రామచంద్రాపురం (అవనిగడ్డ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామచంద్రాపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671

"రామచంద్రాపురం" (అవనిగడ్డ) కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 121., ఎస్.టి.డి కోడ్ = 08671. [1]

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన

సమీప మండలాలు[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

అవనిగడ్డ, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

దివిసీమ పాలిటెక్నిక్[మార్చు]

  1. ఈ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుచున్న అత్తలూరి రేష్మ అను విద్యార్థిని, కరాటేలో గిన్నెస్ రికార్డు ఘనత సాధించింది. [4]
  2. ఈ కళాశాల విద్యార్థి సింగోతు ఉదయకుమార్, జాతీయస్థాయి 20-20 క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. ఇతడు 2012-15 విద్యా సంవత్సరంలో ఈ కళాశాలలో కంప్యూటర్స్ ఇంజనీరింగులో డిప్లమా చదివి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. [7]

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

ఈ గ్రామంలో, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామాభివృద్ధే ధ్యేయంగా తాపత్రయపడుచున్నది. ఈ గ్రామంలో రు. నాలుగు లక్షలతో పలు అభివృద్ధిపనులు చేపట్టి పూర్తిచేసారు. ఈ క్రమంలో గ్రామస్థులకు పలు సౌకర్యాలు సమకూరినవి.

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

నలందపాలెంలో 17 లక్షల రూపాయలతో ఉపరితల నీటి ట్యాంకు నిర్మించారు. దీనికి కావలసిన మూడు సెంట్ల భూమిని, గ్రామానికి చెందిన శ్రీ వాకా కోటేశ్వరరావు, తన తండ్రి శ్రీ వాకా ఈశ్వరరావు మరియూ తన మామ శ్రీ అద్దంకి లక్ష్మయ్యల పేరిట విరాళంగా అందజేసినారు. దీనికి అనుగుణంగా మూడు లక్షల రూపాయలతో పైపులైనులు గూడా ఏర్పాటుచేసి గ్రామంలోని మారుమూల ప్రాంతాలకు గూడా త్రాగునీరు అందించుచున్నారు.

రహదారులు[మార్చు]

సర్దాకోడు ఎస్.సి.కాలనీలో రు.20.50 లక్షలతో రెండు సిమెంటు రహదారులు నిర్మించారు. రామచంద్రపురంలో ఐదు లక్షల రూపాయలతో సిమెంటు రహదారులను నిర్మించతలపెట్టినారు. నలందపాలెంలో రు. 50,000 తో అంతర్గత రహదారి మరియూ రు. 40,000 తో ఒక ర్యాంపు నిర్మించారు. ఇంకా శ్మశానవాటిక అభివృద్ధి, సి.ఎల్.ఎఫ్. వీధి దీపాల ఏర్పాటు మొదలగు అభివృద్ధి పనులు చేసారు. [2]

ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం[మార్చు]

అవనిగడ్డ మండలంలోని అశ్వారావుపాలెం, మోదుమూడి, వేకనూరు, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, సుమారు 8 సంవత్సరాల క్రితం, అవనిగడ్డ సంఘంలో విలీనం చేసారు. [8]

గ్రామానికి సాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామములో దాత శ్రీ బచ్చు ప్రభాకరరావు సహకారంతో 100 ఎకరాల భూమికి కొత్తగా నిరంతర సాగునీటి వసతి ఏర్పడినది. మురుగు కాలువలోనికి వచ్చే నీటిని నాలుగు లక్షల రూపాయల వ్యయంతో, పంటచేలలో బోదెలు త్రవ్వించి, తూములను ఏర్పాటుచేసి, ఆ నీటిని ఆయకట్టు చివరి భూములకు ఆయిలు ఇంజనుల ద్వారా పంపించి ఆ భూములకు సాగునీటి సౌకర్యం కల్గించుచున్నారు. [6]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో శ్రీమతి జిన్నాబత్తుని అన్నమ్మ సర్పంచిగా గెలుపొందారు. శ్రీమతి కొత్తూరు సావిత్రి ఉపసర్పంచిగా ఎన్నికైనారు. శ్రీమతి సావిత్రి పదవిలో ఉండగానే, 2016,నవంబరు-8న, 37 సంవత్స్రాల వయస్సులో అనారోగ్యంతో పరమపదించారు. [1]&[9]

ఈ గ్రామ పంచాయతీ, 2001-02 ఆర్థిక సంవత్సరం నుండి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు, వరుసగా 17 సంవత్సరాలు, 100% పన్ను వసూలుచేసి రికార్డులకెక్కినది. [11]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ బాలత్రిపురసుందరీ సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహాల మండపం, వీరాంజనేయస్వామి ఆలయం నిర్మించుచున్నారు. దేవాదాయశాఖ అధీనంలో ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరడంతో, గ్రామస్థులు ముందుకు వచ్చి, అభివృద్ధి చేస్తున్నారు. [3]

ఈ ఆలయంలో 2017,ఏప్రిల్-8వతేదీ శనివారంనుండి 10వతేదీ సోమవారంవరకు ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. 8న అంకురార్పణ, 9న ధాన్యాధివాసం మరియు 10న ఉదయం 9-45 కి, శాంతికళ్యాణం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. [10]

ఈ ఆలయానికి మోదుమూడి గ్రామములో 7.82 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [12]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయాన్ని, గ్రామస్థుల సహకారంతో, శ్రీ బాలకోటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో, నూతనంగా నిర్మించారు. ఈ ఆలయంలో, 2015,జూన్-4వ తెదీ గురువారంనాడు, మొదట శాంతిహోమం నిర్వహించి, అనంతరం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం, ఉదయం 8-53 గంటలకు, శ్రీ అభయాంజనేయస్వామి, నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, ఆగమపండితుల వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులతో, గ్రామం కిటకిటలాడినది. అనంతరం ఆలయ ఆవరణలో భారీగా అన్నసంతర్పణ నిర్వహించారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Avanigadda/Ramachandrapuram". Retrieved 26 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-6; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,సెప్టెంబరు-29; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-18; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఏప్రిల్-18; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-5; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జులై-22; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-10; 3వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-7; 44వపేజీ. [9] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,నవంబరు-9; 1వపేజీ. [10] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఏప్రిల్-11; 2వపేజీ. [11] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,మే-23; 3వపేజీ. [12] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-21; 3వపేజీ.