రాణి జింగూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాణి జింగూ

రాణి జింగూ, క్రీ.పూ 201 జపనీస్ ప్రాంతాన్ని పరిపాలించిన సామ్రాజ్ఞి. ఈమెను సామ్రాజ్ఞి దేవేరి జింగూ(రాణి కాబట్టి సామ్రాజ్ఞి అని, ఆమె భర్త అంతకుముందు రాజు కాబట్టీ దేవేరి అని పిలుస్తారు. మహారాణితో సమానమైన సంబోధన ఇది.) అని కూడా అంటారు.[1] చక్రవర్తి  చౌయ్ యొక్క భార్య ఈమె. 201లో జింగూ భర్త చనిపోయిన దగ్గర  నుంచీ 269లో కొడుకు ఓజిన్ అధికారంలోకి వచ్చేవరకూ రాజ్యాధికారిణిగా పనిచేశారు ఆమె.[2] మేయిజీ కాలం వరకూ జింగూను 15వ జపనీస్ సామ్రాజ్ఞిగా లెక్కవేసేవారు. కానీ తరువాత కొందరు చరిత్రకారులు ఆమెను కేవలం రాజ్యాధికారిణిగా పరిగణించారు. అప్పటి నుంచీ ఆమె కొడుకు చక్రవర్తి ఓజిన్ 15వ చక్రవర్తిగా గుర్తింపబడుతున్నారు.

జీవిత చిత్రణ[మార్చు]

జింగూ పరిపాలించిన కాలానికి కచ్చితమైన తేదీలు అందుబాటులో లేవు. చరిత్ర్రకారులు జింగూను ఐతిహాసిక వ్యక్తిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆమె గురించి సరైన ఆధారాలు లేకపోవడమే కారణం. జపాన్ రాజ్య పరిపాలనలోకి జింగూ రావడానికి ముందు ఆమె పేరు ఒకినగతరషి-హైమ్ అని కొందరి వాదన.

సుకోకా యోషితోషి(1880) గీసిన రాణి జింగూ చెక్క ముద్రణ.

రాణి జింగూ తన చివరిరోజులు గడిపిన ప్రదేశం గురించి సరైన వివరాలు అందుబాటులో లేవు. కానీ జింగూ అధికారిక సమాధి ప్రస్తుతం నరాలోని మిససగీ-చోలో ఉంది.[3] ఈ రాజసమాధి తాళంచెవి రంధ్రం వంటి ఆకారం గల ద్వీపంలో ఉంది. చుట్టూ నీళ్ళు ఉన్న ఈ ప్రదేశం మధ్యలో ఈ సమాధిని నిర్మించారు.[4]

కిటబటకే చికఫుసా(1293-1354), అరై హకుసకీ(1657-1725)లు రాణి జింగూ మూడవ శతాబ్దానికి చెందిన హిమికో అని అభిప్రాయపడ్డారు. నిహోన్ షోకి అనే ప్రాచీన జపనీస్ పుస్తకంలో హిమికో గురించి ఉండటంతో ఆమే జింగూ అని ఈ చరిత్రకారుల అభిప్రాయం. ఆధునిక చరిత్రకారుడైన నైటో టొరజిరో ఈమెను యామటోహైమ్-నో-మికొటోగా పరిగణించగా, హిగో కుజో రాణి జింగూను యమటో-టోటోహిమోమోసో-హైమ్ గా అభిప్రాయపడ్డారు.

1881లో జపాన్ కరెన్సీపై ముద్రింపబడని మొట్టమొదటి మహిళ రాణి జింగూ.[5] ఈమె అసలు ఫోటోలు లభ్యం కానందున ఎడర్డో చిస్సోన్ గీసిన ఊహా చిత్రాన్ని ఉపయోగించారు. ప్రభుత్వ టంకశాలలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగినిని మోడల్ గా పెట్టుకుని ఈ చిత్రాన్ని గీశారు ఆయన. 1908/1914 సంవత్సరాల్లో ముద్రించిన పోస్టల్ స్టాంపులకు కూడా ఈ చిత్రాన్నే ఉపయోగించారు. ఒక మహిళపై విడుదలైన మొట్టమొదటి జపనీస్ పోస్టల్ స్టాంపు కూడా ఇదే కావడం విశేషం. 1924, 1937 సంవత్సరాల్లో విడుదల చేసిన స్టాంపుల్లో జింగూ ఫోటోను యోషిదా టోయో తిరిగి డిజైన్ చేశారు. జింగూపై స్టాంపులు ముద్రించడం 1939తో  ఆగిపోయింది.[6]

1881లో రాణి జింగూ ఫోటోతో విడుదలైన 1 యాన్ విలువైన కరెన్సీ నోటు.

ఒకప్పుడు యమటో రాజ్యం ఉన్న ప్రదేశం అయిన నరాలో ప్రస్తుతం జింగూ యొక్క అధికారిక సమాధి ఉంది.[7]

రాణి జింగూ తప్పించి జపనీస్ చరిత్రలో మిగిలిన మహారాణులందరూ రాజ్యాన్ని తమ తండ్రుల దగ్గర నుంచి తీసుకున్నవారే. తరువాత ఆ రాజ్యాలు తిరిగి మొగవారి చేతిలోకే వెళ్ళాయి. అందుకే కొందరు మేధావులు పురుష రాజులు మాత్రమే తమ సంప్రదాయాన్ని కాపాడతారు అని వాదిస్తారు.[8] కానీ ఈ వాదనకు రాణీ జింగూతో పాటు గెన్మై కూడా మినహాయింపుగా నిలిచారు. ఆమె తన కుమార్తె రాణీ గెన్షోకు తన రాజ్యాన్ని అప్పగించారు.

నోట్స్[మార్చు]

  1. The Shinto Shrine Agency of Ehime Prefecture
  2. Titsingh, Isaac. (1834).
  3. Jingū's misasagi (PDF) (map), JP: Nara shikanko, lower right .
  4. context of kofun characteristics
  5. History, Bank of Japan .
  6. 続逓信事業史 (Continued - History of Communications Business) vol. 3 郵便 (mails), ed.
  7. Ponsonby-Fane, Richard. (1959).
  8. Yoshida, Reiji.