రాధిక శరత్‌కుమార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రాధిక శరత్ కుమార్ ఒక ప్రముఖ తమిళ, తెలుగు చలనచిత్ర కథానాయిక. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు. రాధ, అలనాటి తమిళ హాస్య నటుడు ఎం.ఆర్.రాధా కూతురు. ఈమె తల్లి శ్రీలంకకు చెందినది. రాధ రెండుసార్లు వివాహము చేసుకున్నది. ఈమెకు రిచర్డ్ హార్డీతో జరిగిన తొలి వివాహము ద్వారా రయాన్నే హార్డీ అనే కూతురు ఉన్నది. ఆ తరువాత తమిళ నటుడు శరత్ కుమార్ ను ద్వితీయవివాహము చేసుకున్నది. 2004లో కుమారుడు రాహుల్ జన్మించాడు.