Jump to content

రాజు ధింగన్

వికీపీడియా నుండి
రాజు ధింగన్
రాజు ధింగన్


పదవీ కాలం
2013 – 2020 ఫిబ్రవరి 11
ముందు సునీల్ కుమార్
తరువాత రవికాంత్ ఉజ్జయిని
నియోజకవర్గం త్రిలోకపురి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజు ధింగన్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు త్రిలోకపురి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజు ధింగన్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో త్రిలోకపురి శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ పై 17,685 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2015 శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కిరణ్ వైద్యపై 29,754 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 74,907 ఓట్లతో విజేతగా నిలవగా, కిరణ్ వైద్య 45,153 ఓట్లతో రెండోస్థానంలో నిలిచాడు.[4]

రాజు ధింగన్ 2022లో ఎంసీడీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీని వీడి, నవంబర్ 30న న్యూఢిల్లీలోని ఢిల్లీ బిజెపి కార్యాలయంలో ఆదేశ్ కుమార్ గుప్తా, సంబిత్ పాత్ర సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Delhi elections: Dropped AAP MLAs unhappy, say list came as a "surprise"". Business Standard. 15 January 2020. Archived from the original on 21 March 2025. Retrieved 21 March 2025.
  2. Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  3. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  4. "Trilokpuri Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 21 March 2025. Retrieved 21 March 2025.
  5. "Three former AAP MLAs join BJP" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 29 November 2022. Archived from the original on 21 March 2025. Retrieved 21 March 2025.