రాబర్ట్ డి నీరో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాబర్ట్ డి నీరో
Robert De Niro KVIFF portrait.jpg
Robert De Niro in 2008
జన్మ నామంRobert De Niro, Jr.
జననం (1943-08-17) 1943 ఆగస్టు 17 (వయస్సు: 76  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1965–present
భార్య/భర్త Diahnne Abbott (1976–1988)
Grace Hightower (1997–present)

రాబర్ట్ డి నీరో, జూనియర్. (జననం ఆగస్టు 17, 1943) అమెరికన్ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత. డి నీరో ది గాడ్ ఫాదర్ పార్ట్ II (1974)లో తన నటనకు గాను ఉత్తమ సహాయనటుడుగా తన మొట్టమొదటి అకాడెమి పురస్కారం అందుకున్నారు, తదనంతరం రేజింగ్ బుల్ (1980) చిత్రానికి ఉత్తమ నటుడుగా అకాడెమి పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన 'జాని బాయ్'లో జాని, మీన్ స్ట్రీట్స్ 'లో సివేల్లో, గాడ్ ఫాదర్ పార్ట్ IIలో పిన్నవయస్కుడైన వీటో కర్లెఒనె, టాక్సీ డ్రైవర్లో ట్రావిస్ బికల్, ది డీర్ హంటర్లో అనుభవజ్ఞుడైన వియెత్నామి జాతీయుడైన మైక్హెల్ వ్రోన్స్కి, రేజింగ్ బుల్లో బాక్సర్ లమొట్ట, ఒన్స్ అపాన్ ఎ టైం ఇన్ అమెరికాలో అక్రమాలకూ పాల్పడే డేవిడ్ "నూడుల్స్" అరన్సన్, బ్రెజిల్లో ప్లంబర్ హరీ టుటిల్, మిడ్నైట్ రన్లో దాతృత్వము గల జాక్ వాల్ష్ అనే వేటగాడు, గూడ్ఫెల్లాస్లో దోపిడీదొంగ జిమ్మి కాన్వె, ది అన్టచబుల్స్లో అల్ కాఫోన్, జాకి బ్రౌన్లో లూయిస్ గార, కేప్ ఫియర్లో రక్షకభటుడైన మాక్స్ కాడి వంటి పలు పాత్రలు పోషించారు. కాప్ ల్యాండ్లో మో టిల్డెన్, హీట్లో నీల్ మక్ కాలి కాసినోలో సామ్ "ఏస్" రోత్స్టెయిన్, మీట్ ది పేరెంట్స్ అండ్ మీట్ ది ఫోకెర్స్లో జాక్ బైరెన్ మరియు ఎవ్రిబడి ఈస్ ఫైన్లో ఫ్రాంక్ గుడ్, వంటి విభిన్నమైన పాత్రలు పోషించారు.

ప్రారంభ జీవితం[మార్చు]

రాబర్ట్ డి నీరో న్యూ యార్క్ రాష్ట్రంలోని న్యూ యార్క్ నగరంలో జన్మించారు, ఈయన తండ్రి రాబర్ట్ డి నీరో సీనియర్ వర్జీనియా అడ్మిరల్, ఊహాతీతమైన భావాలను చిత్రీకరించగల చిత్రకారుడు మరియు శిల్పి.[1] డి నీరో తండ్రి ఇటాలియన్ మరియు ఐరిష్ సంతతికి చెందినవాడు కాగా ఆయన తల్లికి జర్మన్, ఫ్రెంచ్, మరియు డచ్ సంతతికి చెందిన పూర్వీకులు కలరు. ఈయన ఇటాలియన్ తాత ముత్తాతలైన జిఒవన్ని డి నీరో మరియు ఎంజేలిన మెర్కురియో, మోలిసే రాష్ట్రము లోని కంపబస్సో ప్రాంతములోని ఫెర్రజానో అనే ప్రదేశము నుండి వలస రాగా,[2] ఈయన నాయనమ్మ, హెలెన్ ఓ'రైల్లీ, ఐర్లాండ్ నుండి వలసవచ్చిన ఎడ్వర్డ్ ఓ'రైల్లీ మనుమరాలు.[3]

మస్సాచుసెట్ట్స్ రాష్ట్రంలోని ప్రావిన్సుటౌను పట్టణములో గల హన్స్ హోఫ్ఫ్మాన్ యొక్క చిత్రలేఖన తరగతులలో కలసిన డి నీరో తల్లితండ్రులు అతని మూడవ ఏట విడిపోయినారు. డి నీరో మన్హట్టన్లోని లిటిల్ ఇటలీ అనే ప్రదేశములో పెరిగారు. ఆయన గ్రీన్విచ్ విలేజ్లో తన తల్లితో పెంచబడ్డారు. పాలిపాయినటువంటి శరీర ఛాయ వలన ఆయనను అందరు "బాబి మిల్క్" అని ముద్దుగా పిలిచేవారు, పిన్న వయస్కుడుగా ఉన్న సమయములో ఆయన ఇటలీ వీధి గుంపులో ఆకతాయిగా ఉన్నప్ప్పటికీ, ఆయన తన పదవ ఏట పాఠశాలలో తొలిసారిగా వేదికపై నటించిన ది విజార్డ్ అఫ్ ఓజ్ అనే నాటకములో పిరికిదైన సింహము అనే పాత్ర ద్వారా ఆయన భవిష్యత్తు యొక్క దిశ ముందుగానే నిర్దేశింపబడినట్లయింది. ప్రదర్శనల వలన ఆయనకు సహజముగా ఉన్న బిడియత్వము నుండి బయటపడటమే గాక చలన చిత్రాలచే ప్రభావితుడైన ఆయన నటనలో శిక్షణ పొందుటకై తన పదహారవ ఏటనే పాఠశాల చదువుకు స్వస్తి చెప్పారు. స్టెల్లా అడ్లేర్ మరియు లీ స్ట్రాస్బెర్గుల శిక్షణలో డి నీరో మొదట లిటిల్ రెడ్ స్కూల్ హౌస్లో చేరి ఆ తరువాత ప్రస్తుతం ఫియరెల్ల హెచ్. లాగార్డియా హైస్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో, భాగముగా ఉన్న హై స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్లో శిక్షణ పొందారు, ఇదే సంస్థలో గాడ్ ఫాదర్ IIలో ఆయన సహనటునిగా నటించిన అల్ పాసినో కూడా శిక్షణ పొందారు. డి నీరో స్టెల్లా అడ్లేర్ కన్సర్వేటరి మరియు లీ స్ట్రాస్బెర్గుల ఆక్టర్స్ స్టూడియోలకు హాజరయ్యారు, ఈ సభ్యత్వాన్ని ఆయన వృత్తిపరమైన ప్రయోజనం పొందటానికి అధికంగా ఉపయోగించుకున్నారు.

ప్రారంభపు నటనా వృత్తిజీవితం[మార్చు]

దస్త్రం:TravisBickle.jpg
టాక్సీ డ్రైవర్ (1976)లో ట్రావిస్ బికల్ పాత్రలో డి నీరో.

బ్రయాన్ డె పల్మ యొక్క సహకారముతో నిర్మింపబడిన ది వెడ్డింగ్ పార్టీ అనే చలన చిత్రముతో డి నీరో తన ఇరవయ్యేళ్ళ వయసులో అనగా 1963లో చలనచిత్ర రంగ ప్రవేశము చేశారు; కానీ ఆ చిత్రము 1969 వరకు విడుదల కాలేదు. బాంగ్ ది డ్రం స్లోలి (1973) అనే చిత్రములోని చనిపోయే దశలో ఉన్న మేజర్ లీగ్ బేస్బాల్ ఆటగానిగా పోషించిన పాత్ర ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అదే సంవత్సరంలో మీన్ స్ట్రీట్స్ (1973 ) అనే చిత్రంలో "చార్లీ"గా నటించిన హర్వే కెయిటెల్ పక్కన ఉండే ఒక చిన్న గూండా "జానీ బాయ్"గా గుర్తుండిపోయే పాత్రలో నటించే సమయంలో, చలన చిత్ర ప్రముఖుడైన స్కార్సేసేతో ఆయనకు మంచి సంబంధము ఏర్పడినది. 1974 లో, డి నీరో ఫ్రాన్సిస్ కాప్పోలా యొక్క ది గాడ్ ఫాదర్ పార్ట్ II లో యువ డాన్ వీటో కర్లెఒనుగా కీలక పాత్ర పోషించగా, దీనికి ముందు ఆయనకు ది గాడ్ ఫాదర్ చిత్రానికి సోన్నీ కర్లెఒన్, మైక్హెల్ కర్లెఒన్, కార్లో రిజ్జి మరియు పౌలి గత్తో పాత్రలకు స్వరపరీక్ష చేశారు. ఈ పాత్రకు ఉత్తమ సహాయ నటుడుగా ఆయనకు అకాడెమి పురస్కారం లభించినప్పటికీ డి నీరో ఆస్కార్ సంబరాలకు హాజరుకాలేని కారణముగా కప్పోల ఆయన తరపున పురస్కారాన్ని అందుకున్నారు. ఈ చిత్రములో (కొన్ని సంభాషణలు ఆంగ్లములో చెప్పినప్పటికీ), సంభాషణలన్నీ పరభాషలో అందునా పలు సిసిలియన్ మాండలికములలో ఉన్నప్పటికీ అకాడెమి పురస్కారం అందుకున్న తొలి నటునిగా గుర్తింపు పొందినారు. మొదటి చిత్రములో వృద్ధ వీటో కర్లెఒన్ పాత్ర పోషించినందుకు గాను మార్లన్ బ్రాండోకు, తరువాతి చిత్రంలో యువ వీటో కర్లెఒన్ పాత్రకు గాను డి నీరో కు అనగా ఒకే కాల్పనిక పాత్రకు గాను రెండు ఆస్కార్ పురస్కారాలు అందుకున్న ఇరువురు నటులుగా వీరికి మాత్రమే గుర్తింపు దక్కింది.

మీన్ స్ట్రీట్స్ చిత్ర్రానికి స్కార్సేసే తో పనిచేసిన తర్వాత వీరిరువురకు మధ్య ఏర్పడిన వృత్తిపరమైన మంచి అనుబంధంచే టాక్సీ డ్రైవర్ (1976), న్యూయార్క్, న్యూయార్క్ (1977), రేజింగ్ బుల్ (1980), ది కింగ్ అఫ్ కామెడీ (1983), గుడ్ఫెల్లాస్ (1990), కేప్ ఫియర్ (1991), మరియు కాసినో (1995) వంటి పలు విజయవంతమైన చిత్రాలకు కలిసి పనిచేశారు. వీరిరువురు గిల్టీ బై సస్పీషన్ అనే చిత్రంలో కలిసి నటించడమే గాక షార్క్ టేల్ అనే సజీవపాత్రల చిత్రానికిగాను స్వరాన్ని అందించారు.

డి నీరో చలన చిత్ర ప్రస్థానంలో టాక్సీ డ్రైవర్ చిత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది; ఈ చిత్రములో ఆయన పోషించిన ట్రావిస్ బికల్ అనే పాత్రతో నటునిగా తారాస్థాయికి చేరారు, అంతేకాక బికల్ పాత్ర తనదైన చెప్పే "యు టాకిన్' టు మీ?" అనే సంభాషణ శాశ్వతముగా డి నిరో పేరుతో జతచేయబడింది. డి నీరో ఈ సంభాషణను తనదైన విభిన్న శైలిలో చెప్పారు.[4]

1976లో డి నీరో (గేరార్డ్ డి పార్డి మరియు డోనాల్డ్ సదర్ లాండ్తో కలసి) మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రెండు విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ఇటలీలో నివసించిన ఇద్దరు చిన్ననాటి స్నేహితుల జీవితం యొక్క జీవశాస్త్రపరమైన అన్వేషణ, బెర్నార్డో బెర్తలూసియొక్క 1900 అనే చిత్రములో నటించారు.

1978 లో, వియెత్నామ్ యుద్ధంపై చిత్రీకరించబడిన ది డీర్ హంటర్ అనే చిత్రములో మైక్హెల్ వ్రోన్స్కి పాత్రకు గాను డి నీరో పేరు ఉత్తమ నటునిగా అకాడెమి పురస్కారానికి ప్రతిపాదించబడింది.

తదుపరి నటనా వృత్తిజీవితం[మార్చు]

దస్త్రం:Filming the boxing scenes.jpg
1980వ సంవత్సరములో జేక్ ల మొట్ట యొక్క రేజింగ్ బుల్ అనే చిత్రానికిగాను డి నిరోపై సన్నివేశాల చిత్రీకరణ; దర్శకుడు మార్టిన్ స్కార్సేసేను మధ్యలో ఎడమవైపున మరియు ఛాయాగ్రహకుడు మైక్హెల్ మాన్ ను మధ్యలో కుడివైపున చూడవచ్చు.
1988వ సంవత్సరంలో డి నీరో.

'రేజింగ్ బుల్' చిత్రంలోని తన పాత్ర 'జేక్ లమొట్ట' కొరకు 60 పౌండ్లు (27 కి గ్రా)బరువు పెంచుకొని పాత్రకు అవసరమైన బాక్సింగ్ నేర్చుకోవడం; 'కేప్ ఫియర్' కొరకు తన దంతములను ఆరగ తీయించుకొనుట; 'ది గాడ్ ఫాదర్, పార్ట్ II' చిత్రం కొరకు సిసిలీలోనే నివసించడం; 'టాక్సీ డ్రైవర్' చిత్రానికై మూడు నెలలు క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం; 'న్యూ యార్క్, న్యూ యార్క్' చిత్రానికై శాక్సాఫోన్ నేర్చుకోవటం వలన డి నీరో తన పాత్రలపట్ల ఉన్న అంకితభావానికి (తన గత అనుభావాలను పాత్రలకు అన్వయించటం లాంటి మెథడ్ ఆక్టింగ్) ప్రశంసలు అందుకున్నారు.

'ది అన్టచబుల్స్' చిత్రంలోని తన పాత్ర 'అల్ కాఫోన్' కొరకు బరువు పెంచుకోవడమే గాక శిరోజాలను కుడా తొలగించుకున్నారు.[ఉల్లేఖన అవసరం]

డి నీరో తన జీవితానుభవాలను పాత్రలకు అనుగుణముగా ఉపయోగించి గొప్ప అభినయాన్ని ప్రదర్శించేవారు, దీనికోసం ఆయన ఎటువంటి తీవ్ర తరమైన తంత్రాన్నైనా ఉపయోగించేవారు. ఉదాహరణకు ది కింగ్ అఫ్ కామెడీ, అనే చిత్ర నిర్మాణ సమయములో ఆయన తన సహనటుడైన జెర్రీ లెవిస్ పాత్ర సహజముగా యూదు మతస్తులపట్ల ఉండే వ్యతిరేకతచే వారిని హత్యచేసే సన్నివేశాలలో, ఆ పాత్ర చూపించ వలసిన నిజమైన క్రోధాన్ని ప్రదర్శింపచేయటానికై కొన్ని సన్నివేశాలకు దర్శకత్వము వహించారు. ''పీపుల్'' పత్రిక ప్రకారము, ఈ పద్ధతి విజయవంతమైనదిగా పేర్కొనబడింది. లెవిస్ ఈ అనుభవాన్ని గుర్తుతెచ్చుకుంటూ, "నేను కమేరాలు ఉన్నవని మరచిపోయి... బాబి గొంతు కోసం ప్రయత్నించాను."[5]

తాను దోపిడిదొంగ మూస పాత్రలకు మాత్రమే పరిమితమవుతున్నానేమో అనే సంశయముతో డి నీరో 1980వ దశకము మధ్యలో అప్పుడప్పుడు బ్రెజిల్ (1985); విజయవంతమైన యాక్షన్-కామెడీ మిడ్నైట్ రన్ (1988), ఎడ్డి మర్ఫికు వ్యతిరేకముగా షోటైం (2002); అనుక్రమ జంటచిత్రాలైన ఎనలైస్ దిస్ (1999) మరియు అనలైస్ దట్ (2002), రెండూ నటుడు/హాస్యగాడు అయిన బిల్లీ క్రిస్టల్కు వ్యతిరేకముగా, బెన్ స్టిల్లెర్కు వ్యతిరేకముగా మీట్ ది పేరెంట్స్ (2000) మరియు మీట్ ది ఫోకర్స్ (2004) వంటి చిత్రాలలో హాస్యపాత్రలు పోషించి, అక్కడ కూడా విజయం సాధించారు.

ఫాలింగ్ ఇన్ లవ్ (1984), ది మిషన్ (1986), ఏంజెల్ హార్ట్ (1987), ది అన్ టచబుల్స్ (1987), గుడ్ఫెల్లాస్ (1990), అవేకెనింగ్స్ (1990), హీట్ (1995), ది ఫ్యాన్ (1996), స్లీపర్స్ (1996), వ్యాగ్ ది డాగ్ (1997), జాకీ బ్రౌన్ అండ్ రోనిన్ (1998) వంటి ఇతర చిత్రాలలోనూ నటించారు. 1997లో, కాప్ ల్యాండ్ అనే క్రైం డ్రామా చిత్రానికి గాను ఆయన హర్వేయ్ కైటెల్, రే లైఓట్ట మరియు సిల్వెస్టర్ స్టాలోన్లతో తిరిగి జతకట్టారు.

1993లో అప్పుడే బాలనటులుగా నిలదొక్కుకుంటున్న లియోడినార్డో డికాప్రియో మరియు టోబీ మగ్యుర్లు నటించిన దిస్ బాయ్స్ లైఫ్లో నటించారు.

ఆయనకు దాదాపు ఇదే సమయములో, క్లింట్ ఈస్ట్వుడ్తో పాటు ఇన్ ది లైన్ అఫ్ ఫైయర్ అనే చిత్రములో మిట్చ్ లీరి అనే పాత్ర పోషించే అవకాశము వచినప్పటికీ ఎ బ్రాంక్స్ టేల్ అనే చిత్రములో నటిస్తుండటంతో సమయాభావము వలన ఆయన ఆ అవకాశాన్ని వదులుకున్నారు, ఆయనకు బదులుగా ఈ పాత్రలో జాన్ మిల్కొవిక్ నటించారు (ఆ పాత్రకు గాను ఆయన పేరు అకాడెమి పురస్కారానికి ప్రతిపాదించబడింది). తదనంతరం డి నీరో ఇన్ ది లైన్ అఫ్ ఫైయర్ (డర్టీ హారీ మరియు మాగ్నం ఫోర్స్, అనే మరో రెండు ఈస్టువుడ్ చిత్రాలతో పాటు) రైటియస్ కిల్ చిత్రాలలో దర్శనమిచ్చారు. 

1995లో డి నీరో మార్టిన్ స్కర్సేసే యొక్క ముఠానాయకుని ఇతిహాస చిత్రమైన "కెసినో"లో లాస్ వెగాస్ "స్టార్డస్ట్" యొక్క నాయకుడయిన శాం “ఏస్” రోత్స్టీన్ పాత్రను పోషించారు.

ఈ పాత్ర నిజజీవిత నాయకుడైనా, ఫ్రాంక్ “లెఫ్టి” రోసేన్తాల్ ఆధారముగా రూపొందించబడింది. ఈ చిత్రము స్కర్సేసేతో కలసి ఆయన పనిచేసిన ఎనిమిదవ చిత్రము.

అదే సంవత్సరములో ఆతరువాత, డి నీరో మైక్హెల్ మాన్న్ యొక్క ఆక్షన్ థ్రిల్లెర్ చిత్రమైన హీట్ లో తన చిరకాల మిత్రుడైనటువంటి అల్ పసినోతో కలసి నటించారు. వీరిరువురు వృత్తిపరముగా ఎప్పుడూ ఒకరితో ఒకరు పోల్చబడిన కారణముగా ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. పసినో, డి నీరో ది గాడ్ ఫాదర్ పార్ట్ IIలో ఇరువురు నటించినప్పటికీ ఇద్దరు ఒకేసారి తెరపై కన్పించిన సన్నివేశాలు లేవు. డి నీరో మరియు పసినో మరోసారి రైటియస్ కిల్ [6] చిత్రములో కలసి నటించారు.

2004 లో, డి నీరో షార్క్ టేల్ అనే అనిమేటెడ్ చిత్రంలో విల్ స్మిత్కు వ్యతిరేకంగా, వ్యతిరేకవాది డాన్ లినో పాత్రకు తన స్వరాన్ని అందించారు. ఆయన మీట్ ది ఫోకర్స్ చిత్రంలో జాక్ బైన్స్ అనే పాత్రను, మరియు స్టార్డస్ట్ చిత్రంలో [[స్వలింగ సంపర్కి[[అయిన బందిపోటు]]]]గా పాత్రలను అద్భుతంగా పోషించారు. ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్స్ఆఫీసు వద్ద విజయవంతమైనప్పటికి మిశ్రమ సమీక్షలు వెలువడేవి. షార్క్ టేల్ చిత్ర ప్రదర్శనను ప్రోత్సహించడంలో భాగంగా, కేవలం స్వరంతో నటించటం అనేది తనకు తొలి అనుభవమైనా అది చాల సరదాగా ఉందని డి నీరో వ్యాఖ్యానించారు.

2007 ఫెబ్రవరిలో గుడ్ షెపర్డ్ చిత్ర తొలి ప్రదర్శనలో మాట్ డెమాన్ తో డి నిరో.

డి నీరో ది గుడ్ షెపర్డ్ చిత్రనిర్మాణానికి పూర్తిగా సమయము కేటాయించదలచి ది డిపార్టెడ్ చిత్రంలో నటించేందుకు అంగీకరించలేదు (ఆయనకు బదులుగా మార్టిన్ షీన్ ఆ పాత్రలో నటించారు). ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన “నాకు చేయాలని ఉంది. నేను చేయగలను అనే కోరిక ఉన్నా, ద గుడ్ షెపెర్డ్' చిత్ర నిర్మాణానికి ఎంతగానో సిద్దమవుతుండడంచే దీనికి సమయము చిక్కలేదు. నేను దానికి సిద్ధమవుతూనే ఏదో ఒక దారి దొరుకుతుందని ఆశించాను. కాని అది అసాధ్యమని తెలిసింది."[7]

ఆయన ది గుడ్ షెఫర్డ్ (2006) చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు, మాట్ డేమన్ మరియు ఎంజేలిన జోలీలతో కలసి నటించారు. అంతేగాక ఈ చిత్రముతో రేజింగ్ బుల్, గుడ్ఫెల్లాస్, ఎ బ్రాన్క్స్ టేల్,ఒన్స్ అపాన్ ఎ టైం ఇన్ అమెరికా మరియు కాసినో చిత్రాలలో ఆయన సహనటుడైన జో పెస్కితో కలసి తిరిగి తెరపైన కనిపించారు.

జూన్ 2006లో డి నీరో తన చిత్రాలకు సంబంధించిన మొత్తం దస్తావేజులు – వ్రాతప్రతులు, దుస్తులు మరియు ఆయన పాత్రానుగుణముగా ఉపయోగించిన వస్తువులు మొత్తము ఆస్టినులోని టెక్సాస్ యునివర్సిటీ యొక్క హారీ రాన్సం సెంటరుకు దానము చేసినట్టుగా ప్రకటన వెలువడింది. అంతేకాక ఏప్రిల్ 27, 2009లో, డె నిరోకు సంబంధించిన సేకరణలను ప్రజలు మరియు పరిశోధకులు దర్శించవచ్చని ప్రకటన వెలువడింది. డి నీరో తాను మార్టిన్ స్కర్సేసేతో కలిసి ఒక క్రొత్త ప్రణాళికకై పనిచేస్తున్నట్లు చెప్పారు. "నేను వాస్తవముగా దీనికై పనిచేయుటకు… [చిత్రానువాద రచయితగా] ఎరిక్ రోత్, నేను ఇంకా మార్టి కలసి కథనం సిద్ధం చేస్తున్నాము అని చెప్పారు.“[7]

డి నీరో రెండు అకాడెమి పురస్కారాలు అందుకున్నారు: రేజింగ్ బుల్ చిత్రములోని పాత్రకు ఉత్తమ నటునిగా, మరియు ది గాడ్ ఫాదర్ పార్ట్ II చిత్రానికిగాను, ఉత్తమ సహాయ నటుని పురస్కారాన్ని అందుకున్నారు.

డి నీరో మరియు మార్లోన్ బ్రాండో మాత్రమే ఒకే పాత్ర పోషించినందుకుగాను అకాడెమి పురస్కారాలను అందుకున్న ఇద్దరు నటులుగా గుర్తింపుపొందారు:ది గాడ్ ఫాదర్లో ముఠానాయకుడైన వృద్ధ డాన్ వీటో కర్లెఒన్ పాత్రను బ్రాండో పోషించగా (ఆయన ఈ పురస్కారాన్ని తిరస్కరించినప్పటికీ), ది గాడ్ ఫాదర్ పార్ట్ IIలో యువ వీటో కర్లెఒన్ పాత్రకుగానూ డి నిరో అకాడెమి పరస్కారాన్ని అందుకున్నారు. బ్రాండో, డి నిరో ఒకే ఒక్కసారి ది స్కోర్ (2001) చిత్రంలో కలసి తెరపైన కనిపించారు. నిజానికి మొదటి గాడ్ ఫాదర్ [8] చిత్రములోని సోనీ కర్లెఒన్ పాత్రకు, ముందుగా డి నీరోకు స్వర పరీక్ష చేసినప్పటికీ ఆ పాత్రను జేమ్స్ కాన్కు ఇవ్వడం జరిగింది. ది గాడ్ ఫాదర్, పార్ట్ II చిత్రం నిర్మించబోయేముందు, దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలాకు, డి నీరో స్వర పరీక్ష గుర్తుకు రావడంతో ఆయనకు యువ వీటో కర్లెఒన్ పాత్రను ఇవ్వడం జరిగింది. పరభాషాచిత్రములో పనిచేసి అకాడెమి పురస్కారాన్ని అందుకున్న ఐదుగురు నటులలో డి నీరో ఒకరు, చాలా కొన్ని సంభాషణలు ఆంగ్లములో చెప్పినప్పటికీ దాదాపుగా సంభాషణలన్నీ ఆయన ఇటాలియన్ భాష లోనే చెప్పారు.

డి నిరో తాను పారామౌంట్ పిక్చర్స్' రాబోవు చిత్రం ఫ్రాన్కి మెషిన్లో మరలా ముఠానాయకుని పాత్ర పోషించనున్నట్లు చెప్పారు. బిబిసిలో ప్రసారమవుతున్న నేర కథల దారవాహిక ఆధారముగా నిర్మింపబడి 2010లో రానున్న మార్టిన్ కాంప్బెల్ యొక్క ఎడ్జ్ అఫ్ డార్క్నెస్ అనే చిత్ర రూపాంతరం మెల్ గిబ్సనుతోపాటు నటించనున్నట్లు ప్రకటించినప్పటికీ, చిత్ర ప్రారంభములోనే కొన్ని విభేదాల కారణముగా ఆయన దీన్నుంచి తప్పుకున్నారు.[9] ఆయనకు బదులుగా రే విన్స్టోన్ను తీసుకోవడం జరిగింది.[10]

చిత్ర దర్శకుడు[మార్చు]

1993లో, ఎ బ్రాంక్స్ టేల్ అనే చిత్రముతో డి నీరో దర్శకునిగా అరంగేట్రం చేశారు. చాజ్జ్ పల్మిటేరిచే రచింపబడ్డ, ఈ చిత్రం బ్రాంక్స్ లో పల్మిటేరి చిన్ననాటి సంక్షోభము గురించినది. పల్మితేరి యొక్క వన్-మాన్ ఆఫ్ బ్రాడ్వే నాటకము చూసిన తరువాత డి నీరో ఈ చిత్ర దర్శకత్వానికి అంగీకరించారు. డి నీరో ఈ చిత్రములో పల్మిటేరిచే పోషించబడిన స్థానిక దొంగల ముఠా నాయకుడు సోన్నీ పాత్ర నుండి తన కొడుకును రక్షించుకునేందుకు తాపత్రయపడే బస్సు డ్రైవరుగా నటించారు.

డి నీరో ఆ తరువాత 2006లో విడుదలైనది గుడ్ షెఫర్డ్ వరకు ఎ చిత్రానికీ దర్శకత్వము వహించలేదు. ఈ చిత్రములో మాట్ట్ డేమన్ మరియు ఎంజేలిన జోలీలు నటించగా, ఈ చిత్రం CIA యొక్క ఆవిర్భావము గూర్చిన వర్ణన కాగా, డేమన్ ఇందులో రెండవ ప్రపంచ యుద్ధం మరియు ప్రచ్చన్న యుద్ధ సమయంలో పనిచేసిన పై స్థాయి కౌంటర్-ఇంటలిజెన్స్ ఎజెంటుగా నటించారు. డి నీరో ఇందులో డేమన్ పాత్రను ఇంటలిజెన్స్ ప్రపంచములో ఏజెంటుగా నియమించే బిల్ డోనోవన్ అనే చిన్న పాత్ర పోషించారు.

ఇటీవలి కార్యక్రమాలు[మార్చు]

సిబిఎస్ ట్రిబెకా ప్రొడక్షన్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం డి నీరో మరియు జేన్ రోసేన్తాల్ ట్రిబెకా భాగస్వాములుగా మూడు ముఖ్యభాగాల కార్యనిర్వాహక నిర్మాణం వహించ వలసి ఉంది. ఈ ఒప్పందం ప్రకారం మూడింటిలో ఒకటి ధారావాహిక కార్యక్రమం అయి ఉంటుంది. ఇందులో మీడియా రైట్స్ కాపిటల్ భాగాస్వామ్యముతో నిర్మింపబడే మొదటి కార్యక్రమం ఒక గంట నిడివిగలిగి ది డిపార్టెడ్ ఆస్కార్ పురస్కార గ్రహీత విలియం మొనహన్ చే రచింపబడుతుంది. న్యూ యార్క్ నేపథ్యములో సాగే పేరు నిర్ణయంకాని ఈ నాటక రచన టీవి రంగములో ఆయన తొలి ప్రయత్నము.

సిబిఎస్ ప్రణాళిక ప్రకారం 2009 వేసవి అనంతరం ప్రసారమయ్యే కార్యక్రమానికి ఇటీవలి కాలములోబాడీ అఫ్ లైస్ మరియు ఎడ్జ్ అఫ్ డార్క్నెస్, చిత్రాలకు రచన చేసిన మొనహన్ రచన చేయనున్నారు. రోసేన్తాల్ మాత్రం ఈ కార్యక్రమంలోని విషయాన్ని వెల్లడించలేదు.

ట్రిబెకా, యూనివవర్సల్ పిక్చర్స్ కొరకు లిటిల్ ఫోకర్స్ మరియు ది అన్డొమెస్టిక్ గాడెస్, పారామౌంట్ కొరకు డి నీరో నటిస్తూ[11] మైక్హెల్ మాన్ దర్శకత్వం వహిస్తున్న ఫ్రాన్కి మెషిన్ ల నిర్మాణం కొనసాగిస్తూనే ఉంటుంది. డి నీరో ప్రస్తుతము నీల్ బర్గర్ దర్శకత్వం వహిస్తున్న ది డార్క్ ఫీల్డ్స్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.[12]

డి నీరో ది కిల్లర్ ఎలైట్ అనే చిత్రంలో జేసన్ స్తాతం మరియు క్లైవ్ ఓవెన్లతో కలసి నటిస్తున్నారు. "IAE పత్రిక" కథనం ప్రకారం ఈ చిత్రంలో డి నీరో, స్తాతం యొక్క ఆప్తమిత్రుడు మరియు గురువు అయిన హంటర్ గా నటిస్తున్నారు.[13] ది కిల్లర్ ఇలైట్ కథ రానుల్ఫ్ ఫినెస్స్ పుస్తకమైన, "ది ఫెధర్ మెన్" నుండి గ్రహించబడి 2011లో విడుదల కానున్నది. ఈ చిత్రము ప్రస్తుతం మెల్బౌర్న్ మరియు విక్టోరియాలలో చిత్రీకరింపబడుచుండగా మరి కొంతభాగం గ్రామీణ విక్టోరియాలో చిత్రించవలసి ఉంది.

డి నీరో ESPN ఫిల్మ్స్ నిర్మించబోయే ఫుట్ బాల్ కోచ్ విన్స్ లొంబార్డి శిక్షణా వృత్తి జీవితం గూర్చిన చిత్రములో లొంబార్డి పాత్రను పోషించనున్నారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ చిత్రం జనవరి 2012లో ఆనగా 2012 సూపర్ బౌల్కు ముందు వారాంతంలో ప్రారంభం కానున్నది.[14][15]

ప్రస్తుతం, డి నీరో, డానీ ట్రేజో నటించనున్న "మకేథ్" అనే యాక్షన్ చిత్రంలో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

2009 ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్లో "వాట్ఎవెర్ వర్క్స్" చిత్ర తొలి ప్రదర్శన సమయములో డి నీరో.

న్యూయార్క్ నగరంలో నివసించే డి నీరో, 1989వ సంవత్సరమునుండి లోవర్ మన్హట్టన్ పొరుగునే ఉన్న ట్రిబెకాలో తన పెట్టుబడులను పెడుతూ వచ్చారు. డి నీరో ట్రిబెకా ప్రొడక్షన్ అనే చిత్ర నిర్మాణ సంస్థలో కీలక భాగస్వామిగా; ప్రఖ్యాతిగాంచిన ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ ; నోబు హాస్పిటాలిటి; పాల్ వాలస్ మరియు బ్రాడ్వే ప్రొడ్యూసర్ స్టివార్ట్ ఎఫ్.లేన్;[16] భాగస్వాములుగా ఉన్న నోబు మరియు ట్రిబెకా గ్రిల్, మరియు ట్రిబెకాలో ఉన్న ది గ్రీన్విచ్ హోటెల్;[17] మరియు పాకశాస్త్రనిపుణుడైన ఆండ్రూ కమెల్లిని[18] భాగస్వామిగా నడపబడుతున్న గ్రీన్విచ్ హోటెల్ లో ప్పోర్వం ఎగో అనే పేరుతొ ప్రసిద్ధిచెందిన లోకాండ వెర్డే భోజనశాల, వంటి వాటిలో ఆయన పెట్టుబడులు పెట్టారు.

1997లో డి నీరో అప్ స్టేట్ న్యూయార్క్లోని మార్బుల్ టౌన్ దగ్గర గల తన ఎస్టేట్ లో (డి నిరోకు తూర్పు మరియు పశ్చిమ మన్హట్టన్ లలో కూడా నివాసాలు కలవు) గ్రేస్ హైటవర్ (పూర్వము విమాన పరిచారిక )ను రెండవ వివాహము చేసుకున్నారు. 1998లో వారి కుమారుడు ఎలియట్ జన్మించాడు.

ఎలియట్ తో పాటు డి నీరోకు ఆయన మొదటి భార్య డయాన్న్ ఆబాట్కు జన్మించిన, పూర్వము నటుడు ప్రస్తుతం న్యూయార్క్ భూముల క్రయ విక్రయాలు[19] సాగిస్తున్న రఫెల్ అనే కుమారుడు కూడా కలడు. అంతేగాక ఆయన ఆబాట్ కుమార్తె (ముందరి వివాహ సంతానము), డ్రేనను దత్తత తీసుకున్నారు. వీరికి తోడుగా చాలాకాలము ఆయనతో కలసి ఉన్న, మునుపటి మాడల్ అయిన తౌకి స్మిత్కు జూలియన్ హెన్రీ మరియు ఆరోన్ కేండ్రిక్ అనే కవలలు (1995 లో బాహ్య ఫలదీకరణ మరియు గర్భదానం చే జన్మించిన) జన్మించారు.[ఉల్లేఖన అవసరం]

1998వ సంవత్సరంలో ఫ్రాన్స్ లో ఒక చిత్ర షూటింగ్ సమయములో ఫ్రెంచ్పోలీసులు ఆయనను తీసుకువెళ్ళి తొమ్మిది గంటలపాటు ప్రశ్నించగా ఆ సమయంలో మాజిస్ట్రేట్ ఆయనను ఒక వ్యభిచార వలయం గురించి ప్రశ్నలు అడిగారు. డి నీరో దానితో తనకు ఎటువంటి సంబంధము లేదని చెపుతూ, తాను ఎప్పుడు వ్యభిచార గృహాలను సందర్శించ లేదని, "....ఒకవేళ అలా చేసిననూ అది నేరము కాబోదు" అని చెప్పారు.[20] ఒక వ్యభిచారిణి ఆయన పేరు ప్రస్తావించడంతో మాజిస్ట్రేట్ ఆయనను విచారించదలచారు. లె మొండె, అనే ఫ్రెంచ్ వార్తాపత్రికతో జరిగిన భేటిలో ఆయన, "నేను ఎప్పుడు ఫ్రాన్స్ కు తిరిగి రాను. నేను నా స్నేహితులకు కూడా ఫ్రాన్సుకు వెళ్ళవద్దని సలహా ఇస్తాను ,"ఇంకా తాను" వారి లెజియన్ అఫ్ హానర్ను వీలైనంత త్వరగా వారి రాయబారికి తిప్పి పంపిస్తానని చెప్పారు." ఫ్రెంచ్ న్యాయ నిపుణులు డి నీరోను ముద్దాయిగా కాక సమర్థమైన సాక్షిగా పరిగణించినట్లుగా చెప్పారు.

2004లో జరిగిన వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో డి నీరోకు ఇటలీ పౌరసత్వము ప్రదానము చేయవలసి ఉంది. ఏమైనప్పటికీ సన్స్ అఫ్ ఇటలీ అనే స్వచ్చంద సంస్థ, డి నిరో ఇటలీయులు మరియు ఇటాలియన్ -అమెరికన్ల ను తరచుగా నేరచరితర కలిగిన పాత్రలలో చూపిస్తూ వారి పరపతికి భంగం కల్గించినట్లు అప్పటి ఇటలీ ప్రధానమంత్రి సిల్విఒ బెర్లుస్కానికు డి నీరోకు ఇటలీ పౌరసత్వము ఇవ్వడముపట్ల తమ వ్యతిరేకతను తెలియచేశారు. ఇటలీ సాంస్కృతికశాఖా మంత్రిగా ఉన్న గులియనో ఈ ఆక్షేపణలను ఖండించగా, ఈ మర్యాదను ఆయనకు అక్టోబర్ లో రోమ్ లో అందచేయుటకు నిర్ణయించారు. ఆ నెలలో డి నీరో, ఇటలీ లో రెండు మీడియా ప్రదర్శనలకు హాజరు కాలేకపోవడంతో వివాదము మరలా రాజుకుంది, దీనికి " సరిగా నిర్వర్తించలేని" "తీవ్రమైన సమాచార లోపాలను" తన వైపు నుండి కారణాలుగా చెపుతూ, ఆఖరులో "నేను చివరిగా ఎవరిని నొప్పించ దలచుకోలేదు. నేను ఇటలీను ప్రేమిస్తున్నాను" అని చెప్పారు. డి నీరోకు అక్టోబరు 21, 2006 రోమ్ ఫిలిం ఫెస్టివల్ ఆఖరులో పౌరసత్వం అప్పగించబడింది. డి నీరో తన తాత ముత్తాతల పుట్టినిల్లు అయిన, మోలిసే జిల్లాలోని వోటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకున్నారు.

డి నీరో డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారుడేగాక,2000 ఆధ్యక్ష ఎన్నికలలో అల్ గొరేను నోటిమాటల ద్వారా సమర్ధించారు. 2004 ఆధ్యక్ష ఎన్నికలలో డె నీరో బహిరంగముగా జాన్ కెర్రీకు తన మద్దతు ప్రకటించారు. 1998వ సంవత్సరంలో ఆయన కాంగ్రెస్ ప్రతినిధులతో ప్రచారం చేసి బిల్ క్లింటను[21] కు వ్యతిరేకముగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయేటట్టు చేశారు. సెప్టెంబర్ 11, 2001 దాడులు గూర్చి నిర్మింపబడిన 9/11 అనే కథనాన్ని డి నీరో వివరించారు. జూల్స్ మరియు గెడియన్ నాడెట్ లచే నిర్మించబడి సిబిఎస్ లో ప్రసారమైన ఈ కథనంలో ముఖ్యముగా ఆనాటి దాడులలో అగ్నిమాపక సిబ్బంది పాత్రను చూపిస్తూ డి నిరో వివరణ అందించారు. తన ది గుడ్ షెపర్డ్ చిత్ర ప్రదర్శనను ప్రోత్సహించడానికి సహనటుడు మాట్ట్ డామన్తో కలిసి వెళ్ళినప్పటి హార్డ్ బాల్ విత్ క్రిస్ మథ్యూస్ అట్ జార్జ్ మేసన్ యునివర్సిటీలో డిసెంబరు 8, 2006న ప్రసారమైన ఉపకథలో భాగంగా మీరు ఎవరిని యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షునిగా చూడాలనుకుంటున్నారు అని అడిగారు. దీనికి బదులుగా డి నీరో "నేను ఇద్దరి గూర్చి ఆలోచిస్తున్నాను: హిల్లరీ క్లింటన్ మరియు ఒబామా." ఫిబ్రవరి 4, 2008న ఐజాడ్ సెంటర్ న్యూ జెర్సీలో సూపర్ ట్యూస్డేకు ముందు జరిగిన ప్రదర్శనలో డి నీరో ఒబామాను సమర్దించారు.[22]

చలనచిత్రపట్టిక[మార్చు]

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు[మార్చు]

మరిన్ని వివరాలకు చూడండి: List of Robert De Niro awards.

అకాడెమి పురస్కారం[మార్చు]

BAFTA పురస్కారం[మార్చు]

గోల్డెన్ గ్లోబ్ పురస్కారము[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "Robert De Niro Biography (1943-)". filmreference.com. Retrieved August 20, 2007.
 2. "Famous people from Molise". deliciousitaly.com. Retrieved August 20, 2007.
 3. "De Niro's part-Irish Ancestors". Genealogy. Retrieved July 8, 2008.
 4. "'There was a sense of exhilaration about what we had done'". guardian.co.uk. London. September 1, 2004. Retrieved May 22, 2010.
 5. "People Magazine". docs.google.com. Retrieved August 20, 2007.
 6. "De Niro, Pacino reunite for 'Kill'". variety.com. Retrieved 2008-08-20.
 7. 7.0 7.1 Graham, Jamie (2007-03). "The Total Film Interview". Total Film (125): 105. Check date values in: |date= (help)
 8. ది గాడ్ ఫాదర్ ఫ్యామిలీ: ఎ లుక్ ఇన్సైడ్ (1990 డాక్యుమెంటరీ)
 9. Michael Fleming (2008-09-04). "De Niro exits 'Edge of Darkness'". Variety. Retrieved 2008-09-04.
 10. Michael Fleming (2008-09-12). "Winstone replaces De Niro in 'Edge'". Variety. Retrieved 2008-09-12.
 11. Fleming, Michael (October 14, 2008). "CBS, Tribeca pact for pilot trio". Variety. మూలం నుండి 2009-11-24 న ఆర్కైవు చేసారు. Retrieved March 10, 2010.
 12. Siegel, Tatiana (March 3, 2010). "De Niro to star in 'Fields'". Variety. మూలం నుండి 2010-03-07 న ఆర్కైవు చేసారు. Retrieved March 10, 2010.
 13. Freeman, C. "Inferno Entertainment Brings Action to the Silver Screen". IAE Magazine. Retrieved May 25, 2010.
 14. "రాబర్ట్ డె నిరో టు ప్లే విన్స్ లొంబార్డి ఇన్ మూవీ", ఇఎస్పియెన్ , రిట్రీవ్డ్ మార్చ్ 10, 2010
 15. Wolfley, Bob (March 9, 2010). "De Niro to portray Lombardi in ESPN film". Milwaukee Journal Sentinel. Retrieved March 10, 2010. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 16. Honan, William H. (August 23, 1989). "De Niro Is Trying Life Behind the Camera". New York Times.
 17. "Greenwich Hotel". Greenwich Hotel. Retrieved 2010-03-09. Cite web requires |website= (help)
 18. work=Zagat.com "Locanda Verde Is A-Go" Check |url= value (help). May 12, 2009. Missing pipe in: |url= (help); Cite news requires |newspaper= (help)
 19. "New York Real Estate - Prudential Douglas Elliman". Elliman.com. Retrieved 2010-03-09. Cite web requires |website= (help)
 20. "De Niro furious over French grilling". BBC News. February 24, 1998. Retrieved 2007-08-20.
 21. "Scepticism and support swirl around Clinton". BBC News. December 17, 1998. Retrieved August 20, 2007.
 22. "De Niro, Damon: Spies, patriotism and politics". MSNBC. Retrieved August 20, 2007.

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
Awards for Robert De Niro

మూస:AcademyAwardBestActor 1961-1980 మూస:AcademyAwardBestSupportingActor 1961-1980 మూస:GoldenGlobeBestActorMotionPictureDrama 1961-1980 మూస:2009 Kennedy Center Honorees మూస:AFI Life Achievement Award