రాజ్ మోహన్ గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్‌ మోహన్ గాంధీ
రాజ్ మోహన్ గాంధీ

రాజ్ మోహన్ గాంధీ (1960)


పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ[1]
పదవీ కాలము
1990-92
నియోజకవర్గము ఉత్తర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1935-08-07) 1935 ఆగస్టు 7 (వయస్సు: 84  సంవత్సరాలు)[2]
న్యూఢిల్లీ, బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ ఆమ్‌ ఆదమీ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్
తల్లిదండ్రులు దేవదాస్ గాంధీ
లక్ష్మీ గాంధీ
జీవిత భాగస్వామి ఉషా గాంధీ
సంతానము 2
వృత్తి బయోగ్రఫర్, పాత్రికేయుడు
పురస్కారాలు అంతర్జాతీయ మానవతావాద అవార్డు (మానవ హక్కులు)
వెబ్‌సైటు Official website

రాజ్‌మోహన్ గాంధీ (జ. 1935 ఆగస్టు 7)[2] జీవిత చరిత్ర రచయిత మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని "సెంటర్ ఫర్ సౌత్ ఆసియన్ అండ్ మిడిల్ ఈస్టర్న్ స్టడీస్",

ఉర్బానా ఛాంపైన్ లోని "యూనివర్సిటీ ఆఫి ఇల్లినోయిస్" లకు పరిశోధనా అధ్యాపకుడు. అతడు గాంధీనగర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్కాలర్.

ప్రారంభ జీవితం[మార్చు]

అతడి తండ్రి దేవదాస్ గాంధీ (మహాత్మా గాంధీ కుమారుడు) హిందూస్థాన్ టైమ్స్ కు మేనేజింగ్ ఎడిటర్. రాజ్ మోహన్ గాంధీ న్యూఢిల్లోలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదివాడు. ఆమె తల్లి యొక్క తండ్రి అయిన చక్రవర్తి రాజగోపాలాచారి భారతదేశానికి రెండవ గవర్నరు జనరల్ గా ఉండేవారు. అతని కంటే ముందు మౌంట్‌బాటన్ మొదటి గవర్నర్ జనరల్ గా పనిచేసాడు.

వృత్తి జీవితం మరియు క్రియాశీలత[మార్చు]

1956 నుండి అతడు అర్థ శతాబ్దం పాటు ట్రస్టు భవనం,"సయోధ్య మరియు ప్రజాస్వామ్యం" కొరకు కృషి చేసాడు. అదే విధంగా "అవినీతి మరియు అసమానత" కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. 1960లు మరియు 1970ల ప్రారంభంలో అతడు పశ్చిమ భారతదేశం యొక్క పర్వతాలలో పంచగనిలో 68 ఎకరాలు (280,000 మీ2) లలో గల సమావేశాల కేంద్రమైన "అసియా పీఠభూమి" ని స్థాపించడానికి కీలక పాత్ర పోషించాడు.[3]

ఆసియా పీఠభూమి పర్యావరణ సహకారం కోసం భారత ఉపఖండంలో గుర్తించబడింది. 1975-77 భారతదేశంలోని ఎమర్జెన్సీ కాలంలో అతడు 1964 నుండి 1981 మధ్య ముంబై లో ప్రచురితమైన "హిమ్మత్" వారపత్రిక ద్వారా వ్యక్తిగతంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం చురుకుగా పనిచేసాడు.

అతడు తాజాగా రాసిన పుస్తకం "ఎ టేల్ ఆఫ్ టు రివోల్ట్స్" ఇండియా 1857 & ద అమెరికర్ సివిల్ వార్" (న్యూఢిల్లీ: పెంగ్విన్ ఇండియా, డిసెంబరు 2009). ఈ పుస్తకంలో 19వ శతాబ్దంలోని ఒకే సమయంలో ప్రపంచంలో జరిగే రెండు వ్యతిరేక భాగాలలో జరిగే యుద్ధాల గూర్చి అధ్యయనం వ్రాయబడింది. అంతకు ముందు రాసిన పుస్తకం "మోహన్‌దాస్:ఎ ట్రూ స్టోరీ ఆఫ్ అ మ్యాన్, హిస్ పీపుల్ అండ్ ఎన్ ఎంపైర్" అతని తాతగారైన మహాత్మా గాంధీ జీవిత చరిత్ర గూర్చి రాసాడు. ఈ పుస్తకానికి 2007లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ నుండి ప్రతిష్టాత్మకమైన బెన్నియల్ పురస్కారం లభించింది. ఇది అనేక దేశాలలో ప్రచురితమవుతూ ఉంది.

2001 లో అతడు రాసిన "రాజాజీ: ఎ లైఫ్, ఎ బయోగ్రఫీ ఆఫ్ చక్రవర్తి రాజగోపాలచారి(1878-1972)" పుస్తకానికి సాహిత్యాకాడమీ పురస్కారం లభించింది.

అతడి ఇతర రచనలు "గఫార్ ఖాన్: నాన్‌వయొలెంట్ బాద్‌షా ఆఫ్ ద పక్టన్స్ (పెంగ్విన్ 2004); రివెంజ్ & రికగ్నిషన్: అండర్‌స్టాండిగ్ సౌత్ ఆసియా హిస్టరీ (పెంగ్విన్, 1999); పటేల్: ఎ లైఫ్, ఎ బయోగ్రఫీ ఆఫ్ వల్లభభాయి పటేల్ (1875-1950), డిప్యూటీ ప్రైమ్‌మినిస్టర్ ఆఫ్ ఇండియా, 1947-50 (నవజీవన్, అహ్మదాబాద్, 1990); మరియు ఎయిట్ లైవ్స్: అ స్టడీ ఆఫ్ ద హిందూ-ముస్లిం ఎన్‌కౌంటర్ (సనీ, 1987).

అతడి పుస్తకాలలో "ద గుడ్ బోట్‌మాన్: ఎ పోర్టయిట్ ఆఫ్ గాంధీ" 2009 లో చైనీస్ అనువాదంతో బీజింగ్ లో ప్రచురించబడినది. అతడు ఇటీవల "పంజాబ్"(ఆలెఫ్ బుక్ కంపెనీ 2013) పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకంలో విభజన చెందక ముందు పంజాబ్ చరిత్రను ఔరంగజేబు మరణం నుండి పంజాబ్ విభజన వరకు రాసాడు.[4]

యూనివర్శిటీ అపహ్ ఇల్లినాయిస్ లో భోధకునిగా చేరకముందు అతడు 1985 నుండి 1987 వరకు న్యూఢిల్లీ థింక్-ట్యాంకు, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లలో పరిశోధనా ప్రొఫెసరుగా పనిచేసాడు. అతడు 2004లో మద్రాసులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలో సంపాదకీయం చేసాడు. అతడు ఇల్లినాయిస్ లోని సిటీ పాహ్ చాంపైన్ నుండి

అంతర్జాతీయ మానవతావాద పురస్కారం (మానవ హక్కులు) ను అందుకున్నాడు. 1997లో అతడు కెనడా లోని యూనివర్శిటీ అపహ్ కాల్గరీ నుండి డాక్టరేట్ పొందాడు. టోక్యో లోని ఒబిరిన్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రం లో డాక్టరేట్ పొందాడు. ప్రస్తుతం "న్యూరెంబర్గ్ అంతర్జాతీయ మానవ హక్కుల పురస్కారం" నకు జ్యూరీ సభ్యుడిగా ఉన్నాడు.

రాజకీయాలు[మార్చు]

1989లో అమేధి లోక్ సభ నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ కి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయాడు. అతడు 1990-92 కాలంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. 1990 లో జెనీవాలో జరిగిన యు.ఎన్.హ్యూమన్ రైట్స్ కమీషన్లో భారతీయ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాడు. భారత పార్లమెంటులో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిస్థితిని వివరించడానికి అతడు రెండు సభలలోని అన్ని పార్టిల జాయింట్ కన్వీనరుగా ఉన్నాడు.

2014, ఫిబ్రవరి 21 న అతడు ఆమ్‌ ఆదమీ పార్టీలో చేరాడు.[5] అతడు తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుండి 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసాడు కానీ ఓడిపోయాడు.[6]

పుస్తకాలు[మార్చు]

 1. Why Gandhi Still Matters: An Appraisal of the Mahatma’s Legacy
 2. Understanding the Founding Fathers: An Enquiry into the Indian Republic’s Beginnings
 3. Punjab: A History from Aurangzeb to Mountbatten
 4. A Tale of Two Revolts
 5. Mohandas: A True Story of a Man, His People and an Empire
 6. Ghaffar Khan: Nonviolent Badshah of the Pakhtuns
 7. Understanding the Muslim Mind
 8. Rajaji: A Life
 9. Revenge & Reconciliation: Understanding South Asian History
 10. The Good Boatman
 11. Patel: A Life
 12. Eight Lives: A Study of the Hindu-Muslim Encounter

వ్యక్తిగత జీవితం[మార్చు]

రాజ్ మోహన్ గాంధీ ఉషాజీని వివాహమాడాడు. వారికి ఇద్దరు పిల్లలు. వారు సుప్రియ మరియు దేవదత్తా.[7]

మూలాలు[మార్చు]

 1. "Rajya Sabha members biographical sketches 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 4 September 2017. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 "Professor Rajmohan Gandhi". Jamnalal Bajaj Foundation. Jamnalal Bajaj Foundation. మూలం నుండి 13 March 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 4 January 2017. Cite uses deprecated parameter |dead-url= (help)
 3. "Initiatives of Change". www.in.iofc.org. మూలం నుండి 23 February 2007 న ఆర్కైవు చేసారు. Retrieved 2017-10-21.
 4. "Life of letters". The Hindu. October 26, 2012. Cite web requires |website= (help)
 5. "Mahatma's grandson Rajmohan Gandhi joins AAP, will contest from east Delhi". IBN Live. February 21, 2014. Cite news requires |newspaper= (help)
 6. "Rajmohan Gandhi to lead AAP battle in Delhi East". The Hindu. 2014-02-27.
 7. "Short Biography -Rajmohan Gandhi". Retrieved February 22, 2014. Cite web requires |website= (help)

బయటి లంకెలు[మార్చు]