రాబందు
| రాబందులు | |
|---|---|
| గ్రిఫ్ఫోన్ వోల్టర్స్, "గీప్స్ ఫుల్వస్" | |
| Scientific classification | |
| Kingdom: | ఏనిమేలియా |
| Phylum: | |
| Class: | |
రాబందులు (ఆంగ్లం Vulture) స్కావెంజరు పక్షులు.[1]

జాతులు
[మార్చు]- భారత రాబందు (జిప్స్ ఇండికస్)
- సన్నని ఉదరం గల రాబందు (జిప్స్ టెనూయ్రోస్ట్రిస్)
- రెడ్ హెడెడ్ వల్చర్
- బెంగాల్ రాబందు (జిప్స్ బెంగాలెన్సిస్)
- తెల్ల రాబందు (నియోఫ్రాన్ పెర్క్నోప్టెరస్ జింగినియనస్)
- హిమాలయ రాబందు
ఆహరం
[మార్చు]రాబందులు స్కావెంజర్లు, అంటే అవి చనిపోయిన జంతువులను తింటాయి అని అర్ధం. సముద్ర తీరాల దగ్గర రాబందులు బాధ్యతాయుతమైన స్కావెంజర్లు.[2] అవి ఆరోగ్యకరమైన జంతువులపై దాడి చెయ్యడం అరుదు. కానీ, గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న వాటిని చంపి తింటాయి. మందపాటి చర్మం ఉన్న శవాలను తినడానికి, వాటికి శక్తి సరిపోనట్టు అయితే పెద్ద స్కావెంజర్ల కోసం వేచి ఉంటాయి.[3] యుద్ధభూములలో ఇవి అధిక సంఖ్యలో కనిపిస్తాయి. ఎర సమృద్ధిగా ఉన్నప్పుడు, వాటి కడుపు ఉబ్బిపోయే వరకు అవి తింటాయి.[4] వాటి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఇవి నిద్రలో లేదా సగం మత్తులో కూర్చుంటాయి. ఈ పక్షులు తమ పిల్లలకు తమ గోళ్లలో ఆహారాన్ని తీసుకెళ్లవు, కానీ తమ గొంతులోని 'క్రాప్' అనే భాగం నుండి చిక్కటి పసుపు-తెలుపు ద్రవాన్ని (క్రాప్ మిల్క్) తయారు చేసి పిల్లలకు అందిస్తాయి.[5] పర్వతాలలో నివసించే గడ్డం గల రాబందు ఎముకలను తినడంలో ప్రత్యేకత కలిగిన ఏకైక సకశేరుకం. ఇది పిల్లల కోసం ఎముకలను గూటికి తీసుకువెళుతుంది, కొన్నిసారి బతికి ఉన్నవాటిని వేటాడుతుంది. [6]
కొత్త ప్రపంచపు రాబందులు తమ కాళ్ళ మీద నేరుగా మూత్ర విసర్జన చేస్తాయి.[7][8] అందులోని యూరిక్ ఆమ్లం, మృతదేహాలపై నడిచినపుడు కాళ్ళపి చేరిన బ్యాక్టీరియాను చంపుతుంది. శరీరాన్ని చల్లబరచడానికి కూడా ఇది పనికొస్తుంది.[9]
మూలాలు
[మార్చు]- ↑ Ogada, D.L.; Keesing, F. & Virani, M.Z. (2001). "Dropping dead: causes and consequences of vulture population declines worldwide" (PDF). Annals of the New York Academy of Sciences (The Year in Ecology and Conservation Biology): 1–15. doi:10.1111/j.1749-6632.2011.06293.x.
- ↑ Buechley, E. R. & Sekercioglu, C. H. (2016). "Vultures". Current Biology. 26 (13): R560–R561. Bibcode:2016CBio...26.R560B. doi:10.1016/j.cub.2016.01.052. PMID 27404248.
- ↑ "Fast Vulture Facts". WebVulture.com. Archived from the original on July 18, 2011. Retrieved February 15, 2013.
- ↑ "Turkey Vulture Facts". Turkey Vulture Society. Retrieved 2012-12-01.
- ↑ "Turkey Vulture Facts". Turkey Vulture Society. Retrieved 2012-12-01.
- ↑ Buechley, E. R. & Sekercioglu, C. H. (2016). "Vultures". Current Biology. 26 (13): R560–R561. Bibcode:2016CBio...26.R560B. doi:10.1016/j.cub.2016.01.052. PMID 27404248.
- ↑ "Turkey Vulture Facts". Turkey Vulture Society. Retrieved 2012-12-01.
- ↑ "Turkey Vulture Facts". Turkey Vulture Society. Retrieved 2012-12-01.
- ↑ Conger, Cristen (2008-10-13). "Why is it a bad idea to scare a vulture?". HowStuffWorks. Retrieved February 15, 2013.