రామస్వామి పరమేశ్వరన్
మేజర్ రామస్వామి పరమేశ్వరన్ పరమ వీర చక్ర | |
---|---|
జననం | బొంబాయి, భారతదేశం | 1946 సెప్టెంబరు 13
మరణం | 1987 నవంబరు 25 శ్రీలంక | (వయసు 41)
రాజభక్తి | భారతదేశం |
సేవలు/శాఖ | భారత సైనిక దళం |
సేవా కాలం | 1972-1987 |
ర్యాంకు | మేజర్ |
యూనిట్ | 8 MAHAR attached to IPKF |
పోరాటాలు / యుద్ధాలు | శ్రీలంక అంతర్యుద్ధం ఆపరేషన్ విండ్ |
పురస్కారాలు | పరమ వీర చక్ర |
మేజర్ రామస్వామి పరమేశ్వరన్, PVC (1946 సెప్టెంబరు 13, ముంబయి - 1987 నవంబరు 25, శ్రీలంక) భారత సైనిక దళం నకు చెందిన సైనికాధికారి. ఆయన ధైర్యసాహసాలకు గానూ భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమ వీర చక్ర లభించింది. మేజర్ పరమేశ్వరన్‌కు 1972 జనవరి 16 న మహార్ రెజిమెంటులో షార్టు సర్వీసు కమిషన్ మంజూరు చేయడమైనది.
జీవిత విశేషాలు
[మార్చు]మేజర్ రామస్వామి పరమేశ్వరన్ 1946 సెప్టెంబరు 13 మహారాష్ట్ర లోని బొంబాయిలో జన్మించాడు. ఆయనకు, మహార్ రెజిమెంటులో షార్ట్ సర్వీస్ కమిషన్ 1972 జనవరి 16న మంజూరు చేసింది. అతను భారత సైన్యం చేపట్టిన అనేక కార్యకలాపాలలో పాల్గొన్నాడు. ఇండో-శ్రీలంక ఒప్పందం కింద భారత సైన్యానికి ఉన్న అనేక యూనిట్లు ఉన్నాయి. అందులో భాగంగా శాంతిభద్రతల నిర్వహించడానికి ఆయనను శ్రీలంకకు పంపారు. మహార్ రెజిమెంట్ కు చెందిన మేజర్ పరమేశ్వరన్ యూనిట్ కూడా ఆపరేషన్ పవన్ లో పాల్గొనేందుకు శ్రీలంక పంపబడింది. 1987 నవంబరు 25న మేజర్ పరమేశ్వరన్ రాత్రి ఆలస్యంగా గాలింపు చర్యల నుండి తన స్థానానికితో తిరిగి, అకస్మాత్తుగా, తన స్థానంపై తీవ్రవాదులు సమూహం మెరుపుదాడికి పాల్పడ్డారు. ఆయన ప్రశాంతమైన మనస్సుతో వెనుక నుండి తీవ్రవాదులను చుట్టుముట్టి కాల్పులు జరిపి వారిని ఆశ్చర్యానికి గురిచేసాడు. తరువాత సమీపంగా జరిగిన యుద్ధంలో ఒక తీవ్రవాది ఆయన గుండెల్లో కాల్చాడు. గాయానికి భయపడకుండా ఆ తీవ్రవాది నుండి రైఫిల్ తీసుకొని దానితో ఆయను చంపాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన ఆదేశాలను యిస్తూ వారి కమాండెంట్స్ కు స్ఫూర్తిని అందిస్తూ తుదిశ్వాస విడిచాడు. ఈ చర్యలో ముగ్గురు మిలిటెంట్లు మరణించారు. మూడు రైపిల్స్, రెండు రాకెట్ లాంచర్లు స్వాధీనం చేసుకున్నారు.
పరమ వీర చక్ర మూలం
[మార్చు]ఆయనకు భారత అత్యున్నత సైనిక పురస్కారం పరమ వీర చక్ర లభించింది. దాని మూలం భారత సైనిక దళ అధికారిక వెబ్‌సైటులో ఈ క్రింది విధంగా నమేదు చేయబడింది.
CITATION
MAJOR RAMASWAMY PARAMESWARAN
8 MAHAR (IC-32907)
On 25 November 1987, when Major Ramaswamy Parameswaran was returning from search operation in Sri Lanka, late at night, his column was ambushed by a group of militants. With cool presence of mind, he encircled the militants from the rear and charged into them, taking them completely surprise. During the hand-to-hand combat, a militant shot him in the chest. Undaunted, Major Parameswaran snatched the rifle from the militant and shot him dead. Gravely wounded, he continued to give orders and inspired his command till he breathed his last. Five militants were killed and three rifles and two rocket launchers were recovered and the ambush was cleared.
Major Ramaswamy Parameswaran displayed the most conspicuous gallantry and thought nothing of dying at his post.[1]
ఒక అపార్టుమెంటు పేరు
[మార్చు]చెన్నైలోని ఆర్కోట్ రోడ్ లో ఆర్మీ వెల్ఫేర్ బోర్డు నిర్మించిన కాలనీకి A.W.H.O పరమేశ్వరన్ విహార్ అని 1998లో నామకరణం చేసారు.
మూలాలు
[మార్చు]- ↑ The Param Vir Chakra Winners (PVC), Official Website of the Indian Army, retrieved 28 August 2014