రాజ్ భవన్ రోడ్డు

వికీపీడియా నుండి
(రాజ్ భవన్ రోడ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాజ్ భవన్ రోడ్డు
సమీపప్రాంతం
రాజ్ భవన్ రోడ్డు
రాజ్ భవన్ రోడ్డు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 082
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటిఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

రాజ్ భవన్ రోడ్డు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజకీయ, వాణిజ్య ప్రాంతం.[1][2] ఈ ప్రాంతంలో తెలంగాణ గవర్నర్ నివాసం రాజ్ భవన్ ఉంది. అందుకే ఈ ప్రాంతానికి రాజ్ భవన్ రోడ్డు అనే పేరు వచ్చింది. ఇక్కడికి సమీపంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ (లేక్ వ్యూ గెస్ట్ హౌస్) కూడా ఉంది.

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో పంజాగుట్ట, గ్రీన్ లాండ్స్, సోమాజీగూడ, మాతా నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

వాణిజ్య ప్రాంతం[మార్చు]

ఈ రహదారిపై అనేక దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యాలయం ఉంది.

ప్రార్థనా స్థలాలు[మార్చు]

  1. జగన్నాథ్ దేవాలయం
  2. కనకదుర్గ దేవాలయం
  3. మసీదు-ఎ-ఉమ్మే ఇబ్రహీం

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రాజ్ భవన్ రోడ్డు మీదుగా జీడీమెట్ల, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, చింతల్, గౌలిగూడ బస్టాండ్, సనత్‌నగర్, చార్మినార్, యూసఫ్‌గూడ, సుభాష్ నగర్ (జీడిమెట్ల), అఫ్జల్‌గంజ్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలోని ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు, బేగంపేటలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

మూలాలు[మార్చు]

  1. Rajbhavan Road
  2. "Raj Bhawan Road Locality". www.onefivenine.com. Retrieved 2021-02-06.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-06.{{cite web}}: CS1 maint: url-status (link)