Jump to content

రాజ్‌వర్ధన్ సింగ్ దత్తిగావ్

వికీపీడియా నుండి

పదవీ కాలం
2018 – 2023
ముందు భన్వర్ సింగ్ షెకావత్
తరువాత భన్వర్ సింగ్ షెకావత్
నియోజకవర్గం బద్నావర్
పదవీ కాలం
2003 – 2013
ముందు ఖేమరాజ్ పాటిదార్
నియోజకవర్గం బద్నావర్

వ్యక్తిగత వివరాలు

జననం 1972 జనవరి 10
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం బద్నావర్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం "Biography:Dattigaon, Rajvardhan Singh" (PDF). Madhya Pradesh Legislative Assembly.

రాజ్‌వర్ధన్ సింగ్ దత్తిగావ్ మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సువస్ర శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజ్‌వర్ధన్ సింగ్ దత్తిగావ్ తన విద్యాభ్యాసం తర్వాత లుఫ్తాన్సాలో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరి, మొదటి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ ఉద్యోగాన్ని వదిలివేసాడు. ఆయనకు 1998లో కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి టికెట్ నిరాకరించిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పోటీ చేశాడు. ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. రాజ్‌వర్ధన్ సింగ్ 2003లో మధ్యప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, రెండవసారి 2008లో, 2018లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయనకు మంత్రి పదవి నిరాకరించబడినందున పార్టీకి రాజీనామా చేశాడు.

రాజ్‌వర్ధన్ సింగ్ దత్తిగావ్ 2018 మధ్యలో ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌లో ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2018 శాసనసభ ఎన్నికలకు పార్టీ ప్రయత్నాలను పర్యవేక్షించడానికి, ఆయనను ఉజ్జయిని డివిజన్‌కు ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు. 2014లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనకు ఛత్తీస్‌గఢ్ బాధ్యతలను అప్పగించారు.

రాజ్‌వర్ధన్ సింగ్ దత్తిగావ్ 2020 మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభ సమయంలో ఆయన జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతు ఇచ్చి రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలలో ఒకరు.[3][4] ఆయన ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి 2020 జూలై 14 క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా పరిశ్రమ విధానం, పెట్టుబడి ప్రమోషన్ బాధ్యతను చేపట్టాడు.[5]

మూలాలు

[మార్చు]