రాజ్‌నంద్‌గావ్ జిల్లా
రాజ్‌నందగావ్ జిల్లా
राजनांदगांव जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
ముఖ్య పట్టణం | రాజ్‌నందగావ్ |
మండలాలు | 9 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1 |
• శాసనసభ నియోజకవర్గాలు | 6 |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,070 కి.మీ2 (3,120 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 15,37,133 |
• జనసాంద్రత | 190/కి.మీ2 (490/చ. మై.) |
• Urban | 2,31,647 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 77.2 % |
• లింగ నిష్పత్తి | 1023 |
సగటు వార్షిక వర్షపాతం | 1274 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో రాజ్‌నందగావ్ జిల్లా ఒకటి. రాజ్‌నందగావ్ జిల్లాకు కేంద్రంగా ఉంది.
చరిత్ర
[మార్చు]1973 జనవరి 26న రాజ్‌నందగావ్ జిల్లా దుర్గ్ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేయగా ఏర్పడింది. 1998లో ఈ జిల్లా నుండి కబీర్ధామ్ జిల్లాను రూపొందించారు.[1] ఇది ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగం.[2]
భౌగోళికం
[మార్చు]జిల్లా వైశాల్యం 8222 చ.కి.మీ.జిల్లా ఉత్తర సరిహద్దులో కబీర్ధామ్ జిల్లా, తూర్పు సరిహద్దులో దుర్గ్, దక్షిణ సరిహద్దులో బస్తర్, పశ్చిమ సరిహద్దులో మహారాష్ట్ర లోని గడ్ఛిరోలి, భండరా, మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలు ఉన్నాయి.
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,537,520, [3] |
ఇది దాదాపు. | గాబన్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 325వ స్థానంలో ఉంది..[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 191 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.82%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1017:1000 [3] |
అక్షరాస్యత శాతం. | 76.97%.[3] |
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]జిల్లాలోని తాలుకా కేంద్రమైన డోంగర్గర్ ప్రత్యేక పర్యాటక కేంద్రం, ప్రముఖ యాత్రాస్థలంగా కూడా ఉంది. ఈ పట్టణంలోని 1600 అడుగిల ఎత్తైన కొండమీద ప్రబల బంబ్లేశ్వరీ ఆలయం ఉంది.[6] ఈ ఆలయానికి 0.5 కి.మీ దూరంలో నేలమట్టం మీద మరొక ఆలయం ఉంది. దీనిని చోటీ బంబ్లేశ్వరీ ఆలయం అంటారు. నవరాత్రి, చైత్ర మాసాల సమయంలో ఈ ఆలయానికి ఛత్తీస్‌గఢ్, వెలుపలి ప్రాంతాల నుండి వేలాది భక్తులు వస్తుంటారు. నవరాత్రి ఉత్సవాలు 24 గంటలూ పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి.
- రైల్వే స్టేషన్‌కు 1.5 కి.మీ దూరంలో ఉన్న శక్తిపీఠం మాతా శీతలేశ్వరీ దేవి ఆలయం కూడా జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి.
మూలాలు
[మార్చు]- ↑ Official site
- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gabon 1,576,665
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Hawaii 1,360,301
- ↑ "Official Website of District Rajnandgaon tourism". Archived from the original on 2015-03-03. Retrieved 2014-07-20.