Jump to content

రాజేంద్ర అగ్నిహోత్రి

వికీపీడియా నుండి
రాజేంద్ర అగ్నిహోత్రి

పదవీ కాలం
1989  1999
ముందు సుజన్ సింగ్ బుందేలా
తరువాత సుజన్ సింగ్ బుందేలా
నియోజకవర్గం ఝాన్సీ

వ్యక్తిగత వివరాలు

జననం (1938-01-01)1938 జనవరి 1
ఝాన్సీ , యునైటెడ్ ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా
మరణం 2008 జూన్ 5(2008-06-05) (వయసు: 70)
ఝాన్సీ , ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు బలరాం అగ్నిహోత్రి
జీవిత భాగస్వామి సరోజ్
సంతానం ఆశిష్ అగ్నిహోత్రి, నీలం (యోజన) అగ్నిహోత్రి
పూర్వ విద్యార్థి లక్నో విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజేంద్ర అగ్నిహోత్రి (1938- 2008) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజేంద్ర అగ్నిహోత్రి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సుజన్ సింగ్ బుందేలా చేతిలో 115923 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1989 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సుజన్ సింగ్ బుందేలా పై 103198 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజేంద్ర అగ్నిహోత్రి 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఓం ప్రకాష్ రిచారియాపై 82,071 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1996 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరగోవింద్ కుష్వాహాపై 29684 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజేంద్ర అగ్నిహోత్రి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరగోవింద్ కుష్వాహాపై 50368 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సుజన్ సింగ్ బుందేలా చేతిలో 82,521 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

రాజేంద్ర అగ్నిహోత్రి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 206591 ఓట్లతో 3వ స్థానాల్లో నిలిచాడు.

మూలాలు

[మార్చు]
  1. "Biographical Sketch of Member of 12th Lok Sabha". Archived from the original on 15 October 2013. Retrieved 14 June 2014.
  2. "Statistical Report on General Election, 1980 to the Legislative Assembly of Uttar Pradesh" (PDF). Election Commission of India. Archived (PDF) from the original on 6 October 2010. Retrieved 14 January 2024.