రామలింగేశ శతకము
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
రామలింగేశ శతకము ను రచించినవారు శూరన కవి.
కవి,కాలాదులు[మార్చు]
శూరన కవి వంశమువారు ఐదారు తరములనుండి, విజయనగర సంస్థానాదీశులగు పూసపాటి వారిని ఆశ్రయించి యుండిరి. సా.శ. 1706 - 80 కాలంలో పాలించిన ... విజయరామ గజపతి కాలమున -- విజయరామరాజు కాలమునందే కొంత కాలమతని యాజ్ఞచేత రాజ్య పాలన చేసిన సీతా రామరాజు కాలమువాడు. ఈ విషయమును సూరన తనపద్యంలో ఈ విధంగా చెప్పుకున్నాడు.
ఇరువదిమూడు వూరుషము లిప్పటికయ్యె క్విత్వ వృత్తిచే
నరపతులెల్ల మెచ్చ బదులాల్గు తరంబులు మించు పిమ్మటన్
వెరవగు జీవనస్త్ఘితి లభించుట తొమ్ంజిదియయ్యె పూరుషాం
తరజులు నిక్కళింగవసుధాదవు చెంటట నాశ్రయించుటల్.
రచించిన ఇతర గ్రంధములు[మార్చు]
- ప్రబంధము : క్విజనరంజనము (ఇది పిల్ల వసుచరిత్ర యని పేరుబడసినది).
- శతకము : రామలింగేశ శతకము (ఆనాటి రాచరికపు నిరంకుశత్వమును నిర్భయముగా నిరసించుచూ ఈ శతకమును రచించెను. ఇందు సూరకవి కాలానికి సంబంధించిన జీవన స్థితి వివరణ ఉంది.)
- అలంకార గ్రంథము: చంద్రా లోకము (ఇందులో కొన్ని పద్యములు లోపించగా.... వానిని పరవస్తు వెంకటరంగాచార్యులు (1822.. 1900) పూరించిరి.)
- లక్షణ గ్రంథము : కవి శంశయ విచ్ఛేదము
- నిఘంటువు : ఆంధ్ర నామశేషము.
- దండకము : శ్రీరామ దండకము.
గ్రంథప్రాశస్త్యము[మార్చు]
ఈ శతకమును సూరన చూపిని రచనా పాటవమును బట్టి ఇతడు కవితా శూరుడని చెప్పవచ్చు. సూరన సమకాల లోకవృత్తము, నీతి, ఆనాటి రాజ్యపాలనా విధానము, వారి అధికార వాంఛ, ప్రజలు పడిన ఇబ్బందులు, మొదలగునవి కూలంకషంగా వివరింప బడినవి. ఈ శతకము సులభ గ్రాహ్యమైన శైలిలో నున్నందున సామాన్య ప్రజానీకములో సైతం చాల ప్రచారము గాంచింది. నరసింహ శతక కర్త శేషప్ప కవి ఈ రామలింగేశ శతకాన్ని అనుసరించడమే దీని ప్రాశస్త్యమును తెలియజేస్తున్నది.
- మచ్చుకు రెండు పద్యములు.
సీ. మాన్యంబులీయ సమర్థడొక్కడు లేడు
మాన్యముల్ చెఱుప సామంతులండ
ఱెండిన యూళ్ళగో డెరిగింప దెవ్వడు
పండిన యూళ్ళెన్న ప్రభువు నెల్ల
నితడు పేద యటంచు నెఱిగింప డెవ్వడు
కలవాని సిరి యెంచ గలరు చాల
తనయాలి చీటటిత ప్పెన్నడెవ్వడు-
బెఱకాంత ఱంకెన్న పెద్ద లండ
గీ. టిట్టిదుష్టుల కథికారమిచ్చినట్టి
రాజు ననవలెగాక దుర్నయులరగ
నేమిపని యున్నదిక సత్కవీంద్రులకును
రామ లింగేశ రామచంద్ర పురవాస.
సీ|| శ్రీమంతు నజ్ఞాప్తి సేయడొకండును
బరుల నేరము బెన్నబరుగులెత్తు
డోతలు న~ఫ్రికిన దోసమొన్న డొకండు
నడవి గొట్టుకుమని యాజ్ఞవెట్టు
నరది గోముంచిన సాటి చెప్ప డొకండు
తుప్ప గంటిన వానిదోస మెన్ను
నమ్మగొల్చిన వాని న్యాయ మొన్నడొకండు
దప్ప గొల్చిన వాని తప్పుజెప్పు
తే.గీ. నిట్టిపెద్దల కథికార మిచ్చినట్టి
రాజు ననవలె గాక దుర్నయుల ననగ
నేమిపనియున్న యది సత్కవీద్రులకును
రామ లింగేశ రామ చంద్ర పురవాస.
సూచికలు[మార్చు]
యితర లింకులు[మార్చు]