రాధాభాయి సుబ్బరాయన్
రాధాభాయి సుబ్బరాయన్ (ఇంటిపేరు కుడ్ముల్) (22 ఏప్రిల్ 1891 - 1960) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, మహిళా హక్కుల కార్యకర్త, సామాజిక సంస్కర్త. ఈమె భారతీయ రాజకీయ నాయకుడు పి. సుబ్బరాయన్ భార్య, మోహన్ కుమారమంగళం, పి. పి. కుమారమంగళం, పార్వతి కృష్ణన్‌లకు తల్లి.
తొలి జీవితం, విద్య
[మార్చు]రాధాభాయి కుడ్ముల్ మంగళూరుకు చెందిన రావు సాహెబ్ కుడ్ముల్ రంగారావు కుమార్తె.[1] ఈమె చిత్రాపూర్ సారస్వత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు.[2] మంగళూరులో పాఠశాల విద్యను అభ్యసించి, మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.[1] చిన్న వయస్సులోనే విధవగా మారిన రాధాభాయి, 1912లో కుమారమంగళం జమీందార్ పి. సుబ్బరాయన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలరు.[1] ఆ తర్వాత ఈమె ఆక్స్‌ఫర్డ్‌లోని సమర్‌విల్ కాలేజ్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.[3]
సామాజిక, రాజకీయ జీవితం
[మార్చు]రాధాభాయి మద్రాస్ విశ్వవిద్యాలయం సెనేట్‌కు ఎన్నికైన సభ్యురాలిగా పనిచేసారు. అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్ సభ్యురాలిగా కూడా సేవలు అందించారు. 1930లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి నామినేట్ అయిన మహిళా సంఘాల ప్రతినిధులలో ఈమె, జహానారా షానవాజ్ మాత్రమే ఉన్నారు. చట్టసభల్లో మహిళలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వీరు వాదించినప్పటికీ అది నెరవేరలేదు.[4] ఈమె రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పాల్గొన్నారు.[5] రిజర్వేషన్లపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి ఏర్పాటు చేసిన లోథియన్ కమిటీలో రాధాభాయి భాగమయ్యారు.[6]
1937లో రాధాభాయి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా సాధారణ స్థానం నుండి పోటీ చేయాలని భావించారు.[7] అయితే మద్రాస్ ప్రొవిన్షియల్ రిసెప్షన్ కమిటీ ఛైర్మన్ ఈమెకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.[7] ఈ విషయంపై సుబ్బరాయన్ సి. రాజగోపాలాచారిని ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానమిచ్చారు:
ఉన్నత భావాలున్న మహిళా అభ్యర్థులు తాము మహిళలమైనందున మాత్రమే రాజకీయ ప్రయోజనాలు కోరుకుంటారని నేను నమ్మను.[8]
అయినప్పటికీ, రాధాభాయి 1938లో సాధారణ నియోజకవర్గం నుండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ విధంగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌కు ఎన్నికైన మొదటి మహిళా సభ్యురాలిగా నిలిచారు.[9]
మూలాలు
[మార్చు]- 1 2 3 The Who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency. Pearl Press. 1937. p. 83.
- ↑ "All India Chitrapur Defence Souvenir Fund Souvenir and Directory" (PDF). Kanara Saraswat. 85 (11): 5. 2004. Archived from the original (PDF) on 23 జూలై 2011. Retrieved 8 నవంబరు 2009.
- ↑ Pauline Adams (1996). Somerville for women: an Oxford college, 1879-1993. Oxford University Press. p. 118. ISBN 978-0199201792.
- ↑ Partha S. Ghosh (23 మే 2012). The Politics of Personal Law in South Asia: Identity, Nationalism and the Uniform Civil Code. Routledge. pp. 234–. ISBN 978-1-136-70512-0.
- ↑ Anupama Roy (2005). Gendered citizenship: historical and conceptual explorations. Orient Blackswan. p. 139. ISBN 978-8125027973.
- ↑ Anupama Roy (2005). Gendered citizenship: historical and conceptual explorations. Orient Blackswan. p. 140. ISBN 978-8125027973.
- 1 2 Anup Taneja (2005). Gandhi, women, and the National Movement, 1920-47. Har Anand Publications. p. 179. ISBN 978-8124110768.
- ↑ Anup Taneja (2005). Gandhi, women, and the National Movement, 1920-47. Har Anand Publications. p. 180. ISBN 978-8124110768.
- ↑ Lakshmi N. Menon (1944). The position of women. Oxford University Press. p. 28.