రాజేష్ జైన్
| రాజేష్ జైన్ | |||
| పదవీ కాలం 1998 – 2013 | |||
| ముందు | హరి కృష్ణన్ | ||
|---|---|---|---|
| తరువాత | సోమ్ దత్ | ||
| నియోజకవర్గం | సదర్ బజార్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| నివాసం | ఢిల్లీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రాజేష్ జైన్ (జననం 5 ఆగస్టు 1956) ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు సదర్ బజార్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]రాజేష్ జైన్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సదర్ బజార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హరి కృష్ణన్ పై 16,368 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2003 శాసనసభ ఎన్నికలలో ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రఘువంశ్ సింఘాల్ పై 18,079 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]
రాజేష్ జైన్ 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సదర్ బజార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జై ప్రకాష్ పై 14,089 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6] ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి 31,094 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Ex-Delhi Congress MLA Routed Rs 8 Crore Black Money Post Demonetisation: Enforcement Directorate". NDTV.com.
- ↑ "Delhi Crime News: नोटबंदी में करोड़ों की हेराफेरी, कांग्रेस के पूर्व विधायक गिरफ्तार - demonetisation effect: ex-mla of congress rajesh jain arrested". Navbharat Times.
- ↑ "Former Congress MLA Rajesh Jain helped to exchange Rs 4.5 crore demonetised notes: Police". The New Indian Express.
- ↑ Delhi Assembly Election Results| 1998 Election Commission of India
- ↑ Delhi Assembly Election Results| 2003 Election Commission of India
- ↑ Delhi Assembly Election Results| 2008 Election Commission of India