రాజు కులకర్ణి
రాజు కులకర్ణి అని సంక్షిప్తంగా పిలువబడే రాజీవ్ రమేశ్ కులకర్ణి (Rajiv Ramesh Kulkarni) 1962, సెప్టెంబర్ 25 న ముంబాయిలో జన్మించాడు. ఇతడు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. దేశవాళి క్రికెట్ పోటీలలో ముంబాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1982-83 లో రంజీ ట్రోఫి సెమీఫైనల్‌లో 111 పరుగులకు 8 వికెట్లు సాధించి 1983లో వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. 1986 అక్టోబర్లో ముంబాయిలో ఆస్ట్రేలియా పై తొలి టెస్ట్ ఆడినాడు. 1987 ఫిబ్రవరిలో పాకిస్తాన్ పై మరో రెండు టెస్టులు ఆడినాడు. కాని మూడు టెస్టులకే అతని టెస్ట్ శకం అంతమైంది. మొత్తం 10 వన్డేలు ఆడినాడు. 1987లో జరిగిన ఆసియా కప్ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించిననూ ఆడే అవకాశం లభించలేదు. 1992లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. ఆ తరువాత క్రీడా సామాగ్రికి సంబంధించిన వ్యాపారం మొదలుపెట్టినాడు.
టెస్ట్ గణాంకాలు
[మార్చు]రాజు కులకర్ణి 3 టెస్టులు ఆడి 45.39 సగటుతో 5 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 85 పరుగులకు 3 వికెట్లు.
వన్డే గణాంకాలు
[మార్చు]కులకర్ణి 10 వన్డేలు ఆడి 34.50 సగటుతో 10 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 42 పరుగులకు 3 వికెట్లు. బ్యాటింగ్‌లో 33 పరుగులు చేసాడు. అత్యుత్తమ స్కోరు 15 పరుగులు.