రాబర్ట్ ఆల్ట్‌మాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాబర్ట్ ఆల్ట్‌మాన్
రాబర్ట్ ఆల్ట్‌మాన్ (1983)
జననం
రాబర్ట్ బెర్నార్డ్ ఆల్ట్‌మాన్

(1925-02-20)1925 ఫిబ్రవరి 20
కాన్సాస్ సిటీ, మిస్సౌరీ, యుఎస్
మరణం2006 నవంబరు 20(2006-11-20) (వయసు 81)
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత.
క్రియాశీల సంవత్సరాలు1947–2006
జీవిత భాగస్వామి
లావోన్నే ఎల్మెర్
(m. 1946⁠–⁠1951)
లోటస్ కోరెల్లి
(m. 1954⁠–⁠1957)
కాథరిన్ రీడ్
(m. 1959)
పిల్లలు6, స్టీఫెన్ ఆల్ట్‌మాన్

రాబర్ట్ బెర్నార్డ్ ఆల్ట్‌మాన్ (1925, ఫిబ్రవరి 20 - 2006, నవంబరు 20) అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. ఐదుసార్లు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

ఆల్ట్‌మాన్ సినిమాలు అనేక శైలులను కలిగి ఉంటాయి. సాధారణంగా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి వ్యంగ్యం, హాస్యం మీద ఆధారపడి ఉంటాయి. ఆల్ట్‌మాన్ "యాంటి-హాలీవుడ్", ఇతివృత్తాలు, దర్శకత్వ శైలి రెండింటిలోనూ నాన్-కన్ఫార్మిస్ట్‌గా ఖ్యాతిని పెంచుకున్నాడు.

జననం

[మార్చు]

ఆల్ట్‌మాన్ 1925, ఫిబ్రవరి 20న హెలెన్ - బెర్నార్డ్ క్లెమెంట్ ఆల్ట్‌మాన్‌ దంపతులకు మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలో జన్మించాడు. కాన్సాస్ సిటీలోని రాక్‌హర్స్ట్ హైస్కూల్‌తోపాటు జెస్యూట్ పాఠశాలల్లో చదువుకున్నాడు.[1] 1943లో మిస్సౌరీలోని లెక్సింగ్టన్‌లోని వెంట్‌వర్త్ మిలిటరీ అకాడమీ నుండి పట్టభద్రుడయ్యాడు.

సినిమారంగం

[మార్చు]

తన సినిమాలలో పెద్ద సమిష్టి నటీనటులకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఎక్కువ నటీనటుల తో మల్టీట్రాక్ రికార్డింగ్ టెక్నిక్‌ను అభివృద్ధి చేశాడు. స్క్రీన్‌పై జరిగే కార్యాచరణను మెరుగుపరచడానికి అత్యంత మొబైల్ కెమెరా పనిని, జూమ్ లెన్స్‌లను కూడా ఉపయోగించాడు.[2] మాష్ (1970), మెక్‌కేబ్ అండ్ మిస్సెస్ మిల్లర్ (1971), ది లాంగ్ గుడ్‌బై (1973), నాష్‌విల్లే (1975), త్రీ ఉమెన్ (1977), ది ప్లేయర్ (1992), షార్ట్ కట్స్ (1993), గోస్ఫోర్డ్ పార్క్ (2001) వంటి సినిమాలు విజయాన్ని సాధించాయి. అవార్డులను కూడా తెచ్చాయి.

అవార్డులు

[మార్చు]

సినిమారంగంలో ఆల్ట్‌మాన్ చేసిన కృషికి 2006లో, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అకాడమీ గౌరవ పురస్కారంతో సత్కరించింది. ఏడుసార్లు నామినేషన్లు పొందినప్నటికీ అతను ఎప్పుడూ కూడా ఆస్కార్‌ అవార్డను గెలుచుకోలేదు. అతని సినిమాలు మాష్, మెక్‌కేబ్ అండ్ మిస్సెస్ మిల్లర్, ది లాంగ్ గుడ్‌బై, నాష్‌విల్లే యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీకి ఎంపికయ్యాయి. బెర్లిన్‌లో గోల్డెన్ బేర్, వెనిస్‌లో గోల్డెన్ లయన్, కేన్స్‌లో గోల్డెన్ పామ్ గెలుచుకున్న ముగ్గురు సినిమా నిర్మాతలలో ఆల్ట్‌మాన్ ఒకరు.

ఆల్ట్‌మాన్ అందుకున్న అవార్డులు, నామినేషన్లు
సంవత్సరం పేరు అకాడమీ అవార్డులు బ్రిటీష్ అవార్డులు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
నామినేషన్లు గెలిచినవి నామినేషన్లు గెలిచినవి నామినేషన్లు గెలిచినవి
1970 మాష్ 5 1 6 1 6 1
1971 మెక్‌కేబ్ & మిస్సెస్ మిల్లర్ 1 1
1972 ఇమేజేస్ 1 1 1
1975 నాష్విల్లే 5 1 5 1 11 1
1977 త్రీ వుమెన్ 1
1978 ఏ వెడ్డింగ్ 2 1
1982 కమ్ బ్యాక్ టు ది ఫైవ్ అండ్ డైమ్, జిమ్మీ డీన్, జిమ్మీ డీన్ 1
1992 ది ప్లేయర్ 3 5 2 4 2
1993 షార్ట్ కట్స్ 1 2 1
1994 ప్రెక్ట్-ఎ-పోర్టర్ 2
2001 గోస్ఫోర్డ్ పార్క్ 7 1 9 2 5 1
మొత్తం 21 3 30 6 33 6

మరణం

[మార్చు]

ఆల్ట్‌మాన్ లుకేమియాతో బాధపడుతూ 81 సంవత్సరాల వయస్సులో 2006, నవంబరు 20న లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో మరణించాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Butler, Robert W. (March 5, 2006). "Finally, An Attitude Adjustment: Hollywood's Establishment Now Embraces Rebel Director Altman". The Kansas City Star. p. 5.
  2. John Wakeman, ed. World Film Directors – Vol. 2, H. W. Wilson Co., N.Y. (1988) pp. 29–39
  3. Lyman, Rick (November 22, 2006). "Robert Altman, Director With Daring, Dies at 81". The New York Times. Retrieved 2023-05-22.
  4. Ebert, Roger; Madsen, Virginia (November 10, 2008). "Robert Altman (1925 – 2006): His dangerous angel remembers". RogerEbert.com. Retrieved 2023-05-22.

బయటి లింకులు

[మార్చు]