Jump to content

రాజ్ కుమార్ పాటిల్

వికీపీడియా నుండి
రాజ్ కుమార్ పాటిల్ తేల్కూర్
రాజ్ కుమార్ పాటిల్


పదవీ కాలం
2018 మే 15 – 2023 మే 13
ముందు శరణ్ ప్రకాష్ పాటిల్
నియోజకవర్గం సేడం

వ్యక్తిగత వివరాలు

జననం (1977-07-05) 1977 జూలై 5 (వయసు: 49)
సేడం, కర్ణాటక
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సంతోషి రాణి
సంతానం శుభం పాటిల్, సాన్వి పాటిల్
నివాసం సేడం , కర్ణాటక
పూర్వ విద్యార్థి నృపతుంగ డిగ్రీ కళాశాల సేడం నుండి బిఎ

రాజ్ కుమార్ పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో సేడం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రాజ్ కుమార్ పాటిల్ 1977 జూలై 5న సేడం మండలం, కలబురగిలోని తేల్కూర్‌లో జన్మించాడు. ఆయన తేల్కూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఆ తరువాత సేడంలోని నృపతుంగ డిగ్రీ కళాశాల నుండి బి.ఎ. పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాజ్ కుమార్ పాటిల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004, 2008, 2013 శాసనసభ ఎన్నికలలో సేడం శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శరణ్ ప్రకాష్ పాటిల్‌పై 7200 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

రాజ్ కుమార్ పాటిల్ 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శరణ్ ప్రకాష్ పాటిల్ చేతిలో 43,561 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. ↑ The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  2. ↑ "Karnataka assembly results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). India Today. 15 May 2018. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
  3. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. ↑ "Karnataka Assembly Elections 2023: Sedam". Election Commission of India. 13 May 2023. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.