Jump to content

రాజు వెడ్స్ రాంబాయి

వికీపీడియా నుండి
రాజు వెడ్స్ రాంబాయి
దర్శకత్వంసాయిలు కంపాటి[1]
స్క్రీన్ ప్లేసాయిలు కంపాటి
కథసాయిలు కంపాటి
నిర్మాతవేణు ఊడుగుల
రాహుల్ మోపిదేవి
తారాగణం
ఛాయాగ్రహణంవాజిద్ బేగ్
కూర్పునరేష్ అడుపా
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థలు
  • ఈటీవీ విన్ ఒరిజినల్స్
  • డోలాముఖి సబాల్టర్న్‌ ఫిల్మ్స్‌
  • మాన్సూన్‌ టేల్స్‌
పంపిణీదార్లుబన్నీ వాస్ వర్క్స్, వంశీ నందిపాటి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2025 నవంబరు 21 (2025-11-21)
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు100+

రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా.[2] తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్‌ ఫిల్మ్స్‌, మాన్సూన్‌ టేల్స్‌ బ్యానర్‌లపై వేణు ఊడుగుల,[3][4] రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.[5] అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 13న విడుదల చేయగా,[6] సినిమా నవంబర్ 21న విడుదల చేశారు.[7][8]

ఈ సినిమా కథంతా..2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్‌-ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊళ్లో రాజు(అఖిల్‌ రాజు) బ్యాండ్‌ కొట్టడంలో చాలా ఫేమస్‌. పెళ్లికి అయినా..చావుకైనా రాజుగాడి బ్యాండ్‌ మోగాల్సిందే. నాన్న(శివాజీ రాజా) వద్దని చెప్పినా బ్యాండ్‌ కొట్టే పనిని వదలడు రాజు. అంతేకాదు హైదరాబాద్‌ వెళ్లి ఏదో ఒక పని చేయమని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేసినా.. వినిపించుకోడు. దానికి కారణం రాంబాయి(తేజస్విని రావ్‌). ఆమె అంటే రాజుకి చచ్చేంత ప్రేమ. మొదట్లో అతని ప్రేమను రాంబాయి వ్యతిరేకించినా.. తర్వాత తన ప్రేమలోని నిజాయితీ, బ్యాండ్‌ కొట్టే స్టైల్‌ చూసి అంగీకారం తెలుపుతుంది. అయితే ఆమె తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ).. కూతురికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుర్రాడినే ఇచ్చి పెళ్లి చేయాలన్న లక్ష్యంతో జీవిస్తుంటాడు. అందుకే రాంబాయిని పెళ్లి చేసుకునేందుకు ఆమెతో కలిసి రాజు ఓ దారి ఎంచుకుంటాడు. మూడు ముళ్లు వేయడానికి ముందే ఆమెని గర్భవతిని చేస్తే.. వెంకన్న చచ్చినట్లు తమ పెళ్లి చేస్తాడనుకుంటారు. మరి వాళ్లు అన్నంత పని చేశాక ఏమైంది? వెంకన్న వల్ల రాజు – రాంబాయిల ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది? వాళ్ల పెళ్లిని అడ్డుకునేందుకు.. రాజుకు బుద్ధి చెప్పేందుకు వెంకన్న ఎలాంటి దుర్మార్గానికి ఒడిగట్టాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.[9]

నటీనటులు

[మార్చు]
  • అఖిల్ రాజ్ ఉద్దెమరి[10]
  • తేజస్వీ రావు[10][11]
  • శివాజీ రాజా
  • చైతు జొన్నలగడ్డ
  • అనితా చౌదరి
  • కవిత శ్రీరంగం
  • యూ.సాయిరాం
  • విక్రమ్ ఆదిత్య
  • ప్రతాప్ బట్లరై
  • శివ కొంగరావు
  • రమణారెడ్డి పురెల్లి
  • నికిత శ్రీనివాస్
  • కనకం వెంకట్
  • సుప్రియ
  • లతికా సంపతిరావు
  • నందిపాటి త్రిష
  • రామతర
  • ఉపేంద్ర జంగ్గం
  • మంద శ్రీనివాస్ గౌడ్
  • రాజశేఖర్ కత్తుల
  • రాజేష్ కాసాని
  • ఆంజనేయులు
  • రాజు యాదవ్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."రాంబాయి నీ మీద నాకు[12]"మిట్టపల్లి సురేందర్అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం4:10
2."అలా అలా" చిన్మయి శ్రీపాద3:17

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • కాస్ట్యూమ్ డిజైనర్లు: ప్రియాంక వీరబోయిన, ఆర్తి విన్నకోట
  • ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
  • కో-డైరెక్టర్: బాల డి ప్రసాద్
  • గ్రాఫిక్స్: ధని ఏలే

మూలాలు

[మార్చు]
  1. "మన ఆత్మ స్క్రిప్ట్‌లో కనిపిస్తేనే..." Eenadu. 21 November 2025. Archived from the original on 21 November 2025. Retrieved 21 November 2025.
  2. "ఎప్పటికీ గుర్తుండే సినిమా... రాజు వెడ్స్‌ రాంబాయి". Eenadu. 30 October 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  3. "వేణు ఉడుగుల 'రాజు వెడ్స్‌ రాంబాయి'". Prajasakti. 19 November 2024. Retrieved 5 November 2025.
  4. "ఆ విషయంలో 'ఈటీవీ విన్‌'ది బెంచ్‌మార్క్‌: వేణు ఊడుగుల". Eenadu. 21 November 2025. Archived from the original on 21 November 2025. Retrieved 21 November 2025.
  5. "ఇది పక్కా తెలంగాణ సినిమా". NT News. 30 October 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  6. "ప్రేమకు.. ప్రేమే శాశ్వత శత్రువు". Eenadu. 14 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  7. "Raju Weds Rambai to release on November 21" (in ఇంగ్లీష్). Cinema Express. 29 October 2025. Archived from the original on 21 November 2025. Retrieved 21 November 2025.
  8. "Raju Weds Rambai Movie Review and Rating: A Raw Story With Soulful Music". www.teluguvaaditv.com(Telugu Vaadi TV). 21 November 2025.
  9. "రాజు వెడ్స్‌ రాంబాయి: రివ్యూ" (in అమెరికన్ ఇంగ్లీష్). 2025-11-21. Retrieved 2026-01-05.
  10. 10.0 10.1 "హృదయాల్ని తాకే ముగింపు 'రాజు వెడ్స్‌ రాంబాయి' సొంతం". Eenadu. 21 November 2025. Archived from the original on 21 November 2025. Retrieved 21 November 2025.
  11. "'రాంబాయి' మన రాజమండ్రి అమ్మాయే". Eenadu. 29 November 2025. Archived from the original on 29 November 2025. Retrieved 29 November 2025.
  12. "గతించిన చరిత్రకు సాక్ష్యంగా.. రాజు వెడ్స్ రాంబాయి". V6 Velugu. 5 November 2025. Retrieved 5 November 2025.

బయటి లింకులు

[మార్చు]