రాన్ హోవార్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాన్ హోవార్డ్
రాన్ హోవార్డ్ 2018 కేన్స్ ఫిలిం ఫెస్టివల్
జననం
రోనాల్డ్ విలియం హోవార్డ్

(1954-03-01) 1954 మార్చి 1 (వయసు 70)
డంకన్‌, ఓక్లహోమా, యుఎస్
విద్యజాన్ బరోస్ హైస్కూల్
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1956–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
చెరిల్ అల్లీ
(m. 1975)
పిల్లలు4
తల్లిదండ్రులు
 • రాన్స్ హోవార్డ్‌ (తండ్రి)
 • జీన్ స్పీగల్ (తల్లి)

రోనాల్డ్ విలియం హోవార్డ్ (జననం మార్చి 1, 1954) అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. ది ట్విలైట్ జోన్ ఎపిసోడ్‌తోపాటు అనేక టెలివిజన్ సీరియళ్ళలో అతిథిగా నటించి, బాల నటుడిగా గుర్తింపు పొందాడు. 1960 నుండి 1968 వరకు సిట్‌కామ్ ది ఆండీ గ్రిఫిత్ షోలో షెరీఫ్ ఆండీ టేలర్ (ఆండీ గ్రిఫిత్ పోషించాడు) కుమారుడు ఓపీ టేలర్‌ పాత్రను పోషించాడు.1962లో వచ్చిన ది మ్యూజిక్ మ్యాన్ నటించాడు, ఇది విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. 1959 నుండి 1973 వరకు తన సినిమా, టెలివిజన్ లలో రోనీ హోవార్డ్‌గా పేరు పొందాడు. 1973లో వచ్చిన అమెరికన్ గ్రాఫిటీలో హావార్డ్ ప్రధాన పాత్రలలో ఒకదానిలో నటించాడు. 1974 నుండి 1980 వరకు సిట్‌కామ్ హ్యాపీ డేస్‌లో రిచీ కన్నింగ్‌హామ్ పోషించాడు.[1]

జననం

[మార్చు]

రాన్ హోవార్డ్ 1954, మార్చి 1న రాన్స్ హోవార్డ్‌ - జీన్ స్పీగల్ దంపతులకు ఓక్లహోమాలోని డంకన్‌లో జన్మించాడు. తల్లి నటి కాగా, తండ్రి దర్శకుడు, రచయిత, నటుడు.[2] జర్మన్, ఇంగ్లీష్, స్కాటిష్, ఐరిష్, డచ్ భాషలలో ప్రావీణ్యం ఉంది.[3][4][5][6] తండ్రి "బెకెన్‌హోల్ట్" అనే ఇంటిపేరుతో జన్మించాడు, తన నటనా వృత్తికోసం 1948లో "హోవార్డ్" అనే పేరుగా మార్చుకున్నాడు.[7][8] రాన్ పుట్టిన సమయంలో రాన్స్ హోవార్డ్ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌లో మూడు సంవత్సరాలు పనిచేశాడు.[9]

పీట్ అండ్ గ్లాడిస్‌లో కారా విలియమ్స్‌తో (1960)
హోవార్డ్ (కుడి) టామ్ హాంక్స్, అపోలో 13 నిర్మాణ సిబ్బందితో (1995)
2018 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హోవార్డ్

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చెరిల్ అల్లీతో 1975, జూన్ 7న హోవార్డ్ వివాహం జరిగింది.[10][11] వారికి నలుగురు పిల్లలు: కుమార్తెలు బ్రైస్ డల్లాస్, కవలలు జోసెలిన్ కార్లైల్-పైజ్ కార్లైల్, కుమారుడు రీడ్ క్రాస్.

సినిమారంగం

[మార్చు]

1980లో, హ్యాపీ డేస్‌ని విడిచిపెట్టి, దర్శకత్వం, నిర్మాణం, విభిన్నమైన సినిమాలు- టెలివిజన్ సీరియళ్ళు రాయడం ప్రారంభించాడు. నైట్ షిఫ్ట్ (1982), స్ప్లాష్ (1984), కోకూన్ (1985), విల్లో (1988), థ్రిల్లర్ బ్యాక్‌డ్రాఫ్ట్ (1991), ది పేపర్ (1994) వంటివి తీశాడు. 1995లో అపోలో 13 సినిమాకు ప్రశంసలు అందుకున్నాడు. ఎ బ్యూటిఫుల్ మైండ్ (2001), సిండ్రెల్లా మ్యాన్ (2005), ఫ్రాస్ట్/నిక్సన్ (2008), రష్ (2013), ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సీ (2015), హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్ (2000), ది డా విన్సీ కోడ్ (2006), ఏంజిల్స్ & డెమన్స్ (2009), ఇన్ఫెర్నో (2016), సోలో: ఎ స్టార్ వార్స్ స్టోరీ (2018), ది బీటిల్స్: ఎయిట్ డేస్ ఎ వీక్ (2016), పవరోట్టి (2019) మొదలైనవాటికి దర్శకత్వం వహించాడు.

ఎ బ్యూటిఫుల్ మైండ్ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో అకాడమీ అవార్డును అందుకున్నాడు. ఫ్రాస్ట్/నిక్సన్ అనే సినిమాకు అదే అవార్డులకు కూడా నామినేట్ అయ్యాడు.[12][13] 2003లో నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ వచ్చింది.[14] 2013లో టెలివిజన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించాడు.[15] టెలివిజన్, మోషన్ పిక్చర్స్ పరిశ్రమలలో తన కృషికి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో ఇద్దరు స్టార్లను కలిగి ఉన్నాడు.[16]

సినిమాలు

[మార్చు]

ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్

 • లియో అండ్ లోరీ (1980)
 • నో మ్యాన్స్ ల్యాండ్ (1987)
 • వైబ్స్ (1988)
 • ది 'బర్బ్స్ (1989)
 • ది డోర్స్ (1991) (అన్‌క్రెడిటెడ్)
 • క్లోసెట్ ల్యాండ్ (1991)
 • క్యూరియస్ జార్జ్ 2: ఫాలో దట్ మంకీ! (2010)
 • క్యూరియస్ జార్జ్ 3: బ్యాక్ టు ది జంగిల్ (2015)
 • బ్యాక్‌డ్రాఫ్ట్ 2 (2019)
 • క్యూరియస్ జార్జ్: కేప్ అహోయ్ (2021)
 • వెడ్డింగ్ సీజన్ (2022)

నిర్మాత

 • క్లీన్ అండ్ సోబర్ (1988)
 • ది ఛాంబర్ (1996)
 • ఇన్వెంటింగ్ ది అబాట్స్ (1997)
 • ది అలమో (2004)
 • క్యూరియస్ జార్జ్ (2006)
 • రెస్ట్‌లెస్ (2011)
 • కౌబాయ్స్ & ఎలియెన్స్ (2011)
 • ది గుడ్ లై (2014)
 • ది డార్క్ టవర్ (2017)
 • టిక్, టిక్...బూమ్! (2021)

షార్ట్ ఫిల్మ్స్

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు నిర్మాత నటులు పాత్ర ఇతర వివరాలు
1969 ఓల్డ్ పెయింట్ కాదు Yes కాదు రోనీ హోవార్డ్ గా ఘనత పొందారు
డీడ్ ఆఫ్ డేరింగ్-డూ కాదు Yes కాదు
కార్డ్స్, క్యాడ్స్, గన్స్, గోర్ అండ్ డెత్ కాదు Yes కాదు
2011 ది డెత్ అండ్ రిటర్న్ ఆఫ్ సూపర్మ్యాన్ కాదు కాదు Yes మాక్స్ కొడుకు
వెన్ యు ఫైండ్ మీ Yes కాదు కాదు

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు ఎక్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ రచయిత ఇతర వివరాలు
1978 కాటన్ మిఠాయి Yes కాదు Yes టీవీ సినిమా
1980 ఆకాశం వైపు Yes Yes కాదు
1981 మ్యాజిక్ పిరమిడ్ ద్వారా Yes Yes కాదు
1983 లిటిల్షాట్స్ Yes Yes కాదు
2017 మేధావి Yes Yes కాదు పైలట్ ఎపిసోడ్

దర్శకత్వంలో అకాడమీ అవార్డులు

[మార్చు]
సంవత్సరం నటీ/నటుడు సినిమా ఫలితం
ఉత్తమ నటుడు
2001 రస్సెల్ క్రోవ్ ఎ బ్యూటిఫుల్ మైండ్ నామినేట్
2008 ఫ్రాంక్ లాంగెల్లా ఫ్రాస్ట్/నిక్సన్ నామినేట్
ఉత్తమ సహాయ నటుడు
1985 డాన్ అమెచే కోకన్ విజేత
1995 ఎడ్ హారిస్ అపోలో 13 నామినేట్
2005 పాల్ గియామట్టి సిండ్రెల్లా మనిషి నామినేట్
ఉత్తమ సహాయ నటి
1989 డయాన్ వెయిస్ట్ మాతృత్వం నామినేట్
1995 కాథ్లీన్ క్విన్లాన్ అపోలో 13 నామినేట్
2001 జెన్నిఫర్ కన్నెల్లీ ఎ బ్యూటిఫుల్ మైండ్ విజేత
2020 గ్లెన్ క్లోజ్ హిల్‌బిల్లీ ఎలిజీ నామినేట్

మూలాలు

[మార్చు]
 1. Stated on Inside the Actors Studio, 1999
 2. "Ron Howard Biography (1954–)". Filmreference.com. Retrieved 2023-06-05.
 3. "Ron Howard Biography". Monsters and Critics. Archived from the original on 26 August 2014. Retrieved 2023-06-05.
 4. "Ron Howard". celebrina.com. Archived from the original on July 20, 2013.
 5. "Clint Howard". fringepedia.net. Archived from the original on August 27, 2014.
 6. "Pals of the Saddle- Ron Howard [Archive] – JWMB – The Original John Wayne Message Board!". dukewayne.com. Archived from the original on August 27, 2014. Retrieved 2023-06-05.
 7. "Actress keeps name of her famous family". The Vindicator. Youngstown, Ohio. Scripps Howard. August 3, 2004. p. B7. Retrieved 2023-06-05.
 8. Gray, Beverly (2003). Ron Howard: From Mayberry to the Moon—and Beyond. Thomas Nelson (publisher). p. 6. ISBN 978-1418530747.
 9. Estrin, Eric (February 22, 2010). "Ron Howard's 'Breakthrough'?: Ronald Reagan". The Wrap. Retrieved May 6, 2011.
 10. "Cheryl Howard Crew - The Official Site". cherylhowardcrew.com.
 11. Cheryl Howard Crew: To the Pier, Intrepidly, The New York Times, 2023-06-05.
 12. "Full list of Oscar winners and nominees". The Guardian. February 12, 2002. Retrieved 2023-06-05.
 13. "The 2009 Oscar Nominations". Harpers Bazaar. January 22, 2009. Retrieved 2023-06-05.
 14. "President Bush Announces 2003 Medal of Arts Recipients". November 12, 2003. Archived from the original on June 24, 2013. Retrieved 2023-06-05.
 15. Carlson, Erin (23 January 2013). "Les Moonves, Dick Wolf and Ron Howard Among TV 'Hall of Fame' Inductees". The Hollywood Reporter. Retrieved 2023-06-05.
 16. "Ron Howard receives rare 2nd star on Hollywood Walk of Fame". Los Angeles Daily News. City News Service. December 11, 2015. Retrieved 2023-06-05.

బయటి లింకులు

[మార్చు]