రాజేష్ కుమార్ నల్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజేష్ కుమార్ నల్ల
జననంజూన్ 10
కాగజ్‌నగర్‌
కొమరంభీం జిల్లా, తెలంగాణ
వృత్తిసాప్ట్ వేర్ నిపుణుడు
ప్రసిద్ధియువ పారిశ్రామికవేత్త
భార్య / భర్తమనీషా
తండ్రితిరుపతి
తల్లిరమాదేవి

రాజేష్ కుమార్ నల్ల, తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్త.[1] 10 సంవత్సరాల వయస్సులో కోడింగ్ చేయడం మొదలుపెట్టి, 18 సంవత్సరాల వయసులో టెకీమాక్స్ ఐటి సర్వీస్ సంస్థను ప్రారంభించాడు. దేశంలోని అతి పిన్న వయస్కుడైన మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరిగా నిలవడంతోపాటు పిఎంఐ ఫ్యూచర్ 50 గ్లోబల్ లీడర్‌గా గుర్తింపుపొందాడు.[2]

జననం, విద్య[మార్చు]

రాజేష్ జూన్ 10న తిరుపతి - రమాదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, కాగజ్‌నగర్‌ పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి వ్యాపారి, తల్లి గృహిణి. కాగజ్‌నగర్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేసిన రాజేష్ హైదరాబాదు నగరంలో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టెక్నాలజీ మేనేజ్‌మెంట్ & ఇ-కామర్స్‌లో మాస్టర్స్ చేసాడు.[2]

వృత్తి జీవితం[మార్చు]

2012 జూన్ నుండి 2014 సెప్టెంబరు వరకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్ గా పనిచేసి, ఈ -కామర్స్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ సేవల ద్వారా 100కు పైగా చిన్న, మధ్యస్థాయి వ్యాపార యజమానులు ఆన్‌లైన్ ద్వారా వ్యాపారాలను ప్రారంభించడానికి సహాయపడ్డాడు.

2014 అక్టోబరులో హైదరాబాద్ కేంద్రంగా టెకీమాక్స్ ఐటి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించి, దేశీయ అవసరాలు, మార్కెట్ పరిశోధన, ఫైనాన్స్ కార్యకలాపాలు, మార్కెటింగ్ వరకు వ్యాపార అభివృద్ధి అంశాలలో పాలుపంచుకున్నాడు. 2022లో గ్లోబల్ ఎక్సపెన్షన్ లో భాగంగా ఈ సంస్థ కార్యకలాపాలను యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికాకి కూడా విస్తరించాడు.[3]

ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నాణ్యమైన టెక్నికల్ విద్యను అందించడం ద్వారా "ప్రతి విద్యార్థిని నైపుణ్యులుగా మార్చడం" అనే నినాదంతో 2020 నవంబరులో స్కిల్‌లాంచర్ ను ప్రారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందికిపైగా విద్యార్థులకు ఈ సంస్థ తమ సేవలు అందించింది.

స్వచ్ఛంద కార్యకలాపాలు[మార్చు]

  • 2019 ఆగస్టులో ఆస్పైర్20 అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రతి విద్యార్థి 20 సంవత్సరాల వయస్సు వచ్ఛేసరికి నేటితరానికి అవసరమైన టెక్నాలజీ నైపుణ్యాలను నేర్చుకునేలా ప్రోత్సహిస్తూ 2,000 మందికిపైగా విద్యార్థులకు స్టార్టప్‌ను నిర్మించడంలో చేశాడు. 8,000 మందికిపైగా విద్యార్థులకు సరికొత్త, అత్యాధునిక టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చాడు.
  • 2019 జూన్ లో హైదరాబాద్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ తో కలిసి బ్లడ్ ఫర్ నీడ్ ను ఏర్పాటుచేసి, టెక్నాలజీ ఉపయోగించి నిమిషాల వ్యవధిలో రక్తదాతను అందించడంలో సహాయం చేస్తున్నాడు.
  • 2020 జూన్ లో చేంజ్ బిలియన్ మిషన్ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా మారుమూల ప్రాంతాలవారికి విద్య, వైద్యం అందిచడంతోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలరంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తూ, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు పొందడంలో అర్హులైన వ్యక్తులకు సహాయం చేస్తున్నాడు.

సన్మానాలు, అవార్డులు[మార్చు]

  • ఫ్యూచర్50 గ్లోబల్ లీడర్: ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించిన 50 మందికి ఇచ్చే ఈ అవార్డులో 2020 సంవత్సరానికి భారతదేశం నుండి ఎంపికైన ముగ్గురిలో రాజేష్ ఒకడు. సన్నా మారిన్ (ఫిన్లాండ్ ప్రధాన మంత్రి), విట్నీ వోల్ఫ్ హెర్డ్ (ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలైన సెల్ఫ్ మేడ్ ఫిమేల్ బిలియనీర్), కెన్నెత్ హారిస్ II (నాసా), బ్రయాన్ స్టెయిల్ (యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి), లారా జోన్స్ (స్పెషల్ ఒలింపిక్స్), మిషే అడ్డీ (సీఈవో, జెట్‌స్ట్రీమ్ ఆఫ్రికా) వంటి పలువురు అంతర్జాతీయ నాయకులతోపాటు రాజేష్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.[2][4]

మూలాలు[మార్చు]

  1. "Two Hyderabad entrepreneurs on Future 50 global list of PMI". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2023-01-21.
  2. 2.0 2.1 2.2 "He used lockdown as a catalyst". The New Indian Express. 2020-07-28. Archived from the original on 2023-01-21. Retrieved 2023-01-21.
  3. "Pursuing his Passion". The New Indian Express. 2014-12-15. Archived from the original on 2023-01-21. Retrieved 2023-01-21.
  4. "Future 50, A New Generation of Leaders Has Arrived". www.pmi.org. Archived from the original on 2021-05-16. Retrieved 2023-01-21.