రాజీ (వి.యస్.రమాదేవి నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజీ నవలను వి. ఎస్. రమాదేవి రచించారు. ఒకానొక చారిత్రక ఎమెర్జెన్సీ సందర్భంలో (1975-78) జాతీయ రాజకీయ సామజిక సంక్షోభాన్ని నేపథ్యం చేసి రాసిన నవల. ఈ నవలను రామావతార్ గార్కి అంకితం ఇచ్చింది.

ఈ నవలలో 1975లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని రచయిత్రి చిత్రించింది.

కథ[మార్చు]

కేంద్ర ప్రభుత్వ సంగీత నృత్య విభాగంలో సంగీత కళాకారిణిగా ఉద్యోగంలో చేరిన రాజేశ్వరి ఎదుర్కొన్న అనేక సమస్యల చిత్రణే "రాజీ" నవల. నవలా ప్రారంభంలో రాజేశ్వరికి ఉత్తతోద్యోగంలో అనంత్, రవికాంత్ లు అనబడే ఇద్దరు వ్యక్తులతో ఏర్పడిన సన్నిహిత సంబంధాన్ని ఆమె సున్నితంగా చిత్రించింది. వారిలో అనంత్ రాజేశ్వరిని ప్రేమిస్తాడు. నవల రెండోభాగంలో దేశంమీద విధించబడిన అత్యవసర పరిస్థితి ప్రజల ప్రాథమిక హక్కుల్ని ఎలా కాలరాచి వేసిందో రచయిత్రి చూపించింది. అత్యవసర పరిస్థితి సృష్టించిన భీభత్సంలో ఆమె చిక్కుకుని ఎన్నో అవమానాలకు, అవస్థలకు గురు కాబడుతుంది. నవల చివరిలో ఆమె హిమాలయ పర్వత సానువుల్లోని డెహ్రాడూన్ లో ఉన్న స్వామీజీ ఆశ్రమాన్ని చేరుకుంటుంది. అక్కడి పవిత్ర క్షేత్రాలు, ప్రకృతి సౌందర్యం, నిర్మల జీవనం రాజీకి ప్రశాంతతను చేకూరుస్తాయి. అనంత్ కు రాజీ రాసిన ఉతరంతో "రాజీ" నవల పూర్తవుతుంది. [1]

రచయిత్రి పరిచయం[మార్చు]

డా. వి. ఎస్. రమాదేవి' (జనవరి 15, 1934 - ఏప్రిల్ 17, 2013) భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు[2], హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. భారతదేశం గర్వించతగ్గ అడ్మినిస్ట్రేటర్ గా ఖ్యాతికెక్కింది. సుమారు 15 నవలలు రాసింది.

పుస్తకం గురించి[మార్చు]

స్వతంత్ర భారతదేశాన్ని ఒకనాడు ఒక ఊపు ఊపిన రాజకీయ పరిణామం "ఎమెర్జెన్సీ". ఆ పూర్వ రంగంగా 1979లో రాసిన నవల ఇది. "ఎందుకయినా మంచిది. దానిని కలం పేరుతో అచ్చు వేయించండి అంటూ ఆమె సెక్రటరీ పేరిశాస్త్రిగారు సలహా యిచ్చారనీ, అందువల్ల ఆ నవలనప్పుడు "నిశ" అనే కలం పేరుతో అచ్చువేయించారని ఆమె పుస్తకం ముందు మాటలో తెలిపారు. ఈ కలం పేరుతో ఆమె మ్యాగజైన్లలో రచనలు ప్రచురించబడుతూండేవి. ఆనాడు "నిశ: పేరుతో రాసిన నవల తరువాత ప్రచురణలలో "వి.ఎస్.రమాదేవి" పేరుతో పాఠకుల ముందుకు వచ్చింది.

ఇతర నవలలు[మార్చు]

  • మలుపులు
  • మజిలీ
  • అనంతం

పై నవలలతో పాటు రాజీ నవలను కలిపి ఆమె "నవలా చతురస్రం" అని పిలిచారు. ఈ నాలుగు నవలలలో ప్రధాన పాత్ర రాజేశ్వరి కాబట్టి వీటిని "రాజేశ్వరి నవలా చతురస్రం" అని పేరు పెట్టారు.

మూలాలు[మార్చు]

  1. "రాజీ నవల పుస్తక సమీక్ష" (PDF). avkf.org.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. శ్రీమతి డా. వి. యస్. రమాదేవి (1934), ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు, డా. ఆర్. అనంత పద్మనాభరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్,2000, పేజీ: 98.