రామన్నపేట (బోయినపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామన్నపేట, కరీంనగర్ జిల్లా, బోయినపల్లి మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము రాజరాజేశ్వరస్వామి దేవస్థానం వేములవాడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామన్నపేటలో హనుమాన్ దేవాలయం ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. 3 నీటి రిజర్వాయర్లు ఉన్నాయి. గ్రామ జనాభా సుమారు 2500. మండల కేంద్రమైన బోయిన్ పల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనూ, జిల్లా కేంద్రమైన కరీంనగర్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి 162 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

బద్దం లచ్చిరెడ్డి 
రచయిత మరియు వ్యవసాయవేత్త. ఇతడు 1984 లోక్‌సభ ఎన్నికలలో మరియు 2004 శాసనసభ ఎన్నికలలో పోటీచేశాడు. బోయిన్‌పల్లి మండలంలోనే ఇతను మంచి రచయిత. ప్రజాకవి మరియు ప్రజానాయకుడిగా పేరుపొందాడు. 1984కు ముందు గ్రామసర్పంచి ఎన్నికలలో పోటీచేశాడు. 2010 సెప్టెంబరు 17న మరణించాడు.
రామన్నపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండలం బోయినపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03

భౌగోళిక స్వరూపం[మార్చు]

  • ఊరికి చుట్టుపక్కల మూడు కుంటలు మరియు ఒక చెరువు ఉంది.

ప్రత్యేకతలు[మార్చు]

  • ఈ గ్రామములో నల్లని రాయి విరివిగా లభించుట వలన "రాళ్ళ రామన్నపేట"గా పిలువబడుతుంది.
  • ఊరిచివరన ఒక ఎలుక బావి కలదు ఈ బావి నీటితో వ్యాధులు నయం అవుతాయని ప్రజల విశ్వాసం.
  • ఈ గ్రామములో 1200 ఎకరాలలో ప్రత్తి సాగు చేయబడును.
  • అంతేకాక 100 ఎకరాలలో వరి సాగు చేయబడును.
  • కూరగాయలు సిరిసిల్ల, వేములవాడ మరియు కరీంనగర్ పట్టణాలకు ఎగుమతి చేయబడును.
  • చదువులో కూడా ఈ ఊరి విద్యార్థులు ముందoజలో ఉన్నారు.
  • ఈ ఊరిలో ఈ మధ్యనే నీటి శుద్ధి కర్మగారమును ఏర్పాటు చేశారు.