Jump to content

రామ్‌కుమార్ (చిత్రకారుడు)

వికీపీడియా నుండి
రామ్‌ కుమార్
జననం(1924-09-23)1924 సెప్టెంబరు 23 [1]
సిమ్లా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం2018 ఏప్రిల్ 14(2018-04-14) (వయసు 93)
జాతీయతభారతీయుడు
రంగంచిత్రకళ
శిక్షణశారద ఉకిల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, న్యూఢిల్లీ (1945)
అవార్డులులలిత కళాసమితి ఫెలోషిప్, 2011[2]

పద్మ భూషణ, 2010[3]
జీవితకాల సాఫల్య పురస్కారం,
న్యూఢిల్లీ ప్రభుత్వం[4]

ఆఫీసర్స్ ఆర్ట్స్ ఎత్ లెటర్ , 2003
కాళిదాసు సమ్మాన్, 1986
ప్రేం చంద్ పురస్కారం, 1972
పద్మశ్రీ, 1972

జె.డి.రాక్‌ఫెల్లర్ ఫెలోషిప్, న్యూయార్క్ 1970[5]

రామ్‌ కుమార్ (1924 – 2018) భారతీయ చిత్రకారుడు, రచయిత. అతడు ప్రసిద్ధ అమూర్త భావనా చిత్రకారులలో ఒకడు.[6] అతడు ఒక ఆధునిక వాది. ఎం.ఎఫ్‌. హుస్సేన్‌, ఎఫ్‌.ఎన్‌. సౌజా, హెచ్‌.గాడే, ఎస్‌.హెచ్‌. రాజా తదితరులతో కూడిన ప్రోగ్రెసివ్‌ ఆర్టిస్ట్‌ బృందంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ బృందంతో కలిసి అతడు భారత కళల పట్ల నూతన ఒరవడిని సృష్టించాడు. అతడు ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రిస్తాడు.[7] అమూర్త చిత్రకళ కొరకు ఫిగరేటివ్ చిత్రాలను గీసిన మొదటి భారతీయులలో ఒకనిగా గుర్తింపబడ్డాడు.[8] గృహాలలో, అంతర్జాతీయ మార్కెట్ అతని చిత్రాలు ఎక్కువ ధరలకు అమ్ముడవుతాయి. అతడు గీసిన "ద వేగబాండ్" న్యూయార్క్ లో $1.1 మిలియన్ల ధర పలికింది. ఇది ఒక ప్రపంచ రికార్డు. రచనలోను, చిత్రకళలోనూ రాణించిన కొద్ది భారతీయ ఆధునికవాదులలో అతను ఒకడు[9]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

రామ్‌ కుమార్ వర్మ హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మిచాడు.[10] అతడి తండ్రి పంజాబ్ లోని పాటియాలాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసాడు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో సివిల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసాడు.[11][12] రామ్‌ కుమార్ న్యూఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఎం.ఎ (ఆర్థిక శాస్త్రం) లో పట్టాను పొందాడు.[13] 1945లో అయడు ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అవకాశం పొందాడు.[14] ఒకనాటి సాయంత్రం, సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలోని తన స్నేహితులతో పాటు కన్నాట్ ప్లేస్‌లో తిరుగుతూ అనుకోకుండా అక్కడి కళా ప్రదర్శనలో అడుగుపెట్టాడు.[15]

రామ్‌ కుమార్ "శైలోజ్ ముఖర్జీ" నడుపుతున్న శారదా ఉకిల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో తరగతులను నిర్వహించేవాడు.[16] శైలాజ్ ముఖర్జీ శాంతినికేతన్ స్కూలులో చిత్రకారుడు. అతడు రామ్‌కుమార్ కు సజీవ మోడల్స్‌లోచిత్ర కళను పరిచయం చేసాడు.[17] అక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు అతడు "రాజా" ను ఒక ప్రదర్శనలో కలిసాడు. రాజా, రామ్‌ లు మంచి స్నేహితులైనారు.[18] పెద్ద చదువులను పారిస్ లో "ఆండ్రి లోటే", "ఫెర్నాండ్ లెగెర్" ల వద్ద చదువుకొనుటకు రామ్‌ కుమార్ తన తండ్రిని ఒప్పించాడు.[19] పారిస్ లో పసిఫిక్ శాంతి ఉద్యమం ఆయనను ఆకర్షించింది. అతడు ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. అక్కడ సామాజిక వాస్తవ వాదులైన "కాతే", ఫోర్గెనన్ ల ప్రభావానికి లోనయ్యాడు.[20] అతడిని ప్రసిద్ధ చిత్రకారులైన ఎస్.హెచ్.రాజా, ఎం.ఎఫ్.హుస్సేన్ లతో స్నేహం కుదిరింది.[21]

జీవితం

[మార్చు]

అతడు అమూర్త చిత్రాలను సాధారణంతో తైలం లేదా ఎక్రిలిక్ లతో వేసాడు.[22] అతడు "ప్రోగ్రెసివ్ ఆర్టిస్టు గ్రూపు" తో మంచి సంబంధాలను కలిగి ఉండేవాడు.[23]

రామ్‌ కుమార్ భారతదేశంలోనే కాక అనేక దేశాలలో చిత్రప్రదర్శనలలో పాల్గొన్నాడు. అందులో 1958 లో జరిగిన వెనిస్ బిన్నేల్ ఒకటి.[24] 1987, 1988 లలో యు.ఎస్.ఎస్.ఆర్, జపాన్ లలో జరిగిన భారతీయ ఉత్సవాలలో పాల్గొన్నాడు.[25] అతడు 2008 లో ఢిల్లీలో సోలో ఎగ్జిబిషన్ ను ఇటీవల నిర్వహించాడు.[26] అతడు హిందీ లో రచనలు చేసాడు. అతడు రాసిన రచనలు ఎనిమిది సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. అందులో రెండు నవలలు, ఒక యాత్రా చరిత్ర వర్ణన ఉన్నాయి.[27]

ఆయన గీసిన తొలి చిత్రాలలో నగర జీవన పరిస్థితి ప్రధాన అంశంగా ఉండేది.[19][28] చిత్రాలలో ప్రత్యేకంగా వారణాసిలో, దాని శిథిలమైన, పాడైపోయిన ఇళ్ళు, నిరాశాజనక భావాలను తెలియచేస్తుంది.[29]

ప్రకృతి ప్రదేశాల ఉల్లాసం, మానవ సమాజంలో జరిగిన హింసను చూపించే చిత్రాలను గీసాడు.[19]

భారతీయ కళలో ఆసక్తి పెరిగినందున, రామ్ కుమార్‌ చిత్రలేఖనాల కళకు మార్కెట్లో గుర్తింపు పెరిగింది.[30]

రామ్‌ కుమార్ 1972 లో భారత ప్రభుత్వంనుండి పద్మశ్రీ[31] , 2010 లో భారత మూడవ అత్యున్నత పద్మభూషణ్ పురస్కారం పొందాడు.[32]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రామ్‌ కుమార్ ప్రముఖ హిందీ రచయిత నిర్మల్ వర్మ కు అన్నయ్య. కల్నల్ రాజ్ కుమార్ వర్మకు తమ్ముడు. అతడు న్యూఢిల్లో నివసించాడు.

పురస్కారాలు

[మార్చు]
  • జాన్ డి. రాకెఫెల్లర్ III ఫెలోషిప్, న్యూయార్క్ , 1970[33]
  • పద్మశ్రీ, భారత ప్రభుత్వం, 1972
  • ప్రేమ్‌చంద్ పురస్కారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం , 1972
  • కాళీదాస్ సమ్మాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం , 1986
  • ఆఫీసర్స్ ఆర్ట్స్ ఎత్ లెటర్ల్స్, ఫ్రాన్స్ ప్రభుత్వం , 2003
  • జీవిత కాల సాఫల్య పురస్కారం, న్యూఢిల్లీ ప్రభుతం , 2010
  • పద్మభూషణ పురస్కారం, భారత ప్రభుత్వం , 2010
  • లలిత కళా అకాడమీ ఫెలోషిప్ , 2011

మూలాలు

[మార్చు]
  1. India Who's who 1995-96, p. 273
  2. "The fellowship of Shri Ram Kumar". Lalit Kala Akademi. Retrieved 29 March 2012.[permanent dead link]
  3. "Padma Bhushan Awardees". Retrieved 25 March 2012.
  4. "Lifetime Achievement Award". The Times of India. Archived from the original on 2012-07-09. Retrieved 28 March 2012.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Bio Summary అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. "Ram Kumar". Indian and foreign review. 24. Ministry of Information and Broadcasting (India): 20. 1986. ISSN 0019-4379.
  7. "Progressive artist's group". Retrieved 26 March 2012.
  8. "Ram Kumar artistic intensity of an ascetic". Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 26 March 2012.
  9. "Portrait of an Artist". Outlook. Retrieved 28 March 2012.
  10. "Biography". Retrieved 28 March 2012.
  11. "ArtistInterview". Saffron Art. Retrieved 28 March 2012.
  12. "Nirmal Verma Obituary". Rediff. Retrieved 30 March 2012.
  13. Lal, Sham; Gagan Gill (1996). Ram Kumar: a journey within. Vadehra Art Gallery. p. 209. OCLC 36556291.
  14. "Ram Kumar Interview". Saffron Art. Retrieved 28 March 2012.
  15. "True Colours". Indian Express. 19 December 2010. Retrieved 28 March 2012.
  16. "Ram Kumar: Artistic Intensity of an Ascetic". Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 28 March 2012.
  17. "Ram Kumar a transition from figurative". Archived from the original on 1 నవంబరు 2011. Retrieved 30 March 2012.
  18. "Artist Profile". The Art Trust. Archived from the original on 3 ఫిబ్రవరి 2014. Retrieved 30 March 2012.
  19. 19.0 19.1 19.2 Treves, Toby (2006). Indian art: the moderns revisited, Volume 1. Vadehra Art Gallery. p. 42. ISBN 978-81-87737-19-3.
  20. "Artistic intensity of an ascetic". Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 1 April 2012.
  21. Kapur, Geeta (1978). Contemporary Indian artists. Vikas. p. 49. ISBN 978-0-7069-0527-4.
  22. Chawla, Rupika (1995). Surface and depth: Indian artists at work. Viking. p. 105. ISBN 978-0-670-86174-3.
  23. "Progressive artist's group". Retrieved 25 March 2012.
  24. Jachec, Nancy (2008). Politics and painting at the Venice Biennale, 1948–64: Italy and the idea of Europe. Manchester University Press. p. 175. ISBN 978-0-7190-6896-6.
  25. Vishwambara, K. S. (1998). Movement in Indian art, a tribute. Karnataka Chitrakala Parishath. p. 91. OCLC 62857926.
  26. "A colourful friendship". Indian Express. 18 January 2008. Retrieved 26 September 2009.
  27. Kumar, Ram (2004). The face & other stories. Vadehra Art Gallery. p. 16. ISBN 978-81-87737-06-3.
  28. Lal, Sham (2003). Indian realities in bits and pieces. Rupa & Co. p. 513. ISBN 978-81-291-0247-8.
  29. "Breadth of lifescapes". The Hindu. 7 July 2002. Archived from the original on 28 డిసెంబరు 2009. Retrieved 26 September 2009.
  30. "Second knock". Lucknow Newsline. Indian Express Group. 24 September 2005. Retrieved 26 September 2009.[permanent dead link]
  31. "Search Awardees". My India, My Pride. National Informatics Centre. Archived from the original on 31 జనవరి 2009. Retrieved 26 September 2009.
  32. "Doctors and artists in Delhi's Padma gallery". The Times of India. 26 January 2010. Archived from the original on 11 ఆగస్టు 2011. Retrieved 11 April 2010.
  33. "Artist Bio". Retrieved 29 March 2012.

బయటి లంకెలు

[మార్చు]