Jump to content

రాధేశ్యామ్ ఖేమ్కా

వికీపీడియా నుండి

రాధేశ్యామ్ ఖేమ్కా (1935 డిసెంబరు 12 - 2021 ఏప్రిల్ 3) ఒక పాత్రికేయుడు, సంపాదకుడు. ఆయన గీతా ప్రెస్ చైర్పర్సన్ గా పనిచేసాడు.[1] 2014లో ఆయన గీతా ప్రెస్ ఛైర్పర్సన్ గా నియమించబడ్డాడు. ఆయన గీత ప్రెస్ కు సంపాదకుడిగా 38 సంవత్సరాలు పనిచేసాడు.

2022లో, ఆయనకు సాహిత్యం, విద్యలో మరణానంతరం భారతదేశపు రెండవ అతిపెద్ద పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ లభించింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

రాధేశ్యామ్ ఖేమ్కా 1935 డిసెంబరు 12న బీహార్ లోని ముంగేర్ జిల్లాలో మార్వాడీ కుటుంబంలో జన్మించాడు.[1] ఆయన తండ్రి సీతారాం ఖేమ్కా హిందువు, గోరక్షణ ఉద్యమంలో చురుకుగా ఉన్నాడు. అతని తల్లి ఒక గృహిణి.[1]

ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరువాత, ఆయన, అతని కుటుంబం 1956లో వారణాసికి మారింది.[1] ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఆ తరువాత, అతను కాగితం తయారీ వ్యాపారం చేసాడు.[1]

స్వామి కర్పాత్రీజీ జీవితం ఖేమ్కాను ప్రభావితం చేసింది, ఆయనను తన గురువుగా భావించాడు. గీత ముద్రణాలయానికి సేవ చేయమని ఖేమ్కాను ప్రోత్సహించిన వ్యక్తి స్వామి కర్పాత్రీజీ.[2]

1982లో, అతను వ్యాపారాన్ని తన పిల్లలు రాజారాం, రాజేశ్వరీలకి అప్పగించి, గీతా ప్రెస్ కోసం పనిచేయడం ప్రారంభించాడు.[2]

కెరీర్

[మార్చు]

1982లో రాధేశ్యామ్ ఖేమ్కా గీతా ప్రెస్ లో చేరాడు. ఆ సంవత్సరం కళ్యాణ్ మాసపత్రిక నవంబరు, డిసెంబరు సంచికలకు ఆయన మొదట ఎడిటింగ్ చేసాడు. చివరికి 1983 మార్చిలో ఆయన కళ్యాణ్ పూర్తి స్థాయి సంపాదకుడిగా నియమించబడ్డాడు, ఈ పదవిలో ఆయన 2021 ఏప్రిల్ వరకు కొనసాగాడు.

ఆయన గీతా ప్రెస్ లో 38 వార్షిక సంచికలు, 460 నెలవారీ పత్రికలను సవరించాడు. తన పదవీకాలంలో, ఆయన గీతా ప్రెస్ లో సాంకేతిక పురోగతిని ప్రోత్సహించాడు. పత్రికలకు ఆధునిక పరికరాలను సమకూర్చాడు. ఇది పత్రికా సామర్థ్యం, నాణ్యతను పెంచింది.

ఆయన పురాణాల వంటి అరుదైన పుస్తకాల ఖచ్చితమైన సంస్కరణలను తయారు చేసి, ప్రతి ఒక్కరూ చదవగలిగేలా వాటిని కల్యాణ్ పత్రికలో ఉంచాడు. ఆరోగ్యం, విద్య వంటి ప్రస్తుత అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి ఆయన ప్రత్యేక దృష్టి సారించాడు.

పవిత్ర జీవనశైలి

[మార్చు]

రాధేశ్యామ్ ఖేమ్కాకు చిన్నప్పటి నుండి మతపరమైన అంశాలపై మక్కువ ఉండేది. ఆయన క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపాడు, సాధువులకు, పేదలకు సేవ చేసాడు. ఆయన తన జీవితాంతం స్వామి కర్పాటి జీ, శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి, పూరి స్వామి నిరంజన్ దేవ్ తీర్థ్, పీఠాధీశ్వర్ స్వామి నిశ్చలానంద, కథ వ్యాస్ రామచంద్ర డోంగ్రే లతో సన్నిహితంగా ఉండేవాడు.

హిందూ సంస్కృతిని అభివృద్ధి చేయడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేసాడు. అతను ధర్మం, కర్మ, "పూజా-మార్గం" ఆరాధన వంటి హిందూ ఆచారాలకు మద్దతు ఇచ్చి ఆచరించాడు.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో అలహాబాద్ లో జరిగే మాఘ్ మేళా సమయంలో ఆయన 60 సంవత్సరాల పాటు ఒక నెల రోజులు కల్పాలు చేసాడు. కల్పవాస్లో, ఒక వ్యక్తి నేలపై నిద్రిస్తానని, పగటిపూట ఉపవాసం ఉంటానని, రోజుకు మూడు సార్లు గంగా పవిత్ర జలంలో స్నానం చేస్తానని, రోజంతా మతపరమైన కార్యకలాపాలు చేస్తానని వాగ్దానం చేస్తాడు.[3]

తన జీవితంలో చివరి కొన్ని సంవత్సరాలు గంగా నది పవిత్రమైన నీరు "గంగాజల్" మాత్రమే తీసుకున్నారు.

సామాజిక అనుబంధం

[మార్చు]

వారణాసికి చెందిన మార్వారీ సేవా సంఘ్, ముముక్షు భవన్, శ్రీరామ్ లక్ష్మీ మార్వారీ హాస్పిటల్ గోడౌలియా, బిర్లా హాస్పిటల్ మచోదరి, కాశీ గోశాల ట్రస్ట్ వంటి అనేక సామాజిక, మతపరమైన సమూహాలతో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు.[4]

మరణం

[మార్చు]

2021 ఏప్రిల్ 3న, 86 సంవత్సరాల వయస్సులో, ఆయన కాశీ కేదార్ ఘాట్ లోని తన నివాసంలో మరణించాడు. ఆయన హరిశ్చంద్ర ఘాట్ వద్ద దహనం చేయబడ్డాడు.[5]

గౌరవాలు

[మార్చు]

2022లో, రాధేశ్యామ్ ఖేమ్కా కు సాహిత్యం, విద్యకు ఆయన చేసిన కృషికి గాను మరణానంతరం భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Radheshyam Khemka Latest News, Updates in Hindi | राधेश्याम खेमका के समाचार और अपडेट - AajTak". आज तक (in హిందీ). Retrieved 2023-01-11.
  2. 2.0 2.1 "स्मृति शेष : राधेश्याम खेमका : सनातन धर्म को समर्पित व्यक्तित्व - पाञ्चजन्य - राष्ट्रीय हिंदी साप्ताहिक पत्रिका | Panchjanya - National Hindi weekly magazine". 2021-06-02. Archived from the original on 2021-06-02. Retrieved 2023-01-11.
  3. "Kalpwas: जानें क्या है कल्पवास, आखिर क्यों कहा जाता है ब्रह्मा का एक दिन". Navbharat Times (in హిందీ). Retrieved 2023-01-11.
  4. "गोरखपुर: गीता प्रेस से प्रकाशित होने वाली कल्याण पत्रिका के संपादक रहे राधेश्याम खेमका को मिला मरणोपरांत पद्म विभूषण सम्मान". Amar Ujala (in హిందీ). Retrieved 2023-01-11.
  5. "Gita Press chairman Radheshyam Khemka dies, PM pays tribute". The Times of India (in ఇంగ్లీష్). April 5, 2021. Retrieved 2023-01-11.
  6. श्रीवास्तव, नीरज (2022-01-26). "जानिए- कौन हैं राधेश्‍याम खेमका? मरणोपरांत पद्म विभूषण मिलने से गोरखपुर में खुशी की लहर". www.abplive.com (in హిందీ). Retrieved 2023-01-11.