Jump to content

రాబిన్ సేన్

వికీపీడియా నుండి
రాబిన్ సేన్

పదవీ కాలం
1971 – 1980
ముందు దేబెన్ సేన్
తరువాత ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ
నియోజకవర్గం అస‌న్‌సోల్

వ్యక్తిగత వివరాలు

జననం 1923
సెన్హాటి , ఖుల్నా జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 1995
కోల్‌కతా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం కోల్‌కతా
వృత్తి రాజకీయ నాయకుడు

రాబిన్ సేన్ (మార్చి 1923 - 19 జనవరి 1995) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అస‌న్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాబిన్ సేన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ అభ్యర్థిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అస‌న్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి నారాయణ్ చౌదరిపై 33660 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 1977 లోక్‌సభ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సయ్యద్ మొహమ్మద్ జలాల్ పై 72227 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాబిన్ సేన్ 1980 లోక్‌సభ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ చేతిలో 9652 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  2. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  3. "Asansol Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 29 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  4. "Asansol Lok Sabha Election Results" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 29 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.