మార్చు]

2005 లో దీని డిజైన్, నిర్మానం ప్రారంభించబడింది. ఈ విమానాశ్రయం మార్చి 2008 లో ప్రారంభించబడింది.[8] ఈ విమానాశ్రయం పబ్లిక్, ప్రైవేట్ ఉమ్మడి యాజమాన్యంతొ నడుపబడుతున్నది. ఈ విమానాశ్రయం జి.ఎం.ఆర్ గ్రూపు, మలేసియా ఎయిర్పోర్ట్స్ వంటి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ వంటి పబ్లిక్ సంస్థలతొ పాటు నిర్వహింపబడుతున్నది. ఈ విమానాశ్రయంలో జి.ఎం.ఆర్ గ్రూపు 63%, తెలంగాణ ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియాలకు 13% వాటాలున్నాయి.[1]

రాత్రివేళల్లో విమానాశ్రయం

ఈ విమానాశ్రయం మూడు దశలలో అభివృద్ధి చెందినది. ఇది పూర్తయ్యేనాటికి ఒక యేడాదికి 40 మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు.[9] మొదటి దశ అభివృద్ధిజరిగిన తర్వాత, ప్రతి సంవత్సరానికి 10 మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించే విధంగా సదుపాయాలు కల్పించబడినవి.[9] ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం INR 24.7 బిలియన్లు (US$560 మిలియన్లు).[10] ఈ విమానాశ్రయం 5500 ఎకరాల విస్టీర్ణంలో నిర్మితమైనది. ఈ విమాశ్రాయానికి డిజైన్ను యు.కె ఇంజనీరింగ్ దిజైన్ సంస్థ అయిన "అరూప్ గ్రూప్ లిమిటెడ్" అందించారు.[11]

మొదటి దశ

[మార్చు]

మొదటి దశలో 105000 చదరపు మీటర్ల ఎయిర్ పోర్టు టెర్మినల్ 1 అభివృద్ధి చేయడం జరిగింది. దీని సమర్థ్యం సంవత్సరానికి 14 మిలియన్ల ప్రయాణీకులను సేవలందించే విధంగా నిర్మించబడింది. ఈ టెర్మినల్ 10 కంటాక్ట్ (స్పర్శ), 36 రిమోట్ స్టాండ్లతో కూటుకుని ఉంది. ఇతర భవనాలు అనగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, టెక్నికల్ భవనం, కార్గో హాంగర్స్ (100,000 టన్నుల సామర్థ్యం), నిర్వహణా హాంగర్స్, 49500 చదరపు మీటర్ల స్థలంలో వినియోగాలు మొదలైనవి నిర్మించబడినవి. 1800 కార్ పార్కిక్ స్థలం టెర్మిన 1 కు ముందు వైపున ప్రయాణీకులకు, సందర్శకుల సౌకర్థార్థం నిర్మించబడింది. ఈ దశలో ఒక హోటల్ కూడా నిర్మించబడింది.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్

[మార్చు]
కేఫ్, షాప్స్, హైదరాబాదు ఎయిర్ పోర్టు

ATC టవర్ 75 మీటర్ల పొడవు కలిగి నిలుపుగా స్వేచ్ఛా పరిధిలో ఎయిర్ ఫీల్డును అవిరామంగా చూచే విధంగా ఉంటుంది.[12]

రెండవ దశ

[మార్చు]

రెండవ దశలో విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా టెర్మినల్ 1 ను విస్తరించడం జరిగింది. దీనిని పెరిగిన డిమాండును అనుసరించి 260000 చదరపు మీటర్ల పరిధిలోకి విస్తరించారు. తరువాత విమానాల నిలుపుటకూ 30 స్టాండులు కలిగి ఉండే విధంగా యేర్పాట్లు చేశారు. ఈ టెర్మినల్ ను ప్రతి సంవత్సరం 18మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించే విధంగా విస్తరించారు.

అనేక సౌకర్యాలను అనగా హోటళ్ళు, ఆఫీసులు, కార్గో, నిర్వహనా సదుపాయాలు కల్పించారు. ఈ దశలో అభివృద్ధి అయిన స్థల పరిమాణం 480000 చదరపు మీటర్లు.

చివరి దశ

[మార్చు]

ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో ఈ దశలో అభివృద్ధి చెందినది. ఈ దశలో నిర్మాణాల స్థలం 900000 చదరపు మీటర్లలో 420000 చదరపు మీటర్లు విస్తీర్ణం అధికంగా అభివృద్ధి చేశారు. అంతిమ లక్ష్యంగా సంవత్సరానికి 40 మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించే విధంగా తయారు చేశారు.[11]

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం పురస్కారం విభాగం ఫలితం Ref
2009 సెంట ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ పురస్కారం బెస్ట్ ఎయిర్ పోర్ట్ ఎన్విరాన్‌మెంటల్ పెరపార్మెన్స్ ఆఫ్ ది యియర్
గెలుపు [13]
2010 ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా ఎయిర్ పోర్టు సర్వీసు క్వాలిటీ పురస్కారాలు ఉత్తమ విమానాశ్రమ పరిమాణం ( 5-15 మిలియన్ ప్రయాణీకులు)
1st [14]
2011 ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా

ఎయిర్ పోర్టు సర్వీసు క్వాలిటీ పురస్కారాలు

ఉత్తమ విమానాశ్రమ పరిమాణం ( 5-15 మిలియన్ ప్రయాణీకులు)
3rd [15]
2012 స్కై ట్రాక్స్ ద్వారా వరల్డ్ ఎయిర్ పోర్టు పురస్కారాలు ఉత్తమ విమానాశ్రయం (భారతదేశం) 3rd [16]
2013 స్కై ట్రాక్స్ ద్వారా వరల్డ్ ఎయిర్ పోర్టు పురస్కారాలు ఉత్తమ విమానాశ్రయం (భారతదేశం) 1st [16]
ఉత్తమ విమానాశ్రయం (ఆసియా) 5th
ఉత్తమ విమానాశ్రయం (ప్రపంచ వ్యాప్తంగా) 65th
ఉత్తమ విమానాశ్రమ పరిమాణం ( 5-10 మిలియన్ ప్రయాణీకులు) 7th
2021 ఆసియా-ప‌సిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రిక‌గ్నైజేష‌న్ 2021 గెలుపు [17]
 • 2022 నవంబరు 25, 26 తేదీల్లో బెంగళూరులో జరిగిన క్వాలిటీ సమ్మిట్‌ 30వ ఎడిషన్‌లో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)కు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్త్రీ (సీఐఐ)కి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్వాలిటీ నుంచి జీఎంఆర్‌ రూపొందించిన బిజిలెన్స్‌ ఎక్సలెన్స్‌ మోడల్‌ (జీబీఈఎం)కు ‘గోల్డ్‌’ కేటగిరిలో గుర్తింపు లభించింది. కంటిన్యూస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌, ఐడియా ఫ్యాక్టరీ, నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌, సీఎస్‌ఏటీ ప్రాసెస్‌, కస్టమర్‌ ఫిర్యాదు నిర్వహణ ప్రక్రియలను మెరుగుపర్చడం, భద్రత అంశాలను మెరుగుపరచడంలోనూ ఈ బిజిలెన్స్‌ ఎక్సలెన్స్‌ మోడల్‌ (జీబీఈఎం) ద్వారా సహాయపడుతుంది.[18]

విస్తరణ

[మార్చు]

వరుసగా ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు తరువాత దేశంలోనే నాలుగోస్థానంలో ఈ ఎయిర్‌పోర్టు నిలిచింది. భూభాగం దృష్ట్యా చూస్తే ఢిల్లీ విమానాశ్రయంకంటే విస్తీర్ణంలో పెద్దది. ఈ విమానాశ్రయ విస్తరణ పనుల్లో భాగంగా విమానాల రాకపోకల సామర్థ్యం పెంచేందుకు అనుగుణంగా టర్మినల్‌ విస్తరణలో భాగంగా తూర్పువైపు 15742 చదరపు మీటర్ల టర్మినల్‌ అందుబాటులోకి వచ్చింది.ఈ టర్మినల్‌తో కలిసి మొత్తం వైశ్యాలం 3,79,370 చదరపు మీటర్లకు పెరగింది. ప్రతి సంవత్సరం 1.10 కోట్ల మంది ప్రయాణికులే లక్ష్యంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయంను ప్రస్తుత రద్దీని దృష్టిలో ఉంచుకొని 3.4కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేలా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు సంస్థ విస్తరణ చేసింది.

ఈ విమానశ్రయంలో 149 చెక్‌ ఇన్‌ కౌంటర్లు, ఏటీఆర్‌ఎస్‌తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్‌ యంత్రాలు, 44 ఎమిగ్రేషన్‌, 44 ఇమిగ్రేషన్‌ కౌంటర్లు, దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మరిన్ని లాంజ్‌లు, రిటైల్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ అవుట్‌లెట్లు, 44 కాంటాక్ట్‌ గేట్లు, 28 రిమోట్‌ డిపార్చర్‌ గేట్లు, 9 రిమోట్‌ అరవైల్‌ గేట్‌లు, రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి 4 కొత్త రాపిడ్‌ ఎగ్జిట్‌ ట్యాక్సివేలు, ప్రయాణికులు విమానంలోకి ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా 3 కొత్త ఎయిరోబ్రిడ్జీలు, కాంటాక్ట్‌లెస్‌ ప్రయాణం కోసం 6 ఈ-గేట్‌లు మొదలైనవి ఏర్పాటు చేయబడ్డాయి.[19]

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 about GHIAL
 2. "Lufthansa Cargo eröffnet Pharma-Drehkreuz Hyderabad". Airliners.de. Archived from the original on 28 ఫిబ్రవరి 2013. Retrieved 16 May 2012.
 3. "Passenger movements statistics from AAI" (PDF). Archived from the original (PDF) on 2014-06-06. Retrieved 2014-10-05.
 4. "Aircraft movements statistics from AAI" (PDF). Archived from the original (PDF) on 2015-09-23. Retrieved 2014-10-05.
 5. "Cargo movements statistics from AAI" (PDF). Archived from the original (PDF) on 2015-09-23. Retrieved 2014-10-05.
 6. "AAI traffic figures 2009–2011" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 16 May 2012.
 7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-26. Retrieved 2014-10-05.
 8. "Rajiv Gandhi International Airport | Arup | A global firm of consulting engineers, designers, planners and project managers". Arup. Retrieved 16 May 2012.
 9. 9.0 9.1 "Airport capacity". Archived from the original on 2009-09-09. Retrieved 2014-10-05.
 10. The Hindu Business Line : New airports off to a flying start[dead link]
 11. 11.0 11.1 "Rajiv Gandhi International Airport | Arup | A global firm of consulting engineers, designers, planners and project managers". Arup. Retrieved 16 May 2012.
 12. "Rajiv Gandhi International Airport | Arup | A global firm of consulting engineers, designers, planners and project managers". Arup. Retrieved 13 February 2012.
 13. "GMR Hyderabad International Airport Limited bags CAPA Award for 'Airport Environmental Performance of the Year'". Archived from the original on 25 జనవరి 2010. Retrieved 18 February 2010.
 14. http://www.aci.aero/Airport-Service-Quality/ASQ-Awards/Past-Winners/2009 Archived 2015-11-25 at the Wayback Machine Retrieved 18 April 2013
 15. "ASQ Award for Best Airport by Size (5-15m)" Airports Council International. 14 February 2012. Retrieved 13 April 2012
 16. 16.0 16.1 http://www.worldairportawards.com/Awards_2013/top100.htm Archived 2014-12-26 at the Wayback Machine Retrieved 18 April 2013
 17. Namasthe Telangana (3 June 2021). "జీఎంఆర్ హైద‌రాబాద్‌ విమానాశ్ర‌యానికి గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ గుర్తింపు". Namasthe Telangana. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
 18. telugu, NT News (2022-12-08). "హైదరాబాద్‌ విమానాశ్రయానికి గోల్డ్‌ రికగ్నైజేషన్‌". www.ntnews.com. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.
 19. telugu, NT News (2022-04-13). "దేశంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా శంషాబాద్‌". Namasthe Telangana. Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-13.

ఇతర లింకులు

[మార్చు]