రామన్నగూడెం (తాడేపల్లిగూడెం మండలం)
స్వరూపం
(రామన్నగూడెం(తాడేపల్లిగూడెం మండలం) నుండి దారిమార్పు చెందింది)
| రామన్నగూడెం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 16°52′12″N 81°29′28″E / 16.870005°N 81.491250°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండలం | తాడేపల్లిగూడెం |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 534146 |
| ఎస్.టి.డి కోడ్ | |
రామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.. తాడేపల్లిగూడెం నుండి పెదతాడేపల్లి మీదుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాడేపల్లిగూడెం నుండి నల్లజర్ల వెళ్ళే రహదారిలో పెదతాడేపల్లి వరకు వెళ్ళి, అక్కడి నుండి ఊరి మధ్యలో ఉత్తరంగా 3 కిలోమీటర్లు వెళ్ళితే రామన్నగూడెం వస్తుంది. తాడేపల్లిగూడెం-నల్లజర్ల రహదారిలో పెదతాడేపల్లి తరువాత వచ్చే వెంకటరామన్నగూడెం, రామన్నగూడెంకు 2 కిలోమీటర్ల దూరంలో పశ్చిమంగా ఉంటుంది.
వ్యవసాయం
[మార్చు]రామన్నగూడెం వ్యవసాయ గ్రామం. వరి, చెరకు ప్రధానమైన పంటలు. మిరప, వంగ, కందులు వగైరా ఇతర పంటలు కూడా పండిస్తారు. మామిడి, జీడిమామిడి తోటలు కూడా ఉన్నాయి. వ్యవసాయానికి భూగర్భ జలమే ఆధారం.