రాబర్ట్ ప్యాటిన్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాబర్ట్ ప్యాటిన్సన్
Robert Pattinson Hôtel de Crillon 2009.jpg
Pattinson in November 2009
జననం (1986-05-13) 1986 మే 13 (వయస్సు: 33  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 2004–ఇప్పటి వరకు

రాబర్ట్ థామస్ ప్యాటిన్సన్ [1] (13 మే 1986న జననం)[2] ఒక ఆంగ్ల నటుడు, మోడల్ మరియు స్వరకర్త.[3] స్టీఫెనీ మేయర్ రాసిన నవల ఆధారంగా రూపొందించిన ట్విలైట్ చిత్రంలో ఎడ్వర్డ్ కల్లెన్ పాత్ర ద్వారా అతను సుపరిచితుడు. హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్ చిత్రంలో సీడ్రిక్ డిగ్గోరీ పాత్ర కూడా అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.[4][5][6]

బాల్యం[మార్చు]

ప్యాటిన్సన్ లండన్‌లో జన్మించాడు. అతని తల్లి క్లారీ ఒక మోడలింగ్ సంస్థలో పనిచేసేది. ఇక అతని తండ్రి రిచర్డ్ అమెరికా నుంచి వింటేజ్ కార్లను దిగుమతి చేసుకునేవాడు.[7] ప్యాటిన్సన్ టవర్ హౌస్ స్కూల్ మరియు హరోడియన్ స్కూల్‌లో చదువుకున్నాడు.[8] బార్నెస్ థియేటర్ కంపెనీ ద్వారా అతను ఔత్సాహిక సంగీతరంగంలోకి అడుగుపెట్టాడు. తెరవెనుక కొంత అనుభవం గడించిన పిదప అతను నటనపై దృష్టి సారించాడు. టెస్ ఆఫ్ ది డిఅర్బర్‌విల్లిస్ నవల రూపకల్పన సందర్భంగా అతను ఒక యాక్టింగ్ ఏజెంట్ దృష్టిలో పడ్డాడు. తద్వారా తనకు గుర్తింపును తీసుకొచ్చే వృత్తిపరమైన పాత్రలకు ప్రయత్నించాడు. ప్యాటిన్సన్‌కు ఇద్దరు సోదరీమణులున్నారు. వారిలో ఒకరు గాయని లిజ్జీ ప్యాటిన్సన్.[9][10]

జీవనం[మార్చు]

మోడలింగ్[మార్చు]

పన్నెండేళ్ల ప్రాయంలో ప్యాటిన్సన్ మోడలింగ్‌లో అడుగుపెట్టాడు. అయితే నాలుగేళ్ల తర్వాత అది అతనికి పెద్దగా కలిసిరాలేదు. ఒక మోడల్‌గా తన పురుష రూపాన్ని మెరుగుపరుచుకోవడంపై అతను పెద్దగా శ్రద్ధ చూపించలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. దాని గురించి డిసెంబరు, 2008లో ప్యాటిన్సన్ ఇలా వివరించాడు, "మోడలింగ్‌ను ప్రారంభించిన తొలి నాళ్లలో నేను చాలా పొడవుగా మరియు చూడటానికి అమ్మాయి వలే ఉండేవాడ్ని. అందువల్ల చాలా అవకాశాలు నాకు వచ్చాయి. ఎందుకంటే ఆ సమయంలో ఉభయలైంగిక రూపం చాలా నిబ్బరంగా ఉండేది. అప్పుడు నేను ఎక్కువగా పురుష రూపం సంతరించుకోవాలని అనుకున్నాను. అందువల్ల అప్పటి నుంచి అవకాశాలు నాకు మొఖం చాటేశాయి. మోడలింగ్‌ వృత్తిలో అత్యంత ఘోరంగా విఫలమయ్యాను."[11] 2007 శిశిరంలో హ్యాకెట్ సంస్థ చేపట్టిన ప్రచార కార్యక్రమంలో ప్యాటిన్సన్ పాల్గొన్నాడు.[12]

నటన[మార్చు]

2008లో ట్విలైట్ చిత్రం ప్రీమియర్ సందర్భంగా ప్యాటిన్సన్

బుల్లితెర చలనచిత్రం రింగ్ ఆఫ్ ది నైబ్‌లంగ్స్-2004 మరియు దర్శకురాలు మీరా నాయర్ రూపొందించిన వేనిటీ ఫెయిర్ చిత్రాల్లో ప్యాటిన్సన్ సహాయక పాత్రలు పోషించాడు. అతను నటించిన సన్నివేశాలను తర్వాత తొలగించినప్పటికీ, అవి DVD వెర్షన్‌లో మాత్రం కనిపించాయి.[13] మే, 2005లో రాయల్ కోర్ట్ థియేటర్‌లో ది వుమన్ బిఫోర్ అనే UK ప్రదర్శనకు అతను హాజరుకావాల్సి ఉంది. అయితే ముందు రోజు రాత్రి అతని స్థానంలో టామ్ రిలేకు అవకాశం లభించింది.[14] తర్వాత ఏడాది అతను హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్ చిత్రంలో సీడ్రిక్ డిగ్గోరీ పాత్రను పోషించాడు. ఆ పాత్ర ద్వారా అతను అదే ఏడాదిలో బ్రిటీష్ స్టార్ ఆఫ్ టుమారోగా ది టైమ్స్ చేత ప్రకటించబడ్డాడు.[15] అంతేకాక అతను తదుపరి జ్యూడ్ లాగా ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రశంసలందుకున్నాడు.[8][16][17]

ట్విలైట్ చిత్రంలో ఎడ్వర్డ్ కల్లెన్ పాత్రను ప్యాటిన్సన్ పోషించాడు. స్టీఫెనీ మేయర్ రాసిన అత్యుత్తమంగా అమ్ముడైన నవల ఆధారంగా రూపొందించిన ఆ చిత్రం 21 నవంబరు 2008న ఉత్తర అమెరికాలో విడుదలయింది. TV గైడ్ ప్రకారం, ఎడ్వర్డ్ కల్లెన్ పాత్రకు ఎంపికవడంపై ప్యాటిన్సన్ తొలుత ఆందోళన చెందాడు. ఆ పాత్రకు తాను న్యాయం చెయ్యగలనా అని కూడా భయపడ్డాడు.[18] ఎడ్వర్డ్ కల్లెన్ పాత్రను అతను ట్విలైట్ కొనసాగింపుThe Twilight Saga: New Moon చిత్రాల్లోనూ మరియు ఆగస్టు, 2009లో చిత్రీకరణ మొదలుపెట్టుకుని, 30 జూన్ 2010న విడుదల కానున్న ఎక్లిప్స్ చిత్రంలోనూ పోషించాడు.[19]

లిటిల్ యాషెస్ (అందులో సాల్వడర్ డాలీగా నటించాడు), హౌ టు బి (బ్రిటీష్ హాస్యకథా చిత్రం) మరియు లఘు చిత్రం ది సమ్మర్ హౌస్‌ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాల్లోనూ అతను ప్రధాన పాత్రధారుడు.

2009లో 81వ అకడెమీ అవార్డుల కార్యక్రమానికి ప్యాటిన్సన్ హాజరయ్యాడు.[20] నవంబరు 10న ప్యాటిన్సన్ యొక్క జీవితం మరియు పేరుప్రతిష్ఠలకు సంబంధించిన లఘు చిత్రం రాబ్‌సెస్డ్‌ DVDని రివోల్వర్ ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేసింది.[21] ట్విలైట్ చిత్రాల ద్వారా £10 మిలియన్లు ($16 మిలియన్లు) ఆర్జించడంతో ప్యాటిన్సన్ టి టెలిగ్రాఫ్ యొక్క 10 మంది అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితా లో #10 స్థానంలో నిలిచాడు.[22]

1885 నవల బెల్ అమీ ఆధారంగా 2010లో రూపొందించనున్న చిత్ర అనువర్తనంలో ప్యాటిన్సన్ జార్జెస్ డ్యూరాయ్ పాత్రను పోషించనున్నాడు.[23] అలాగే నిర్మాత డేవిడ్ పఫ్ నాటకంలోనూ అతను నటించనున్నాడు.[24] ప్యాటిన్సన్ నటించిన రిమంబర్ మి చిత్రం 12 మే 2010[25] న విడుదలకానుంది. అంతేకాక సారా గ్రూయెన్ నవల ఆధారంగా సీన్ పెన్ మరియు రీస్ విథర్‌స్పూన్‌లతో తెరకెక్కించనున్న చిత్ర అనువర్తనం వాటర్ ఫర్ ఎలిఫెంట్స్‌లో నటించడంపై ప్యాటిన్సన్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడు.[26]

సంగీతం[మార్చు]

ప్యాటిన్సన్ గిటారు మరియు పియానోలను వాయించడంతో పాటు తానే సొంతంగా బాణీలు కట్టేవాడు.[27] అలాగే శామ్ బ్రాడ్లీ[28]తో కలిసి తాను రాసిన "నెవర్ థింక్" మరియు మార్కస్ ఫోస్టర్, బాబీ లాంగ్ రాసిన "లెట్ మి సైన్" అనే రెండు ట్విలైట్ పాటలను ప్యాటిన్సన్ ఆలపించాడు.[29] దర్శకుడు కేథరిన్ హార్డ్‌విక్ తనకు తెలియకుండానే ప్యాటిన్సన్ పాటలను చేర్చిన తర్వాత ఈ రెండు పాటలు చిత్రానికి జతచేయబడ్డాయి. "వాటిలో ఒకటి ముఖ్యమైనది, అది సన్నివేశాన్ని రక్తికట్టించింది. బహుశా ఆ పాట అక్కడ ఉంటేనే బావుంటుంది."[3] అని అతను అంగీకరించాడు. హౌ టు బి చిత్రంలోని పాటల్లో ప్యాటిన్సన్[30] ఏకంగా మూడింటిని చేశాడు. వాటిని స్వరకర్త జో హ్యాస్టింగ్స్ రాశాడు.[31]

ఒకవైపు పాటల రికార్డింగ్‌ జరుగుతుండగా, ప్యాటిన్సన్ ఇలా అన్నాడు, "నిజంగా నేనెప్పుడూ గీతాలాపన చేయలేదు. పబ్‌ల్లో మాత్రమే వినిపించాను." సంగీత వృత్తి గురించి ప్రశ్నించగా, "ఒకవేళ నటన విఫలమైతే నేను తిరిగి సంగీతంపైనే దృష్టి సారిస్తాను." అని చెప్పాడు.[3] 2008లో, తన మొదటి ప్రియురాలి ప్రస్తుత ప్రియుడి యొక్క బ్యాండ్ బ్యాడ్ గర్ల్స్‌తో కూడా ప్యాటిన్సన్ పనిచేశాడు.[32]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ప్యాటిన్సన్‌ను ఒకానొక "సెక్సియస్ట్ మ్యాన్ అలైవ్"గా పీపుల్ సంచిక[33] 2008లో పేర్కొంది. గ్లామర్ నిర్వహించిన అభిప్రాయ సేకరణ ద్వారా 2009లో కూడా అతను ప్రకటించబడ్డాడు.[34]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

(2006). హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్ అఫ్ ది ఫోనిక్స్
సంవత్సరం చిత్రం పాత్ర గమనికలు
2004 వేనిటీ ఫెయిర్ రాడీ క్రాలీ DVDలో మాత్రమే కనిపిస్తుంది
రింగ్ ఆఫ్ ది నైబ్‌లంగ్స్ గైస్లర్ టెలివిజన్ ఫిల్మ్
2005

హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్

సీడ్రిక్ డిగ్గోరీ
ది హాంటెడ్ ఎయిర్‌మన్ టాబీ జగ్ టెలివిజన్ ఫిల్మ్
2007 ది బ్యాడ్ మదర్స్ హ్యాండ్‌బుక్ డేనియల్ గేల్ టెలివిజన్ ఫిల్మ్
సీడ్రిక్ డిగ్గోరీ

హాస్య ప్రధాన పాత్ర

2008 హౌ టు బి

కళ

ఉత్తమ నటుడుగా స్ట్రాస్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్[35]
ట్విలైట్ ఎడ్వర్డ్ కల్లెన్ MTV మూవీ అవార్డ్ ఫర్ బ్రేక్‌త్రూ పెర్ఫార్మెన్స్ మేల్
MTV మూవీ అవార్డ్ ఫర్ బెస్ట్ కిస్ (క్రిస్టెన్ స్టివార్ట్తో)
MTV మూవీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫైట్ (with క్యామ్ గిగాండెట్‌తో)
2009 లిటిల్ యాషెస్ సాల్వడర్ డాలీ
The Twilight Saga: New Moon ఎడ్వర్డ్ కల్లెన్
2010 రిమంబర్ మి టేలర్ రోత్

నిర్మాణాంతరం

The Twilight Saga: Eclipse ఎడ్వర్డ్ కల్లెన్

నిర్మాణాంతరం

అన్‌బౌండ్ కేపిటివ్స్ నిర్మాణానికి ముందు
2011 బెల్ అమీ జార్జెస్ డ్యూరాయ్ నిర్మాణానికి ముందు

గమనికలు[మార్చు]

 1. Robsessed (DVD). Revolver Entertainment. 2009. Retrieved February 1, 2010.
 2. "Robert Pattinson". People.com. Retrieved 2009-04-03. Cite news requires |newspaper= (help)
 3. 3.0 3.1 3.2 Gina McIntyre (2008-10-09). "Robert Pattinson on his 'Twilight' songs: 'Music is my backup plan if acting fails'". Los Angeles Times. Retrieved 2009-02-01. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 4. Sona Charaipotra (2008-11-14). "A Night Out With - Robert Pattinson". New York Times. Text " accessdate-2009-02-11 " ignored (help); Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 5. Rebecca Murray (2008-07-31). "Robert Pattinson Discusses 'Twilight'". About.com. మూలం నుండి 2008-12-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-02-11. Cite web requires |website= (help)
 6. Hillary Atkin (2008-11-16). "Exclusive Interview: Robert Pattinson". Fandango. Retrieved 2009-02-11. Cite web requires |website= (help)
 7. "రాబర్ట్ ప్యాటిన్సన్". మూలం నుండి 2009-04-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-08. Cite web requires |website= (help)
 8. 8.0 8.1 Flora Stubbs (2005-11-17). "Potter star 'next Jude Law'". Evening Standard. మూలం నుండి 2008-09-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-10-02. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 9. Tibbetts, Graham (2008-12-02). "Profile of Twilight star Robert Pattinson". The Daily Telegraph. Retrieved 2009-08-16.
 10. Griffin, Susan (26 November 2009). "Twighlight star Robert Pattinson reveals his shy side". The Glaswegian. Retrieved 2009-12-04. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 11. "Why Robert Pattinson's Modeling". New York Magazine.
 12. "Robert Pattinson-Hackett Campaign". Nachophoto.com. మూలం నుండి 2009-08-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-08-16. Cite web requires |website= (help)
 13. Howell, Peter (21 November 2009). "Something to sink his teeth into". The National. Retrieved 2009-12-04. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 14. "Robert Pattinson: Teen heartthrob Robert Pattinson is an English actor, model and musician best known for playing vampire Edward Cullen in Twilight". STV. 12 November 2009. Retrieved 2009-12-04. Cite news requires |newspaper= (help)
 15. Lisa Dillon (2005-05-26). "Almost famous". The Times. Retrieved 2008-10-02.
 16. "Top 20 Rising Stars Under 30". Saturday Night Magazine. 2008-07-29. మూలం నుండి 2008-09-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-10-02.
 17. "Teen People Names 'Artists of the Year' and 'What's Next'". Starpulse. 2005-11-02. Retrieved 2008-10-02. Cite web requires |website= (help)
 18. "Before the Spotlight, Twilight's Robert Pattinson Was Intimidated by "Perfect" Role". TV Guide. 2008-11-21. మూలం నుండి 2009-01-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-26.
 19. Adam Rosenberg (2009-06-30). "'The Twilight Saga: Eclipse' Shoot Dates Revealed!". MTV. Retrieved 2009-10-07. Cite web requires |website= (help)
 20. Josh Horowitz (2009-02-17). "Report: Robert Pattinson To Present At Academy Awards". MTV. Retrieved 2009-08-09. Cite web requires |website= (help)
 21. Ditzian, Eric (6 October 2009). "Robert Pattinson's Life Is Subject Of 'Robsessed' Documentary". MTV.com. Retrieved 9 November 2009. Cite web requires |website= (help)
 22. http://www.telegraph.co.uk/culture/film/film-news/6587698/Johnny-Depp-is-highest-paid-actor-with-21m-deal-for-next-Pirates-film.html
 23. "Christina Ricci Joins Robert Pattinson in BEL AMI". Collider. January 8, 2010. Retrieved January 11, 2010. Cite web requires |website= (help)
 24. David Benedict (2009-02-13). "'Equus' closure prompts rumors". Variety. మూలం నుండి 2010-01-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-02-23.
 25. "Remember Me". Summit Entertainment. Retrieved 2010-01-11. Cite web requires |website= (help)
 26. Pamela McClintock (January 21, 2010). "Penn, Pattinson circle 'Water'". Variety. మూలం నుండి 2010-01-25 న ఆర్కైవు చేసారు. Retrieved January 23, 2010. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 27. "Robert Pattinson: 'I'm Really Not That Interesting'". The Improper. మూలం నుండి 2009-02-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-02-01. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 28. "Sam Bradley Interview". Portrait Magazine. December 2008. మూలం నుండి 2012-09-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-30. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 29. Becky Reed. "Twilight Star Talks Soundtrack". Click Music. మూలం నుండి 2009-01-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-30. Cite web requires |website= (help)
 30. "Robert Pattinson Sings Three Songs in Indie Flick How to Be". Us Magazine. 2009-03-11. Text " accessdate-2009-03-31 " ignored (help); Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 31. "Songs composed by Joe Hastings in Indie Flick How to Be". How To Be. 2009-03-09. మూలం నుండి 2010-06-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-03-09. Text "accessdate-2009-03-31" ignored (help); Cite web requires |website= (help)
 32. Katrina-Kasey Wheeler (2009-01-10). "Music: Robert Pattinson's back up plan". Pop Media Examiner. Text " accessdate-2009-01-30 " ignored (help); Cite web requires |website= (help)
 33. "2008's Sexiest Man Alive". People. Retrieved 2009-08-27.
 34. "Sexiest Men Alive #1". 2009-08-05. మూలం నుండి 2009-08-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-08-05. Cite web requires |website= (help)
 35. "స్ట్రాస్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ : 2008 అవార్డ్స్". మూలం నుండి 2013-04-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-03-09. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]