Jump to content

రాము రాథోడ్

వికీపీడియా నుండి
రాము రాథోడ్ జానపద గాయకుడు
జననం
రాము రాథోడ్

ఇతర పేర్లురాము
వృత్తిగాయకుడు, నటుడు
పేరుపడ్డదిజానపద గాయకుడు
తల్లిదండ్రులు
  • కిషన్ నాయక్ (father)
  • కమలాబాయి (mother)

రాము రాథోడ్ (ఆంగ్లం: Ramu Rathod), తెలంగాణ రాష్ట్రం, మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన తెలుగు జానపద పాటల గాయకుడు. జానపద కళలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని ఆధునీకరించడాని కృషి చేస్తున్నాడు. తనకంటు ఒక ప్రత్యేక శైలిని సృష్టించి యూట్యూబ్ ద్వారా ప్రసిద్ధి చెందాడు.[1][2][3][4].

2025లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా ఆయన పాల్గొన్నాడు.[5]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

రాము రాథోడ్ తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూర్ మండలం, గోపాలపూర్ (ఖుర్ద్) తాండ కు చేందిన బంజారా లంబాడీ గిరిజన జానపద గాయకుడు. కిషన్ నాయక్, కమలాబాయి దంపతుల ఐదో సంతానం. చిన్నప్పటినుండి టేప్ రికార్డర్ పాటల పైన నృత్యం చేసేవాడు.‌ పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డ్యాన్స్ చేస్తూ అందరిని మైమరిపించే వాడు. అతని డ్యాన్స్ చేసి ఉపాధ్యాయులు తొటి విద్యార్థులతో మన్ననలు పొందేవాడు. ప్రాథమిక విద్య వివేకానంద పాఠశాల భూత్పూర్ మండలం లోను ఇంటర్, డిగ్రీ విద్య, మహబూబ్ నగర్ లోను పూర్తి చేశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

రాము రాథోడ్ కు బాల్యం నుండే పాటలు, నృత్యం అంటే చాలా ఇష్టం.తండ్రి కిషన్ నాయక్ కు సంగీతం లోనూ అభిరుచి ఉండేది.అతడు టేప్ రికార్డు క్యాసెట్ పాటల పైన రాము చిక్కటి డ్యాన్స్ చేసేవాడు. కుమారుని ప్రోత్సహిస్తూ తండ్రి కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా పాటలకు సంబంధించిన క్యాసెట్లు అంగడి నుండి కొని తెచ్చి రాముకు వినిపించే వాడు. అదే రాముకు అలవాటుగా మారిపోయింది.తాండ లో జరిగే పెళ్ళి కార్యక్రమంలో పాల్గొని నృత్యం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డ్యాన్స్ చేస్తూ అందరిని మైమరిపించే వాడు. ప్రజా కవి గోరటి వెంకన్న పాటలు మాటలకు ఆకర్షితులై రాము అతని స్పూర్తితో రచయిత గాయకుడిగా మారాడు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు, నృత్యాలతో ఎన్నో వేదికలు పెంచుకున్న రాము అందరినీ ఆకట్టుకున్నాడు.

గుర్తింపు

[మార్చు]

రాము రాథోడ్ పాడిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. అతను పాడిన పాట ' రాను బొంబాయికి రాను ' పాట ‌యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఈ పాటకు మంచి ఆదరణ లభించడంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించాడు. సొమ్మసిల్లి పోతున్న వే ఓ చిన్న రాములమ్మ.. పాటను కూడా ఆయన రచించి స్వయానా పాడినాడు. ఈ పాటను ‌మజాకా సినిమాలో రీక్రియేట్ కూడా చేయడం జరిగింది.[6][7][8].

పాటలు

[మార్చు]

రాము రాథోడ్ రాసి పాడిన పాటలు

  • రాను ముంబై కి రాను[9]
  • సొమ్మసిల్లి పోతున్న వే ఓ చిన్న రాములమ్మ పార్ట్ వన్
  • సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ పార్ట్ టూ
  • పల్లిపోకే సక్కుని సీతమ్మ
  • మార్ టాంగెన ఘుగర

కోటి రూపాయలు నజరానా

[మార్చు]

ఓ మారుమూల తాండ గిరిజన కుటుంబంలో జన్మించిన రాము రాథోడ్, యూ ట్యూబర్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన చేసిన డ్యాన్స్ కు, రాసిన పాట 'రాను బొంబైకి రాను' యూ ట్యూబ్ నుంచి కోటి రూపాయలు సంపాదించాడు. దాంతో ఇప్పుడు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా పేరు ప్రతిష్టలు పొందుతారు. ఊరు దాటకుండా ప్రపంచాన్ని ఊపేయవచ్చని నిరూపించిన రాము రాథోడ్ కోటి రూపాయలు సంపాదించడం అయిన చేసిన కృషి,కష్ట సాధన, చేసిన ఖర్చుకు లభించిన గొప్ప విజయమని భావిస్తున్నారు[10].

మూలాలు

[మార్చు]
  1. "'రాను.. బొంబాయి'కి అంటూనే లక్షల్లో కొల్లగొట్టేశారు | RAMU RATHOD Ranu Bombai Ki Ranu Song Full Details | Sakshi". www.sakshi.com. Retrieved 2025-05-16.
  2. Telugu, TV9 (2025-02-25). "Sundeep Kishan : పాటకు ప్రాణం పోసిన మజాకా టీం.. ఒరిజినల్ సింగర్‏తోనే పాడించేశారుగా.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే". TV9 Telugu. Retrieved 2025-05-15.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Nagaiah, Bhoopathi (2025-04-03). "Folk Singer: ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రాము రాథోడ్". www.dishadaily.com. Retrieved 2025-05-15.
  4. Velugu, V6 (2025-07-24). "ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న.. తెలంగాణ జానపదం". V6 Velugu. Retrieved 2025-07-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Bigg Boss Telugu 9 Contestant Ramu Rathod: Here's what we know about the 'Ranu Bombayi Ki Ranu' singer". The Times of India. 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
  6. "Mazaka: ఒరిజినల్ సింగర్‌తోనే పాట పాడించారు.. వెనక్కి తగ్గిన మజాకా టీం". Samayam Telugu. Retrieved 2025-05-16.
  7. S, Hari Prasad. "రాను బొంబయికి రాను సాంగ్ లిరిక్స్.. యూట్యూబ్‌లో 22 కోట్ల వ్యూస్.. లెక్కలేనన్ని రీల్స్, ఇప్పటికీ టాప్ ట్రెండింగ్". Hindustantimes Telugu. Retrieved 2025-05-16.
  8. techteam (2025-02-21). "The Sensational Folk Song of The Year from Mazaka". English site (in ఇంగ్లీష్). Retrieved 2025-05-16.
  9. "Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ.. | Latest Telugu Folk Songs Trending On Worldwide, Check Out Interesting Story Inside | Sakshi". www.sakshi.com. Retrieved 2025-07-12.
  10. "'రాను బొంబైకి రాను' .. కోటి తెచ్చింది నిజమే: రాము రాథోడ్". ap7am.com. 2025-07-23. Retrieved 2025-07-25.